బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు.. రూ.4500 పెరిగిన ధర.. ఇక లక్ష గ్యారెంటీ.. ?

బంగారం ధరలు మళ్ళీ కొండెక్కుతున్నాయి. దింతో ఇవాళ 10 గ్రాముల ధర రూ.450 నుండి రూ.490 వరకు పెరిగింది. ఇక వెండి ధర చూస్తే స్థిరంగా కేజీకి లక్ష వద్ద ఉంది. అయితే నేడు ఒక్కరోజే పసిడి ఇంతలా పెరగడం కొనుగోలుదారులను నిరాశపరుస్తుంది. అంతేకాకుండా బంగారం ధరల పెంపు ఆభరణల వ్యాపారాలను కూడా కాస్త ప్రాభావితం చేస్తుంది. ఇక నిన్న ఈ రోజు చుస్తే బంగారం ధర రూ.400 తగ్గినట్లే తగ్గి రూ.450 పైగా పెరిగింది. బంగారం ధరల పెంపు ట్రెండ్ ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో తులం ధర లక్ష దాటడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు. మరోవైపు వెండి గురించి చెప్పాలంటే, దీని ధర కూడా కేజీకి ఒక వారంలో సుమారు రూ.2900 పెరిగింది.

Gold price up rs 450 to rs 89 950 Silver price stable at rs 1 00 000 in telangana and ap on may 27

బంగారం రేట్లు గత సంవత్సరంతో పోలిస్తే (YoY) ఏకంగా 30 శాతం పెరిగాయి. అంతేకాకుండా 2001 నుండి పెట్టుబడిగా 15 శాతం CAGR (కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్) రాబడి ఇచ్చింది. డేటా ప్రకారం, 1995 నుండి ద్రవ్యోల్బణాన్ని 2-4 శాతానికి పైగా అధిగమించింది. ఇక వెండి విషయానికొస్తే, 2025లో దీని ధరల్లో హెచ్చుతగ్గులు తక్కువగా ఉన్నాయి, ఇంకా బంగారంతో పోలిస్తే స్థిరత్వాన్ని చూపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూలై 9 వరకు యూరోపియన్ యూనియన్‌పై సుంకాలను వాయిదా వేయడంతో మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కాస్త చల్లబడింది.

ప్రస్తుతం 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.45 పెరిగి రూ.8,995, 24 క్యారెట్ల ధర రూ.49 పెరిగి రూ.9,813, 18 క్యారెట్ల ధర రూ.37 పెరిగి రూ.7,360. దింతో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.89,950, నిన్నటి ధర రూ.89,500 అంటే రూ.450 పెరిగ్గా, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.98,130, నిన్నటి ధర చూస్తే రూ.97,640 దింతో రూ.490 పెరిగింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.73,600, నిన్నటి ధర రూ.73,230 అంటే రూ.370 పెంపు నమోదు చేసింది.

తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే :
వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.89,950, 24 క్యారెట్లకు రూ.98,130, 18 క్యారెట్లకు రూ.73,600.
కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.89,950, 24 క్యారెట్లకు రూ.98,130, 18 క్యారెట్లకు రూ.73,600.
ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.89,950, 24 క్యారెట్లకు రూ.98,130, 18 క్యారెట్లకు రూ.73,600.
హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.89,950, 24 క్యారెట్లకు రూ.98,130, 18 క్యారెట్లకు రూ.73,600.

ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి ధరలు చూస్తే :
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.89,490, 24 క్యారెట్లకు రూ.97,630, 18 క్యారెట్లకు రూ.73,220.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.89,490, 24 క్యారెట్లకు రూ.97,630, 18 క్యారెట్లకు రూ.73,220.
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.89,950, 24 క్యారెట్లకు రూ.98,130, 18 క్యారెట్లకు రూ.73,600.
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.89,950, 24 క్యారెట్లకు రూ.98,130, 18 క్యారెట్లకు రూ.73,600.
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.89,950, 24 క్యారెట్లకు రూ.98,130, 18 క్యారెట్లకు రూ.73,600.
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.89,950, 24 క్యారెట్లకు రూ.98,130, 18 క్యారెట్లకు రూ.73,600.
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.89,950, 24 క్యారెట్లకు రూ.98,130, 18 క్యారెట్లకు రూ.73,600.
కడపలో 22 క్యారెట్ల ధర రూ.89,950, 24 క్యారెట్లకు రూ.98,130, 18 క్యారెట్లకు రూ.73,600.
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.89,950, 24 క్యారెట్లకు రూ.98,130, 18 క్యారెట్లకు రూ.73,600.

మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.100గా ఉండగా, 10 గ్రాములకి రూ.1000, కేజీకి నేడు రూ.1,00,000 అంటే ఇవాళ వెండి ధర స్థిరంగా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.1,00,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,11,000.

రాబోయే నెలలో బంగారం ధరలు: రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది ప్రకారం రాబోయే నెలలో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని, సమీప భవిష్యత్తులో అమెరికా ఆర్థిక వ్యవస్థ, మొదటి త్రైమాసిక జిడిపి, వినియోగదారుల నమ్మకం డేటాపై దృష్టి సారిస్తారని అభిప్రాయపడ్డారు.

బంగారం గురించి అంచనాలు : ఇటీవల, గల్ఫ్ న్యూస్ కూడా బంగారం ధరల పెరుగుదలను అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన అప్షన్'గా పరిగణిస్తున్నారు. దీనితో పాటు 2029 నాటికి బంగారం ధరలు ఔన్సుకు $6,000కి చేరుకుంటాయని జెపి మోర్గాన్ ఇటీవల అంచనా వేశారు. దీని ఫలితంగా ధరలు మరింతగా పెరుగవచ్చు, తద్వారా పసిడి ధర బలపడుతుంది. ఈ ఏడాది జనవరి నుండి ఏప్రిల్ వరకు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ కాలంలో చూస్తే బంగారం ధరలు 25% వరకు పెరిగాయి. అయితే, ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతల మధ్య ఏప్రిల్ నుండి బంగారం ధరలు కొంత తగ్గుతూ వచ్చాయి.

0047 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.1 శాతం పెరిగి $3,344.36 డాలర్ల వద్ద ఉండగా, అమెరికా బంగారు ఫ్యూచర్స్ 0.6 శాతం తగ్గి $3,344.60 డాలర్లకి చేరుకుంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.4 శాతం పెరిగి $33.47 డాలర్లకి చేరుకుంది, ప్లాటినం $1,085.63 వద్ద స్థిరంగా ఉండగా, పల్లాడియం 0.1 శాతం తగ్గి $986.75 డాలర్లకి చేరుకుంది.

note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+