Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. మరోసారి పెరిగిన పసిడి ధర..
బంగారం ధర క్రమంగా పెరుగుతోంది. దీపావళి పెరుగుతూ వచ్చిన పుత్తడి ధర జనవరి 3 నుంచి తగ్గుతూ వచ్చింది. కానీ జనవరి 13 బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. ఈ రోజు జనవరి 15, 2024 ఉదయం భారతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. క్రితం రోజు స్థిరంగా ఉన్న బంగారం ధరలు సోమవారం కాస్త పెరిగాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.170 చొప్పున పెరిగినట్లు తెలుస్తోంది.
అదే విధంగా 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.150 చొప్పున పెరిగినట్లు సమాచారం. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.63,440 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 58,150 ఉంది. జాతీయస్థాయిలో 10 గ్రాముల బంగారం రూ.62 వేలు దాటితే, వెండి కిలో ధర రూ.72 వేలు దాటింది. 999(24 క్యారెట్స్) స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62723గా ఉంది. వెండి కిలో ధర రూ.72146గా ఉంది.

ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, శుక్రవారం సాయంత్రం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.62515 ఉండగా.. ఈరోజు (సోమవారం) ఉదయం రూ.62,723కి పెరిగింది. 916 (22 క్యారెట్లు) స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.57454గా ఉంది. 750 (18 క్యారెట్లు) స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.47042 గా ఉంది.
మిస్డ్ కాల్ ద్వారా బంగారం, వెండి ధరలను తెలుసుకోవచ్చు. 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారం ధరను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. కొంత సమయం లోపు మీరు SMS ద్వారా రేటు సమాచారాన్ని పొందుతారు. అదే సమయంలో, మీరు అధికారిక వెబ్‌సైట్ ibjarates.comని సందర్శించడం ద్వారా ఉదయం, సాయంత్రం గోల్డ్ రేట్ అప్‌డేట్‌లను తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications