బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ కస్టమర్లను ఆందోళను కలిగిస్తున్నాయి, అలాగే ప్రతిరోజూ కొత్త రికార్డ్ స్థాయిని చేరుతున్నాయి. ఈరోజు కూడా బంగారం ధర పెరుగుతుందా తగ్గుతుందా అనే అంచనాల మధ్య బంగారం ధరల పెంపుకు బ్రేకులు పడ్డట్టు అయ్యింది. దింతో ఈ రోజు 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.25 తగ్గి రూ.8,050, 24 క్యారెట్ల ధర రూ.27 తగ్గి రూ.8,782, 18 క్యారెట్ల ధర రూ.20 తగ్గి రూ.6,587. అయితే ఈ ఏడాది మొదటి నెల ప్రారంభం నుంచే బంగారం ధరల పెంపు మొదలైంది. చాలా రోజులు దిగొస్తాయనున్న ధరలు మాత్రం రోజురోజుకి కొండెక్కి కూర్చున్నాయి. ఈ విధంగా చూస్తే ఈ ఏడాదిలో ఇప్పటివరకు పసిడి ధరలు అంచనాలకు మించి పెరిగాయి అని చెప్పవచ్చు.
ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు..
ప్రస్తుత ఏడాదిలో బంగారం ధర అనూహ్య స్థాయికి పెరుగుతోంది, దీని వాళ్ళ పసిడి కొనుగోలుదారుల్లో షాక్‌వేవ్ కలిగిస్తోంది. ఇక సామాన్యుడి అంచనా బంగారం ధర 1,00,000 దాటుతుందేమో అనే భయపడే స్థాయికి పెరుగుతుంది. ప్రస్తుతం మాత్రం రేట్లు తులం ధర రూ.90,000 దాటుతుందేమోనని భయాలు వ్యక్తమవుతున్నాయి. మన దేశంలో ప్రజలు బంగారు ఆభరణాలుగా ఎక్కువగా ఇష్టపడతారు. అందువల్ల బంగారం ధర పెంపు సమాజంలోని అన్ని వర్గాలను, సామాన్యుల నుండి సంపన్నుల వరకు ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. మరోవైపు బంగారాన్ని కూడా సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు, కాబట్టి చాలా మంది దీనిని కొనడానికి ఇష్టపడతారు. ఇక బంగారం ధర పడిపోయినప్పుడు కొనవచ్చని భావించే వారికి పరిస్థితులు షాక్ ఇస్తున్నాయి. అమెరికాలో అధ్యక్షుడు మారినప్పటి నుండి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. డోనాల్డ్ ట్రంప్ దూకుడుగా పన్ను చర్యలు తీసుకోవడం వల్ల బంగారంలో పెట్టుబడులు పెరిగాయి. అందువల్ల, బంగారం ధర జెట్ వేగంతో కాదు, మెరుపు వేగంతో పెరుగుతోందని చెప్పాలి.

ఈరోజు 10 గ్రాముకు 22 క్యారెట్ల బంగారం ధర రూ.80,500 నిన్నటి ధర రూ.80,750 అంటే రూ.250 తగ్గింది.
24 క్యారెట్ల బంగారం ధర రూ.87,820 నిన్నటి ధర రూ.88,090 దింతో రూ.270 పడిపోయింది.
18 క్యారెట్ల బంగారం ధర రూ.65,870 నిన్న రూ.66,070 దింతో రూ.200 దిగొచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు :
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.80,500, 24 క్యారెట్లకు రూ.87,820, 18 క్యారెట్లకు రూ.65,870
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.80,500, 24 క్యారెట్లకు రూ.87,820, 18 క్యారెట్లకు రూ.65,870
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.80,500, 24 క్యారెట్లకు రూ.87,820, 18 క్యారెట్లకు రూ.65,870
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.80,500, 24 క్యారెట్లకు రూ.87,820, 18 క్యారెట్లకు రూ.65,870
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.80,500, 24 క్యారెట్లకు రూ.87,820, 18 క్యారెట్లకు రూ.65,870
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.80,500, 24 క్యారెట్లకు రూ.87,820, 18 క్యారెట్లకు రూ.65,870
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.80,500, 24 క్యారెట్లకు రూ.87,820, 18 క్యారెట్లకు రూ.65,870
కడపలో 22 క్యారెట్ల ధర రూ.80,500, 24 క్యారెట్లకు రూ.87,820, 18 క్యారెట్లకు రూ.65,870
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.80,500, 24 క్యారెట్లకు రూ.87,820, 18 క్యారెట్లకు రూ.65,870
ఇక వెండి ధర చూస్తే 10 గ్రాములకి రూ.300 తగ్గి రూ.1,060, కేజీ ధర రూ. 3,000 తగ్గి రూ.1,06,000.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.


Click it and Unblock the Notifications