గత కొన్ని సంవత్సరాల నుంచి బంగారం ధరలు క్రమంగా పెరుగుతూనే వస్తున్నాయి. కొంతకాలం క్రితం వరకు 10 గ్రాముల బంగారం దాదాపు రూ. 50 వేలు ఉండేది. అయితే ఇప్పుడు అది రూ. లక్షకు చేరుకుంది. జూలై 2025లో.. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు అత్యధికంగా రూ. 1,02,640 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల ధర కూడా దీనికి దగ్గరగా ఉంది. దేశంలోని చాలా నగరాల్లో ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మరో షాకింగ్ అయోమయం ఏంటంటే.. రాబోయే 5 సంవత్సరాలలో బంగారం ఎక్కడికి చేరుకుంటుంది అనేది పెద్ద ప్రశ్న. నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. రాబోయే ఐదు సంవత్సరాలలో Gold Rate రూ. 2.50 లక్షలకు చేరుకుంటుంది.
దాదాపు ఆరు సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్లయితే బంగారం 10 గ్రాములకు దాదాపు రూ. 30 వేల ధరకు అందుబాటులో ఉండేది. అంటే, 2019, 2025 మధ్య దాని ధర దాదాపు 200 శాతం పెరిగింది. ఈ కాలంలో మనం చూసుకున్నట్లయితే.. బంగారం ప్రతి సంవత్సరం సగటున 18 శాతం చొప్పున పెరుగుతూ వచ్చింది. ఇదే ధోరణి కొనసాగితే.. రాబోయే 5 సంవత్సరాలలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 2.25 నుండి 2.5 లక్షలకు చేరుకుంటుందని బ్యాకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు.

బంగారం ధరల పెరుగుదల వెనుక అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం, COVID మహమ్మారితో ఆర్థిక ప్రభావం, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు బంగారాన్ని సురక్షితమైన డిమాండ్ గా మార్చివేశాయి. ఈ అంశాలతో పెట్టుబడిదారులు బంగారాన్ని చాలా కాలంగా సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. ప్రపంచంలో ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా.. పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతూ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో దాని డిమాండ్, ధర రెండూ ఒకేసారి పెరుగుతున్నాయి. ఏప్రిల్ 2025లో కూడా.. MCX లో బంగారం 10 గ్రాములకు రూ. 1,01,078కి చేరుకుంది. ఇది పెరగడమే కాని తగ్గేది లేదని నిపుణులు చెబుతున్నారు.
అయితే కొన్ని నివేదికలు మాత్రం బులియన్ మార్కెట్ ఇప్పుడు స్థిరపడవచ్చని చెబుతున్నాయి. చైనా తన బీమా రంగంలోని మొత్తం ఆస్తులలో 1 శాతం మాత్రమే బంగారంలో పెట్టుబడి పెట్టింది. అనేక కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లను ప్రస్తుతం తగ్గిస్తున్నాయి. సమీప భవిష్యత్తులో ఏదైనా అంతర్జాతీయ సంక్షోభం నెలకొనకపోతే Gold ధరల పెరుగుదల ఆగిపోవచ్చు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

Gold prices: యుద్ధం జరుగుతున్నా బంగారం ధరలు ఎందుకు పెరగడం లేదు? ఇన్వెస్టర్ల భయం ఇదే..

Gold: ఉగాదికి బంగారం కొనొచ్చా? ఈ ఏడాది డబుల్ ప్రాఫిట్స్ గ్యారెంటీనా?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications