బంగారం, వెండి ధరలు రోజురోజుకి సరికొత్త రికార్డ్ సృష్టిస్తూ సామాన్యులకి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇవాళ కూడా పసిడి, వెండి ధరలు భారిగా పెరిగాయి. అయితే బంగారం ధరల్లో నిరంతర పెరుగుదల సామాన్యుల నుండి సంపన్నుల వరకు అందరిని కొనేందుకు ఆలోచించేలా చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధర ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకుంది, దీని వల్ల ప్రజలు కొనడం కూడా కష్టమైంది. ఇటీవలి కాలంలో బంగారం ధరల పెరుగుదలను పరిశీలిస్తే బంగారం ఇప్పుడు 10 గ్రాములకు రూ.90 వేల మార్క్ దాటి పరుగులు పెడుతుంది. మరోవైపు పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు రూ.1 లక్షా 15 వేలకి చేరువలో ఉంది.

ఒక వారంలోనే 3% పెరిగిన బంగారం ధర: హోలీ పండగ రోజు నుండి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. హోలీ రోజున ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ మధ్యాహ్నం ప్రారంభం కాగా 24 క్యారెట్ల బంగారం ధర మొదటిసారిగా 10 గ్రాములకు రూ.88 వేలు దాటింది. దింతో మార్చి 18న దాదాపు రూ. 88,500కి చేరింది, ఇది ఎన్నడూ లేని కొత్త రికార్డు.
ఒక సంవత్సరంలో బంగారం ధరలలో భారీ పెరుగుదల: గత ఒక సంవత్సరంలోనే బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత ఏడాది డిసెంబర్ చివరి ట్రేడింగ్ రోజున MCXలో బంగారం ధర 10 గ్రాములకు రూ.77,456గా ఉంది, ఇప్పుడు రూ.89,000 పైగా చేరింది. అంటే, ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 10 గ్రాములకు రూ.11 వేల పెరుగుదల చూపిస్తుంది, ఇది 14.25% పెరుగుదల అలాగే మార్చి నుండి నేటి వరకు సుమారు రూ.3 వేలు పెరిగింది. ఈ కాలంలో వెండి ధర కూడా భారీగా పెరిగింది. కానీ బంగారం ధరల పెరుగుదల వేగం ఎక్కువగా ఉంది. అయితే పసిడి, వెండి ధరల పెరుగుదలకు ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం సహా డిమాండ్ సప్లయ్ ఇంకా ఇతర కారణాల వల్ల కూడా ధరల పై ప్రభావం చూపుతాయని నమ్ముతారు.
10 సంవత్సరాలలో బంగారం ఎంత పెరిగిందంటే: గత 10 సంవత్సరాలలో బంగారం ధరల ప్రయాణం గురించి మనం మాట్లాడుకుంటే, 2015 లో బంగారం 10 గ్రాములకు రూ.25 వేలుగా ఉండేది, కానీ అది ఇప్పుడు రూ.90 వేలకు చేరుకుంది. వెండి కూడా కిలోకు రూ.35 వేల నుండి రూ.1 లక్ష దాటింది. కానీ ఇప్పుడు అందరి మదిలో ఉండే ప్రశ్న ఏమిటంటే బంగారం ధరలు రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాయా అని. నిపుణుల అంచనా ప్రకారం, రాబోయే 75 రోజుల్లో మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములకు రూ. లక్ష వరకు పెరగవచ్చు. కానీ ఇక్కడ ఇది కేవలం ఒక అంచనా అని కూడా గుర్తుంచుకోవాలి. పసిడి ధరల పెరుగుదల ట్రెండ్ ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో తులం ధర లక్షకి చేరుకునేందుకు ఎక్కువ రోజులు కూడా పట్టదని సూచిస్తున్నారు.
బంగారం ధరలు తగ్గుతాయా: బంగారం ధరలు భారీగా తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిణామాలు అని చెప్పవచ్చు. బంగారం ధరలు నిజానికి ఈ నెల ప్రారంభం నుంచి కూడా ఆల్ టైం రికార్డు దిశగా దూసుకెళ్తున్నాయి. బంగారం ధర భవిష్యత్తులో భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం, స్టాక్ మార్కెట్ సానుకూల సంకేతాలు అలాగే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపు వార్తలు అనుకూలిస్తే బంగారం ధర భారీగా తగ్గే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికే బంగారం ధర ఆల్ టైం రికార్డును తాకడం వల్ల, పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు బంగారం పై పెట్టుబడి పెడుతున్నారు. ముఖ్యంగా గోల్డ్ ఈటీఎఫ్ రూపంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెరిగాయి.
ఇక నేడు 1 గ్రాము, 10 గ్రాముల బంగారం ధర :
1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.8,310, 24 క్యారెట్ల ధర రూ. 9,066, 18 క్యారెట్ల ధర రూ. 6,799. 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 83,100, నిన్నటి ధర రూ.82,900 అంటే రూ.200 పెరగగా, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 90,660, నిన్నటి ధర చూస్తే రూ.90,440 దింతో రూ.220 ఎగిసింది. 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.67,991, నిన్నటి ధర రూ.67,830 సుమారు రూ.161 పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.83,100, 24 క్యారెట్లకు రూ.90,660, 18 క్యారెట్లకు రూ.67,990,
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.83,100, 24 క్యారెట్లకు రూ.90,660, 18 క్యారెట్లకు రూ.67,990,
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.83,100, 24 క్యారెట్లకు రూ.90,660, 18 క్యారెట్లకు రూ.67,990,
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.83,100, 24 క్యారెట్లకు రూ.90,660, 18 క్యారెట్లకు రూ.67,990,
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.83,100, 24 క్యారెట్లకు రూ.90,660, 18 క్యారెట్లకు రూ.67,990,
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.83,100, 24 క్యారెట్లకు రూ.90,660, 18 క్యారెట్లకు రూ.67,990,
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.83,100, 24 క్యారెట్లకు రూ.90,660, 18 క్యారెట్లకు రూ.67,990,
కడపలో 22 క్యారెట్ల ధర రూ.83,100, 24 క్యారెట్లకు రూ.90,660, 18 క్యారెట్లకు రూ.67,990,
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.83,100, 24 క్యారెట్లకు రూ.90,660, 18 క్యారెట్లకు రూ.67,990,
ఇవాళ వెండి ధర చూస్తే కేజీ ధర రూ.1,00 పెరిగి రూ.1,14,100 చేరింది.
0210 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.1 శాతం పెరిగి $3,049.89 వద్ద ఉంది. అమెరికా బంగారు ఫ్యూచర్స్ 0.6 శాతం పెరిగి $3,058.40కి చేరుకుంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు $33.81 వద్ద స్థిరంగా ఉండగా, ప్లాటినం 0.1 శాతం పెరిగి $994.05 వద్ద, పల్లాడియం 0.1 శాతం పెరిగి $957.42 వద్ద ఉంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10 గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications