ఇండియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈ రోజు (జూన్ 5) తగ్గాయి. భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి తెరుచుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే ఈక్విటీ మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి. ఈ ప్రభావం బంగారంపై కనిపిస్తోంది. నేడు బంగారం ధరలు ఎంసీఎక్స్ 0.7 శాతం తగ్గి 10 గ్రాముల బంగారం ధర రూ.46,369 పలికింది. మధ్యాహ్నం గం.11.30 సమయానికి 10 గ్రాములు 46,288 పలికింది. అంతకుముందు సెషన్‌లో బంగారం ధర రూ.700 పెరిగింది. వెండి ధర కిలో 0.8 శాతం తగ్గి రూ.48,402 పలికింది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఔన్స్ 0.2% పెరిగి 1,714.78 డాలర్లు పలికింది. ఈ వారం డాలర్ ఇతర కరెన్సీలతో పోలిస్తే 1.5 శాతం మేర తగ్గింది. ఈ ప్రభావం బంగారంపై ఉంటుంది. ఇతర ఖరీదైన మెటల్స్ విషయానికి వస్తే ప్లాటిమ్ 0.4 శాతం పెరిగి ఔన్స్ ధర 840.39 డాలర్లు, వెండి ఔన్స్ 17.72 పలికింది.

ఆర్థిక వ్యవస్థలు తెరుచుకుంటుండటంతో
ఇప్పటి వరకు కరోనా కారణంగా క్లోజ్ అయిన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు క్రమంగా తెరుచుకుంటున్నాయని, బంగారంపై ఒత్తిడి తగ్గుతోందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం రూ.46,700 నుండి రూ.46,800 లెవల్‌కు చేరుకోవచ్చునని చెబుతున్నారు. అమెరికా - చైనా మధ్య ఉద్రిక్తతలు, కరోనా వ్యాప్తి వంటి అంశాలు బంగారంపై ముందు ముందు కూడా ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.

హైదరాబాద్‌లో నేడు బంగారం ధరలు
హైదరాబాదులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,640 పలికింది. నిన్న కూడా ఇదే ధర ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,560 పలికింది. గత పది రోజుల్లో హైదరాబాదులో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 26 మే 2020న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,010 పలికింది. జూన్ 1వ తేదీతో మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఈ నెల ప్రారంభంలో రూ.49,220 ఉండగా నేడు రూ.48,640 పలికింది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications