బంగారం, వెండి ధరల పిడుగు.. ఒక్కసారిగా రూ.4500 పెరిగిన పసిడి.. 2వేలు పెరిగిన వెండి..

ఈ సమ్మర్లో ఎండలు ముందే దంచికొడ్తున్నాయి.మరోపక్క పెళ్లిళ్ల సీజన్లో బంగారం, వెండి ధరల జోరు ఆగట్లేదు. గత కొంత కాలంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ తగ్గుతూ ఆల్ టైం హైకి చేరి సరికొత్త రికార్డ్ నెలకొల్పుతున్నాయి. దీనికి వెండి వెండి ధరలు కూడా కేజీకి లక్ష దాటి పరుగులు పెడుతుంది. ప్రస్తుతం వెండి ధర నేడు ఒక్కరోజే కేజీకి 2 వేరు పెరిగి రూ.1,10,000కి చేరువైంది.

అయితే బంగారం వెండి ధరలు ఈ స్థాయిలో పెరగడానికి చాల కారణాలు చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాల భయాలు, ఆసియా స్టాక్ మార్కెట్ల క్షిణత సహా పలు అంశాలు పసిడి, వెండి ధరలను పరుగులు పెట్టిస్తున్నాయి. వీటికి తోడు మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో బంగారం, వెండి కొనుగోళ్ల డిమాండ్ ఊపందుకుంటున్నాయి. గత ఏడాదితో పోల్చితే పసిడి ధరలు ఇప్పటివరకు సుమారు 10వేల దాకా పెంపును చూశాయి. ఇక వెండి కూడా భారీగానే పెరిగింది.

gold price update Gold price surged Rs490 per 24 carats today on Wednesday check latest vijayawada vizag rates here

పెరుగుతున్న బంగారం, వెండి ధరల పై ఆభరణాల వ్యాపారాలు, జ్యువెలరీ షాపులు కూడా అమ్మకాలను ఆశిస్తున్నాయి. అయితే గతంతో పోల్చితే కొండెక్కిన రేట్లు కొనుగోలుదారులను ఆందోళన కలిగిస్తున్నాయి. కస్టమర్ల నుండి ఆశించిన కొనుగోళ్లు జరగట్లేదని అంటున్నారు. దీనికి కారణం ఒకప్పుడు ప్రతి చిన్న పండగకి కూడా బంగారం సంప్రదాయం ప్రకారం చిన్న మొత్తంలో అయినా కొనుగోళ్లు చేస్తుండేవారు కానీ పెరుతున్న రేట్ల వాళ్ళ కొనుగోళ్లు కూడా చిన్న మొత్తం వరకే ఉంటున్నాయని చెబుతున్నారు. మరోపక్క సామాన్యులు గ్రాములల్లోనే కొనేందుకు పరిమితమవుతున్నారు. ఈ నెల మొదటి రోజు నుంచి చూస్తే 22 క్యారెట్ల ధర సుమారు రూ.100 అలాగే 24 క్యారెట్ల ధర రూ.150 వరకు పెరిగింది.

ఇక బంగారం ధరలు ఇలగే పెరుగుతూ ఉంటే భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గుతాయా లేక మరింత పెరుగుతాయా అని కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం 90 వేలకి చేరువలో ఉన్న రేట్లు ఇదే ట్రెండ్ కొనసాగిస్తే రానున్న రోజుల్లో లక్షకి చేరువవడం ఖాయం అని అంటున్నారు నిపుణులు. ఇక హోలీ పండగకి ముందు బంగారం, వెండి కొనాలని ఆలోచిస్తున్న వారికి ప్రస్తుత ధరలు తెలుసుకోవడం ముఖ్యం.

ప్రస్తుతం గ్రాము బంగారం ధర
1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.8,065, 24 క్యారెట్ల ధర రూ. 8,798, 18 క్యారెట్ల ధర రూ. 6,599.10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 80,650, నిన్నటి ధర రూ.80,200 అంటే రూ.450 పెరగగా, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 87,980, నిన్నటి ధర చూస్తే రూ.87,490 దింతో రూ.490 ఎగిసింది. 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.65,990, నిన్నటి ధర రూ.65,620 సుమారు రూ.370 పెరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.80,650, 24 క్యారెట్లకు రూ.87,980, 18 క్యారెట్లకు రూ.65,990,
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.80,650, 24 క్యారెట్లకు రూ.87,980, 18 క్యారెట్లకు రూ.65,990,
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.80,650, 24 క్యారెట్లకు రూ.87,980, 18 క్యారెట్లకు రూ.65,990,
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.80,650, 24 క్యారెట్లకు రూ.87,980, 18 క్యారెట్లకు రూ.65,990,
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.80,650, 24 క్యారెట్లకు రూ.87,980, 18 క్యారెట్లకు రూ.65,990,
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.80,650, 24 క్యారెట్లకు రూ.87,980, 18 క్యారెట్లకు రూ.65,990,
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.80,650, 24 క్యారెట్లకు రూ.87,980, 18 క్యారెట్లకు రూ.65,990,
కడపలో 22 క్యారెట్ల ధర రూ.80,650, 24 క్యారెట్లకు రూ.87,980, 18 క్యారెట్లకు రూ.65,990,
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.80,650, 24 క్యారెట్లకు రూ.87,980, 18 క్యారెట్లకు రూ.65,990,
ఇవాళ వెండి ధర చూస్తే 100 గ్రాములకి రూ.200 పెరగగా కేజీ ధర రూ.2000 పెరిగి రూ.1,09,000 చేరింది.

బంగారం స్వచ్ఛతను ఎలా చెక్ చేయాలి ?
*బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) హాల్ మార్కులను ఉంటుంది.
*24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది అలాగే 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది.
*బంగారాన్ని 999.9 స్వచ్ఛత (24 క్యారెట్లు)గా గ్రేడ్ చేస్తారు.
*24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999 అని, 23 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 958 అని, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 916 అని, 21 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 875 అని, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 750 అని రాసి ఉంటుంది.
*22 క్యారెట్ల బంగారంలో రాగి, వెండి, జింక్ వంటి 9% ఇతర లోహాలను కలిపి ఆభరణాలు తయారు చేస్తారు.
*24 క్యారెట్ల బంగారంలో కల్తీ ఉండదు, ఇవి నాణేలు, బార్ రూపంలో ఉంటాయి. కానీ 24 క్యారెట్ల బంగారంతో ఆభరణాలు తయారు చేయలేము, అందుకే చాలా మంది దుకాణదారులు 18, 20 ఇంకా 22 క్యారెట్ల బంగారాన్ని అమ్ముతారు.

అంతర్జాతీయ మార్కెట్ ధరలు, ప్రభుత్వ పన్నులు ఇంకా రూపాయి విలువలో హెచ్చుతగ్గులు వంటి చాలా కారణాల వల్ల భారతదేశంలో బంగారం ధర మారుతూ ఉంటుంది. బంగారం కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, మన సంప్రదాయాలు అలాగే పండుగలలో కూడా ఒక ముఖ్యమైన భాగం. ఇంకా వివాహాలు, పండుగల సమయంలో దీని డిమాండ్ పెరుగుతుంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగదారి. ప్రతి సంవత్సరం టన్నుల కొద్దీ బంగారం మన దేశంలోకి దిగుమతి అవుతుంది. అందువల్ల, ప్రపంచ మార్కెట్లో చిన్న కదలికలు కూడా భారతదేశంలో బంగారం ధరపై కనిపిస్తాయి.

note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+