ఇప్పుడు కొనడం ఆపేయండి.. సెప్టెంబర్ నెలలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు..కీలక ఒప్పదంపై ఆశలు
మంగళవారం అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో పసిడి ధరలు గణనీయంగా పతనం అయ్యాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల దిశపై సంకేతాలు, అలాగే బులియన్ దిగుమతులపై అమెరికా సుంకాల నిర్ణయం, US ద్రవ్యోల్బణ డేటా వంటి కీలక పరిణామాల కోసం పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ పసిడి పతనం చోటుచేసుకుంది. గత శుక్రవారం ఔన్సుకు 3,408.06 డాలర్లకు వరకు ఎగబాకిన స్పాట్ గోల్డ్..మంగళవారం 1.4 శాతం క్షీణించి 3,300.94 వద్దకు చేరింది. ఇది జూలై 23 తరువాత అత్యధిక స్థాయి నుండి వచ్చిన పతనం ఇదే.
బంగారు బార్ల దిగుమతులపై అమెరికా సుంకాలు విధించబోతుందనే వార్తలతో బులియన్ మార్కెట్లో Gold ధరలు పెరిగాయి. అయితే ట్రంప్ ఎటువంటి సుంకాలు విధించడం లేదని చెప్పడంతో పసిడి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. Gold మీద సుంకాలు లేకపోవడంతో పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇతర ఆస్తుల వైపు వాటిని మళ్లించారు.

ఇక అమెరికా వినియోగదారుల ధరల సూచీ (CPI) డేటా కూడా మార్కెట్ లో పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజా అంచనాల ప్రకారం..ట్రంప్ విధించిన కొత్త సుంకాలు ప్రధాన ద్రవ్యోల్బణాన్ని 0.3 శాతం పెంచి, వార్షిక రేటును 3 శాతం వరకు తీసుకెళ్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఫెడరల్ రిజర్వ్ లక్ష్యమైన 2 శాతం కంటే గణనీయంగా ఎక్కువగా చెప్పుకోవచ్చు.
US ఉద్యోగాల నివేదిక అంచనాలకు మించిన వృద్ధిని చూపడంతో.. సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాన్ని మార్కెట్లు దాదాపు 90 శాతం వరకు అంచనా వేస్తున్నాయి.ఈ ఏడాది చివర్లో కనీసం ఒకసారి రేటు కోత అమలు అవుతుందని కూడా భావిస్తున్నారు. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గడం, వడ్డీ ఆదాయం లేని బంగారం వంటి ఆస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఇది వచ్చే నెలలో జరిగే అవకాశం ఉంది కాబట్టి సెప్టెంబర్ నెలలో పసిడి ధరలు మరింతగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
వాణిజ్య రంగంలో, వాషింగ్టన్‌తో చైనాకు ఉన్న సుంకాల ఒప్పంద గడువు ముగిసింది. మరో 90 రోజుల పాటు అదే సుంకాలు కొనసాగుతాయని ట్రంప్ ప్రకటించారు. దీంతో పసిడి ధరలు నేల చూపులు చూశాయి. ఇక వచ్చే శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య కీలక సమావేశం కొనసాగనుంది. ఈ భేటీలో ఉక్రెయిన్-రష్యా శాంతి ఒప్పందంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ అంశాలు బంగారానికి ఉన్న సేఫ్-హావెన్ డిమాండ్‌ను కొంతవరకు తగ్గించాయని SP ఏంజెల్ విశ్లేషకుడు జాన్ మేయర్ చెబుతున్నారు. పై అంశాలన్నీ పరిగణలోకి తీసుకుంటే సెప్టెంబర్ నెలలో Gold ధర తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications