దీపావళి తర్వాత భారీగా పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు గతవారం భారీగా పెరిగాయి. దీపావళి-ధనతెరాస్ పర్వదినంకు ముందు తగ్గినట్లే తగ్గిన గోల్డ్ ఫ్యూచర్స్ చివరి సెషన్‌లో భారీగా పెరిగింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఇటీవలి గరిష్టాలకు చేరుకున్నాయి. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ చివరి సెషన్‌లో రూ.390.00 (0.82%) పెరిగి రూ.47943.00 వద్ద ట్రేడ్ అయింది. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.408.00 (0.86%) పెరిగి రూ.48090.00 వద్ద ట్రేడ్ అయింది. బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో 8500 తక్కువగా ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ డిసెంబర్ రూ.210.00 (0.33%) పెరిగి రూ.64330.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.216.00 (0.33%) పెరిగి రూ.64990.00 వద్ద ట్రేడ్ అయింది.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్లు క్రాస్ చేసింది. చివరి సెషన్‌లోనే ఏకంగా 26 డాలర్లు పెరిగింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 26.45 (+1.47%) డాలర్లు పెరిగి 1,819.95 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.339 (+1.42%) డాలర్లు పెరిగి 24.250 డాలర్లకు చేరుకుంది. ఈ వారం 1800 డాలర్ల దిగువన ప్రారంభమైన గోల్డ్ ఫ్యూచర్స్, ఇప్పుడు రూ.1820 డాలర్లకు చేరువైంది. 23 డాలర్ల స్థాయిలో ఉన్న సిల్వర్ ఫ్యూచర్స్ 24 డాలర్లు దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఏడాదిలో 7.76 శాతం తగ్గింది. గోల్డ్ ఫ్యూచర్స్ 1,785.95 - 1,820.00 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఏడు శాతం తగ్గింది.

వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి... ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850, ముంబైలో 24 క్యారెట్ల పసిడి రూ.47,220, 22 క్యారెట్ల పసిడి రూ.46,220, చెన్నైలో 24 క్యారెట్ల పసిడి రూ.49,410, 22 క్యారెట్ల పసిడి రూ.45,050, కోల్‌కతాలో 24 క్యారెట్ల పసిడి రూ.49,250, 22 క్యారెట్ల పసిడి రూ.46,550గా ఉంది.


Click it and Unblock the Notifications