gold price today: మెల్లగా మారుతున్న ట్రెండ్! ఆదివారం నాటికి బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి!
నవంబర్ 23 ఆదివారం రోజున దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడం, ముఖ్యంగా త్వరలో రాబోయే US ఫెడ్ డిసెంబర్ పాలసీ కారణంగా పసిడి ధరలు పెద్దగా మార్పు లేకుండా ముగిశాయి.
ధరల వివరాలు
మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్ (MCX)లో బంగారం ధర శుక్రవారం రాత్రి 10 గ్రాములకు ₹1,24,195 వద్ద ముగిసింది. రిటైల్ మార్కెట్‌లో, ఇండియా బులియన్స్ డేటా ప్రకారం, నవంబర్ 23 ఉదయం 7:20 గంటలకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹1,24,780గా, 22 క్యారెట్ల బంగారం ధర ₹1,14,382గా నమోదైంది.

ప్రధాన నగరాల్లో రిటైల్ బంగారం ధరలు (10 గ్రాములకు):
- ముంబై: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,550; 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,171
- హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,750 ; 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,354
- చెన్నై: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,920 ; 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,510
- ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,340 ; 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,13,978
- బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,650 ; 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,263
- కోల్‌కతా: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,390 ; 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,024
ధరల ట్రెండ్ ఈ విధంగా..
బంగారం ధరలు అక్టోబర్ 2025లో 10 గ్రాములకు రూ.1,32,294 వద్ద ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరిన తరువాత ఇప్పుడు సుమారు రూ.8,099 వరకు తగ్గాయి. గత ఇరవై ఏళ్లలో పసిడి ధరలు 1,200% కంటే ఎక్కువగా పెరిగాయి, అంటే 2005లో రూ.7,638 నుంచి 2025లో రూ.1,25,000 మార్క్‌ను దాటాయి. ఇక ఈ ఒక్క సంబత్సరంలోనే ఎప్పుడూ లేని విధంగా బంగారం ధరల్లో భారీగా మారుతూ వస్తున్నాయి.
పెట్టుబడి పెట్టొచ్చా?
ప్రస్తుత బంగారం ధరల పరిస్థితిని బట్టి నిపుణులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడికి బంగారం ఇప్పటికీ మంచి ఎంపికే అని చాలామంది నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ అనిశ్చితి, ద్రవ్యోల్బణం నుంచి రక్షణగా బంగారం పనిచేస్తుంది. వచ్చే ఏడాది 2026లో ధరలు రూ.1,30,000 నుంచి రూ.1,60,000 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా దశల వారీగా లేదా ధర తగ్గినప్పుడల్లా కొద్ది మొత్తంలో కొనుగోలు చేయడం మంచిదని సలహా ఇస్తున్నారు.
ట్రేడర్లు జాగ్రత్త
US ఫెడ్ వడ్డీ రేట్లపై స్పష్టత లేకపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లు అస్థిరంగా ఉన్నాయి. రూపాయి బలహీనంగా ఉండడం ఇక్కడి ధరలకు కొంత మద్దతు ఇస్తున్నప్పటికీ స్వల్పకాలంలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ట్రేడింగ్ చేసేవాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.


Click it and Unblock the Notifications