ఈ ఏడాది మొదటి నుంచి బంగారం ధరలు ప్రతిరోజూ కొత్త రికార్డును సృష్టిస్తున్నాయి, నిన్న కూడా పసిడి ఆల్ టైం హై గరిష్టాన్ని తాకింది. ఈరోజు బంగారం, వెండి సహా ఇతర విలువైన లోహాల ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయ అని ఆభరణాల వ్యాపారులు ఎదురు చూస్తుండగా వరుసగా నేడు కూడా బంగారం ధర షాకిచ్చింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి.
22 క్యారెట్ల బంగారం 1గ్రాము ధర రూ.25 పెరిగి రూ.7,930, 24 క్యారెట్ల 1గ్రాము ధర రూ.27 పెరిగి రూ.8,651గా ఉంది. ఇక 18 క్యారెట్ల 1గ్రాము ధర రూ.20 పెరిగి రూ.6,488కి చేరింది.

మరోవైపు బంగారం ధర రోజురోజుకు సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాలను చేరుకుంటోంది. ప్రస్తుత సంవత్సరం ప్రారంభం నుండి రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. జనవరి 1న ఒక గ్రాము ధర రూ.7,150కి ఉండగా ఇవాళ ఒక గ్రాము ధర రూ.7,930 చేరింది. మన దేశంలో పసిడి ధరలు ప్రతిరోజూ మారుతూనే ఉంటాయి. బంగారం ధరల ట్రెండ్ ఇలానే కొనసాగితే తులం ధర రూ.90 వేలు దాటిన ఆశ్చర్యం ఉండదని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నేటి ధరలు చూస్తే:
10గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.79,300, నిన్నటి ధర రూ.79,050 దింతో రూ.250 పెరిగింది.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.86,510, నిన్నటి ధర రూ.86,240 అంటే రూ.270 ఎగిసింది.
ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ.64,880, నిన్నటి ధర 64,680 దింతో నేడు రూ.200 పెరిగింది.
ప్రముఖ నగరాల్లో ఇవాళ్టి ధరలు
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.79,300, 24 క్యారెట్ల ధర రూ.86,510, 18 క్యారెట్ల ధర రూ.64,880
విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.79,060, 24 క్యారెట్ల ధర రూ.86,250, 18 క్యారెట్ల ధర రూ.64,690
అమరావతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.79,060, 24 క్యారెట్ల ధర రూ.86,250, 18 క్యారెట్ల ధర రూ.64,690
గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.79,060, 24 క్యారెట్ల ధర రూ.86,250, 18 క్యారెట్ల ధర రూ.64,690
నెల్లూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.79,060, 24 క్యారెట్ల ధర రూ.86,250, 18 క్యారెట్ల ధర రూ.64,690
కాకినాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.79,060, 24 క్యారెట్ల ధర రూ.86,250, 18 క్యారెట్ల ధర రూ.64,690
తిరుపతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.79,060, 24 క్యారెట్ల ధర రూ.86,250, 18 క్యారెట్ల ధర రూ.64,690
కడపలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.79,300, 24 క్యారెట్ల ధర రూ.86,510, 18 క్యారెట్ల ధర రూ.64,880
అనంతపురంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.79,300, 24 క్యారెట్ల ధర రూ.86,510, 18 క్యారెట్ల ధర రూ.64,880
నేడు వెండి ధర చూస్తే 1గ్రాము ధర రూ.99.50, కేజీ ధర రూ.99,500. విజయవాడ అలాగే విశాఖపట్నంలో కేజీ ధర రూ.1,07,000
0032 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.1 శాతం పెరిగి $2,867.79 వద్ద ఉంది. నిన్న బులియన్ రికార్డు స్థాయిలో $2,882.16ను తాకింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం తగ్గి 2,887.10 డాలర్లకు చేరుకుంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.1 శాతం పెరిగి $32.35కి చేరుకుంది, ప్లాటినం 0.2 శాతం పెరిగి $981.81కి చేరుకుంది అలాగే పల్లాడియం 0.1 శాతం పెరిగి $990.66కి చేరుకుంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.


Click it and Unblock the Notifications