నిండా ముంచేసిన బంగారం, వెండి.. ఒక్కసారి 4 వేలు పెరిగిన ధర.. త్వరలోనే లక్ష గ్యారెంటీ..?

నేడు బంగారం, వెండి ధరలు మరోసారి భగ్గుమన్నాయి. నిన్న మొన్నటి దాకా వందలల్లో పెరిగిన ధర ఇవాళ ఒక్కసారిగా వెయ్యికి పైగా పెరిగింది. ఇక బంగారం రూట్లోనే వెండి కూడా పరుగులు పెడుతూ 3 వేలు పెరిగింది. అత్యంత విలువైన లోహంగా పరిగణించే బంగారం, వెండి గడిచిన గొన్ని వారాల్లో చుస్తే ఒక్క రోజులో ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. ఇప్పటికే లక్ష దాటి దూసుకెళ్తున్న వెండి నేడు కొత్త రికార్డ్ స్థాయికి చేరుకుంది.

gold price update Gold price rises Rs1000 per 10 grams silver rises 3000 per kg check telangana and andhrapradesh rates here

ఇక పసిడి, వెండి కొనేందుకు ప్లాన్ చేస్తున్న కస్టమర్లు పెరుగుతున్న ధరలను చూసి షాకవుతన్నారు. తులం బంగారం కొనడానికి వచ్చిన కస్టమర్లు ధరలు చూసి గ్రాములకే పరిమితం అవుతున్నారు అంటూ జ్యువెలరీ షాపు జామాన్యాలు చెబుతున్నాయి. ఈ వారం మొతంగా చూస్తే బంగారం ధర సుమారు 2వేల వరకు పెరగగా, వెండి సుమారు 4 నుండి 5 వేల వరకు పెరిగింది. ఈ ఏడాది మొదటి నుండి చూస్తే పసిడి సుమారు 15 నుండి 20 వేలకు పెరగగా, వెండి ధర 20 వేల వరకు పెరిగింది. అయితే ధర పెంపు ట్రెండ్ చూస్తే బంగారం, వెండి ధరలు సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకొని రికార్డ్ నెలకొల్పగా, రానున్న రోజుల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే తులం ధర లక్షకి చేరుకోవడంలో ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు.

నేడు 1 గ్రాము, 10 గ్రాముల బంగారం ధరలు :
1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.8,340, 24 క్యారెట్ల ధర రూ. 9,098, 18 క్యారెట్ల ధర రూ. 6,824,.
10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 83,400, నిన్నటి ధర రూ.82,350 అంటే రూ.1050 పెరిగింది,
10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 90,980, నిన్నటి ధర చూస్తే రూ.89,840 దింతో రూ.1140 ఎగబాకింది.
10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.68,240, నిన్నటి ధర రూ.67,380 అంటే రూ.860 పెంపును నమోదు చేసింది.

దేశంలోని ప్రముఖ నగరాలలో ఇవాళ్టి ధరలు చూస్తే:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.83,550, 24 క్యారెట్లకు రూ.91,130, 18 క్యారెట్లకు రూ.68,360, ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.83,400, 24 క్యారెట్లకు రూ.90,980, 18 క్యారెట్లకు రూ.68,240, ఇక చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.83,400, 24 క్యారెట్లకు రూ.90,980, 18 క్యారెట్లకు రూ.68,850, కోల్కోత్తలో 22 క్యారెట్ల ధర రూ.83,400, 24 క్యారెట్లకు రూ.90,980, 18 క్యారెట్లకు రూ.68,240,

తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు: వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.83,400, 24 క్యారెట్లకు రూ.90,980, 18 క్యారెట్లకు రూ.68,240, కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.83,400, 24 క్యారెట్లకు రూ.90,980, 18 క్యారెట్లకు రూ.68,240, ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.83,400, 24 క్యారెట్లకు రూ.90,980, 18 క్యారెట్లకు రూ.68,240, హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.83,400, 24 క్యారెట్లకు రూ.90,980, 18 క్యారెట్లకు రూ.68,240,

ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.83,400, 24 క్యారెట్లకు రూ.90,980, 18 క్యారెట్లకు రూ.68,240,
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.83,400, 24 క్యారెట్లకు రూ.90,980, 18 క్యారెట్లకు రూ.68,240,
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.83,400, 24 క్యారెట్లకు రూ.90,980, 18 క్యారెట్లకు రూ.68,240,
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.83,400, 24 క్యారెట్లకు రూ.90,980, 18 క్యారెట్లకు రూ.68,240,
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.83,400, 24 క్యారెట్లకు రూ.90,980, 18 క్యారెట్లకు రూ.68,240,
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.83,400, 24 క్యారెట్లకు రూ.90,980, 18 క్యారెట్లకు రూ.68,240,
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.83,400, 24 క్యారెట్లకు రూ.90,980, 18 క్యారెట్లకు రూ.68,240,
కడపలో 22 క్యారెట్ల ధర రూ.83,400, 24 క్యారెట్లకు రూ.90,980, 18 క్యారెట్లకు రూ.68,240,
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.83,400, 24 క్యారెట్లకు రూ.90,980, 18 క్యారెట్లకు రూ.68,240,

మరోవైపు వెండి ధరలు నేడు ఏకంగా ఒకేసారి 3వేలు పెరిగింది. ఇవాళ ఒక్క గ్రాము వెండి ధర ధర రూ.105, పది గ్రాములకు రూ.1050, కేజీకి రూ.1,05,000. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.1,05,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,14,000.

భారతదేశంలో బంగారం రేట్లలో అకస్మాత్తుగా ఈ పెరుగుదలకు కారణం ఏప్రిల్ 2 నుండి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాల విధింపు అమలులోకి రానున్నాయి, దింతో ప్రపంచ వాణిజ్య యుద్ధ భయాలను మరింతగా తీవ్రతరం చేసింది. ఈ ఒక్క కారణంగానే కాకుండా ప్రపంచ రాజకీయ పరిస్థితులు, ఉద్రిక్తలు, డాలరుతో భరత్ రూపాయి మారకం విలువ, డిమాండ్ అండ్ సప్లయ్ సహా మరికొన్ని అంశాలు బంగారం ధరల పెంపుకు ముఖ్య కారణాలు కావచ్చు. 0035 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 0.2 శాతం పెరిగి $3,061.72కి చేరుకుంది, స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.1 శాతం పెరిగి $34.43కి చేరుకుంది, ప్లాటినం $986.09 వద్ద స్థిరంగా ఉంది, పల్లాడియం 0.3 శాతం పెరిగి $978.71కి చేరుకుంది.

బంగారం కొనుగోలు చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. వీటిలో గోల్డ్ హాల్మార్క్, కారెట్స్ ముఖ్యం. ఇంకా బంగారం స్వచ్ఛత అలాగే 22 క్యారెట్ల బంగారం 24 క్యారెట్ల బంగారం ధరలను పోల్చి చుడండి. కొనుగోలు సమయంలో తప్పకుండా బిల్లు తీసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ కొన్న బంగారు వస్తువులకు ఒక ప్రూఫ్ గా ఉపయోగపడుతుంది.

note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10 గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+