Gold Rate: షాక్.. పసిడి ప్రియులపై ధరల పిడుగు.. 4 రోజు రూ.2,100 పెరిగిన గోల్డ్..!!
Gold Price Today: ఫెడ్ రేట్ల తగ్గింపుతో పెరిగిన గోల్డ్ రేట్లు తమ జోరును కొనసాగిస్తూనే ఉన్నాయి. వరుసగా నాలుగు రోజుల నుంచి పసిడి ధరలు అన్ స్టాపబుల్ రైజ్ కొనసాగిస్తున్నాయి. దీంతో గతంలో ఎన్నడూ చూడని రేట్లకు గోల్డ్ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. అంతర్జాతీయంగా పరిణామాలు సైతం ప్రస్తుతం పసిడి ధరలను రోజురోజుకూ పెంచేస్తున్నాయి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.2000 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన పసిడి ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7000, ముంబైలో రూ.7000, దిల్లీలో రూ.7015, కలకత్తాలో రూ.7000, బెంగళూరులో రూ.7000, కేరళలో రూ.7000, వడోదరలో రూ.7005, జైపూరులో రూ.7015, మంగళూరులో రూ.7000, నాశిక్ లో రూ.7003, అయోధ్యలో రూ.7015, గురుగ్రాములో రూ.7015, బళ్లారిలో రూ.7000, నోయిడాలో రూ.7015 వద్ద విక్రయించబడుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే ఏకంగా నేడు రూ.2100 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7636, ముంబైలో రూ.7636, దిల్లీలో రూ.7651, కలకత్తాలో రూ.7636, బెంగళూరులో రూ.7636, కేరళలో రూ.7636, వడోదరలో రూ.7641, జైపూరులో రూ.7651, మంగళూరులో రూ.7636, నాశిక్ లో రూ.7639, అయోధ్యలో రూ.7651, గురుగ్రాములో రూ.7651, బళ్లారిలో రూ.7636, నోయిడాలో రూ.7651గా ఉంది.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7000గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7636 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.100 తగ్గి నేడు రూ.98,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఆర్థిక ఆరోగ్యం, స్థిరత్వాన్ని కొనసాగించే క్రమంలో.. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల పసిడి కొనుగోళ్లు ప్రస్తుత ధరల పెరుగుదలకు కీలక కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పసిడి డిమాండ్ పెరగడం, ముఖ్యంగా ఆర్థిక అస్థిరతలు లేదా మునుపటి కంటే ఎక్కువ రిస్క్ ఉన్న సమయంలో ధరలను ప్రభావితం చేస్తుంది. కేంద్ర బ్యాంకులు తమ ఆర్థిక విధానాలను సానుకూలంగా మార్చినప్పుడు, గోల్డ్ హోల్డింగ్స్ ఎక్కువగా ఉండటాన్ని భద్రతగా భావించి, భారీగా కొత్త నిల్వలు పెంచుతుంటాయి. ఇది పరోక్షంగా మార్కెట్లలో ధరల పెరుగుదలకు దారితీస్తుంటాయి.


Click it and Unblock the Notifications