బంగారం, వెండి ధరలు భయాలు పుట్టిస్తున్నాయి. నిన్న మొన్నటిదాకా 90 వేలకు చేరువలో ఉగిసలాడిన ధరలు నేడు ఒక్కసారిగా 90వేల మార్కును చేరాయి. దింతో బంగారం ధరల పెంపు ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదని సూచిస్తుంది. మరోవైపు ఇప్పటికే లక్షకు మించి పరుగులు పెడుతున్న వెండి ధర తాజాగా లక్ష పది వేలు దాటి ఆల్ టైం న్యూ రికార్డ్ సెట్ చేసింది. ప్రస్తుతం కేజీ వెండి ధర కేజీకి రూ.1,13,000గా ఉంది.

ఇక బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతూ సామాన్యులకు అందనంత దూరంలోకి వెళుతున్నాయి. దీనికి అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ పెళ్లిళ్ల సీజన్లో అలాగే రాబోయే పండుగల్లో బంగారం కొనుగోలుదారులను పరిమితంగా కొనేలా చేస్తున్నాయి. బంగారం ధరలు పెరగడం వల్ల నగల వ్యాపారం కూడా మందగిస్తోంది. గత పది రోజులుగా చేస్తే బంగారం 22 గ్రాముల ధర రూ.210 పెరగగా, 24 క్యారెట్ల ధర సుమారు రూ.230 పెరిగింది. ఇక కేజీ వెండి ధర దాదాపు రూ.4900 పెరిగింది. కానీ బంగారం ధర ఈ నెల చివరిలోగా రూ.95 వేలకి చేరుకోవచ్చని ప్రస్తుత ధరల ట్రెండ్ సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక నేడు 1 గ్రాము, 10 గ్రాముల బంగారం ధర :
1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.8,250, 24 క్యారెట్ల ధర రూ. 9,000, 18 క్యారెట్ల ధర రూ. 6,750.10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 82,500, నిన్నటి ధర రూ.82,100 అంటే రూ.400 పెరగగా, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 90,000, నిన్నటి ధర చూస్తే రూ.89,560 దింతో రూ.440 ఎగిసింది. 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.67,500, నిన్నటి ధర రూ.67,180 సుమారు రూ.320 పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.82,500, 24 క్యారెట్లకు రూ.90,000, 18 క్యారెట్లకు రూ.67,500,
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.82,500, 24 క్యారెట్లకు రూ.90,000, 18 క్యారెట్లకు రూ.67,500,
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.82,500, 24 క్యారెట్లకు రూ.90,000, 18 క్యారెట్లకు రూ.67,500,
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.82,500, 24 క్యారెట్లకు రూ.90,000, 18 క్యారెట్లకు రూ.67,500,
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.82,500, 24 క్యారెట్లకు రూ.90,000, 18 క్యారెట్లకు రూ.67,500,
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.82,500, 24 క్యారెట్లకు రూ.90,000, 18 క్యారెట్లకు రూ.67,500,
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.82,500, 24 క్యారెట్లకు రూ.90,000, 18 క్యారెట్లకు రూ.67,500,
కడపలో 22 క్యారెట్ల ధర రూ.82,500, 24 క్యారెట్లకు రూ.90,000, 18 క్యారెట్లకు రూ.67,500,
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.82,500, 24 క్యారెట్లకు రూ.90,000, 18 క్యారెట్లకు రూ.67,500,
ఇవాళ వెండి ధర చూస్తే 100 గ్రాములకి రూ.110 పెరగగా కేజీ ధర రూ.1,100 పెరిగి రూ.1,13,000 చేరింది.
మంగళవారం ఉదయం చూస్తే దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం కొత్త రికార్డు సృష్టించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధానాల ఆర్థిక ప్రభావంపై పెరుగుతున్న అనిశ్చితి మధ్య ఈ పెరుగుదల చోటు చేసుకుంది. దింతో మార్చి 18న MCX గోల్డ్ (ఏప్రిల్ 5 కాంట్రాక్ట్) 10 గ్రాములకు రూ.88,380 వద్ద కొత్తగా ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. ఉదయం 9:15 గంటలకి బంగారం ధర 10 గ్రాములకు రూ.88,372 వద్ద 0.40% పెరిగి ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఔన్సుకు రికార్డు స్థాయిలో $3,012.05కి చేరుకున్నాయి. డోనాల్డ్ ట్రంప్ సుంకాల విధానాల వల్ల తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతుందనే భయాల మధ్య పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపారు.
బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణాలు అమెరికా సుంకాలపై అనిశ్చితి, ఫెడరల్ రిజర్వ్ నుండి ద్రవ్య విధానం సడలింపుపై పెరుగుతున్న అంచనాలు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే రోజుల్లో స్పాట్ బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల, బంగారం ధర త్వరలోనే లక్ష రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది. గమనించ దగ్గ విషయం ఏంటంటే ఈ ఏడాది బంగారం ధర 14 శాతానికి పైగా పెరిగింది. అంటే 10 గ్రాములకు రూ.11,300 కంటే పైగా ఎగిసింది. అయితే దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు దాదాపు 14 % పెరగగా గత మూడు సంసంవత్సరాలుగా బంగారం పెట్టుబడిదారులకు ఏడాది ప్రతిపాదికన సగటున 17 శాతం రాబడి ఇచ్చింది. అంతేకాదు ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఈ సంవత్సరం బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లోని కమోడిటీ రీసెర్చ్ సీనియర్ అనలిస్ట్ మానవ్ మోడీ మాట్లాడుతూ, "డాలర్ ఇండెక్స్ తగ్గుదలతో సహా చాల అంశాలు బంగారం ధరలను పెంచాయి. మిశ్రమ-సానుకూల స్థూల ఆర్థిక సూచికలు ఉన్నప్పటికీ డాలర్ ఇండెక్స్ మందగించింది, దింతో 107 నుండి దాదాపు 103.50కి పడిపోయింది. వీటికి అదనంగా సుంకాల యుద్ధంపై అనిశ్చితి పెట్టుబడిదారుల ఆందోళనలను పెంచింది, ఇంకా బంగారానికి డిమాండ్ బలంగా ఉంది. గత సంవత్సరం దేశీయ మార్కెట్లో బంగారం అండ్ వెండి దిగుమతులు పెరిగాయి. ఈ సంవత్సరం కూడా ఇదే బలమైన ధోరణితో ప్రారంభమైంది. కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు కూడా కొనసాగుతున్నాయి, ఇది కూడా ధరల పెంపుకు అదనపు సపోర్ట్ ఇస్తోంది" అని మానవ్ మోడీ అన్నారు.
0025 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $3,002.28 వద్ద స్థిరంగా ఉంది. శుక్రవారం బులియన్ కీలకమైన $3,000/oz మైలురాయిని దాటి $3,004.86 వద్ద రికార్డు గరిష్ట స్థాయిని నమోదు చేసింది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.1 శాతం పెరిగి $33.86కి చేరుకుంది, ప్లాటినం 0.4 శాతం పెరిగి $1,004.25కి చేరుకుంది, పల్లాడియం 0.5 శాతం పెరిగి $969.77కి చేరుకుంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10 గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications