Gold Rate: షాకిస్తున్న బంగారం ధర.. మరోసారి పెరిగిన రేటు..
బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. దేశీయంగా కాకుండా అంతర్జాతీయంగా కూడా గోల్డ్ రేట్లు పెరిగాయి. గురువారం ఉత్తర అమెరికా ట్రేడింగ్ వేళల్లో బంగారం ధరలు గణనీయంగా పెరగడంతో భారత్‌లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. యూఎస్ ప్రభుత్వం నుంచి కీలక ఆర్థిక డేటా విడుదల తర్వాత యూఎస్ మార్కెట్ ట్రేడింగ్‌లో బంగారం ధరలు 0.5 శాతానికి పైగా వృద్ధి చెందాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు పెరుతున్నట్లు చెబుతున్నారు.
ఒక వేళ అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే, యూరప్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రెపో రేటును తగ్గించే అవకాశం ఉంది. ఇది జరిగితే ప్రజల రుణాలపై EMIలను తగ్గిస్తుంది. దీంతో బంగారంపై పెట్టుబడి పెడితే ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ ఉదయం MCX మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం జూన్ ఆర్డర్ ధర 0.21 శాతం పెరిగి రూ.71,363 వద్ద ట్రేడవుతోంది. అలాగే వెండి ధర 0.53 శాతం పెరిగి రూ.81,111 గా ఉంది.

దేశీయంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.490 పెరిగి రూ.73,690 వద్ద కొనసాగుతోంది. ఇక తులం 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.67,550 గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 66,240 గా ఉండగా.. తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,260 గా ఉంది. కోల్ కత్తాలో తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,260 ఉండగా.. 22 క్యారెంట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.66,240 గా ఉంది.
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,090 గా ఉండగా.. 24 క్యారెట్ల తులం స్వర్ణం ధర రూ.73,190 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల తులం పుత్తడి ధర రూ.66390 గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,410 కొనసాగుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,249 ఉండగా.. 24 క్యారెట్ల తులం స్వర్ణం రేటు రూ. 72,269 గా ఉంది. మన హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,260గా ఉంది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66,240గా ఉంది.


Click it and Unblock the Notifications