బంగారం ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్నాయి. గతేడాది నుంచి బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. జనవరి నెలలో అయితే ఏకంగా 10 గ్రాముల బంగారం రూ. 2 లక్షల సమీపానికి వెళ్లి పసిడి ప్రియులకు చుక్కలు చూపించింది. ఈ నెలలో కాస్త తగ్గుముఖం పట్టినా మళ్లీ పెరుగుదల స్టార్ట్ అయింది. భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉంటాయనే దానిపై నిపుణులు ఇప్పటికే పలు అంచనాలను కూడా విడుదల చేశారు. తాజాగా బంగారం ధరల పెరుగుదలపై అమెరికా బాంబు పేల్చింది.
గత వారం అంతర్జాతీయ బంగారం మార్కెట్లో చోటు చేసుకున్న తీవ్ర అస్థిరతకు చైనా వ్యాపారులే ప్రధాన కారణమని అమెరికా ఆరోపించింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ ఈ అంశంపై స్పందిస్తూ.. చైనాలో బంగారం ట్రేడింగ్ పరిస్థితులు అనియంత్రితంగా మారాయని వ్యాఖ్యానించారు. చైనా అధికారులు మార్జిన్ అవసరాలను కఠినతరం చేయడం వల్లే బంగారం ధరల్లో అకస్మాత్తుగా భారీ ఊగిసలాట చోటు చేసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫాక్స్ న్యూస్‌లో ప్రసారమైన సండే మార్నింగ్ ఫ్యూచర్స్ కార్యక్రమంలో మాట్లాడిన బెస్సెంట్.. బంగారం కదలికలను గమనిస్తే, చైనాలో పరిస్థితులు చాలా కఠినంగా మారినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మార్జిన్ నిబంధనలను కఠినతరం చేయాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. అందుకే Gold ధరల ప్రవర్తన నాకు ఒక క్లాసిక్ స్పెక్యులేటివ్ బ్లోఅవుట్ లాగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు రావడానికి ముందు వరకూ బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఊహాజనిత పెట్టుబడులు భారీగా పెరగడం, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అలాగే ఫెడరల్ రిజర్వ్ స్వాతంత్ర్యం గురించి పెరుగుతున్న ఆందోళనలు Gold ర్యాలీకి ప్రధాన కారణాలుగా మారాయి. పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై దృష్టి పెట్టడంతో, విలువైన లోహాల మార్కెట్‌లో భారీ లాభాలు నమోదయ్యాయి.
అయితే ఈ రికార్డు ర్యాలీ తర్వాత బంగారం ధరలు ఒక్కసారిగా తిరోగమనం చెందాయి. ఇదే సమయంలో అమెరికన్ డాలర్ జనవరి ప్రారంభం తర్వాత తొలిసారి వారపు లాభాన్ని నమోదు చేసుకుంది. మార్కెట్‌లో రిస్క్ సెంటిమెంట్ మెరుగుపడటం వల్ల డాలర్‌కు మద్దతు లభించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా స్టాక్ మార్కెట్ కూడా ఇదే సమయంలో సరికొత్త రికార్డులను సృష్టించింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ తొలిసారిగా 50 వేల మార్క్‌ను అధిగమించడం విశేషం. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల విశ్వాసం ఇంకా బలంగా ఉందని సూచిస్తుందని బెస్సెంట్ పేర్కొన్నారు. ముఖ్యంగా కార్పొరేట్ లాభాలు, వినియోగ వ్యయం బలంగా కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.
రాబోయే నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో, అమెరికా ఆర్థిక వ్యవస్థ సాధారణ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే దిశగా ముందుకు సాగుతోందని బెస్సెంట్ అభిప్రాయపడ్డారు. డౌ జోన్స్ రికార్డు స్థాయి అదే విషయానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.ఫెడరల్ రిజర్వ్ విధానంపై స్పందిస్తూ.. సెంట్రల్ బ్యాంక్ తన బ్యాలెన్స్ షీట్‌ను తగ్గించే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుందని బెస్సెంట్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫెడ్ చాలా త్వరగా ఏదైనా నిర్ణయం తీసుకుంటుందని నేను ఆశించడం లేదు. వారు ఇప్పుడు మరింత స్థిరమైన పాలన విధానాన్ని అనుసరిస్తున్నారు. దానికి పెద్ద బ్యాలెన్స్ షీట్ అవసరం. కాబట్టి కనీసం ఒక సంవత్సరం పాటు వారు పరిస్థితిని గమనిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. తదుపరి ఫెడరల్ రిజర్వ్ చీఫ్‌గా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేసిన కెవిన్ వార్ష్ గురించి మాట్లాడుతూ.. ఆయన స్వతంత్రంగా పనిచేసే వ్యక్తి అని, అయితే ఫెడరల్ రిజర్వ్ అమెరికన్ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందేనని బెస్సెంట్ స్పష్టం చేశారు.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications