కొంపముంచిన బంగారం, వెండి.. 4 వేలు పెరిగిన ధర.. కస్టమర్లకు కన్నీళ్లే..

అక్షయ తృతియకి ముందు ఇవాళ బంగారం ధరలు ఒక్కసారిగా షాకిచ్చాయి. నిన్న, మొన్న తగ్గుతూ వస్తున్న ధరలు నేడు రూ.400 పెరిగి కస్టమర్లకి ఆందోళన పెంచాయి. మన దేశంలో ప్రస్తుతం ఒక పక్క పెళ్లిళ్ల సీజన్, మరో పక్క అక్షయతృతియకి షాపింగ్ చేసేందుకు రెడీ అవుతున్న సమయంలో ధరలు పెరగడం నిరాశ అని చెప్పవచ్చు. కానీ కొన్ని జ్యువెలరీ షాపులు కస్టమర్లను ఆకర్షించడానికి ఇంకా సేల్స్ పెంచుకోవడానికి ఇప్పటికే ఆఫర్లను ప్రకటించాయి. కొద్దీ రోజుల క్రితం పసిడి ధర 10 గ్రాములకు లక్ష దాటినా సంగతి మీకు తెలిసిందే. అయితే ఆ మరుసటి రోజే 3 వేలు తగ్గి లక్షకి కిందకి పడిపోయింది. అప్పటి నుండి పసిడి ధరల్లో కొంత మెత్తదనం వచ్చింది. అయినా కుడా బంగారం ధర లక్షకి చేరువలో పరుగులు పెడుతూండటం గమనార్హం. ఇక వెండి ధరల గురించి మాట్లాడితే ప్రస్తుతం లక్షకి పైనే కొనసాగుతుంది.

Gold price surges rs 400 per 10 grams at rs 97 970 silver price stable check april 29 rates in telangana and andhrapradesh

ప్రస్తుతం 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.40 పెరిగి రూ.8,980, 24 క్యారెట్ల ధర రూ.44 పెరిగి రూ.9,797, 18 క్యారెట్ల ధర రూ.33 పెరిగి రూ.7,348. దింతో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.89,800, నిన్నటి ధర రూ.89,400 అంటే రూ.400 పెరగ్గా, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.97,970, నిన్నటి ధర చూస్తే రూ.97,530 దింతో రూ.440 తగ్గింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.73,480, నిన్నటి ధర రూ.73,150 అంటే రూ.330 పెంపును నమోదు చేసింది.

దేశంలోని ప్రముఖ నగరాల్లో నేటి ధరలు చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.89,950, 24 క్యారెట్లకు రూ.98,120, 18 క్యారెట్లకు రూ.73,600, ఆర్ధిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.89,800, 24 క్యారెట్లకు రూ.97,970, 18 క్యారెట్లకు రూ.73,480, చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.89,800, 24 క్యారెట్లకు రూ.97,970, 18 క్యారెట్లకు రూ.74,350, కోల్కత్తలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.89,800, 24 క్యారెట్లకు రూ.97,970, 18 క్యారెట్లకు రూ.73,480

తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.89,400, 24 క్యారెట్లకు రూ.97,530, 18 క్యారెట్లకు రూ.73,150. కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.89,400, 24 క్యారెట్లకు రూ.97,530, 18 క్యారెట్లకు రూ.73,150. ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.89,400, 24 క్యారెట్లకు రూ.97,530, 18 క్యారెట్లకు రూ.73,150. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.89,400, 24 క్యారెట్లకు రూ.97,530, 18 క్యారెట్లకు రూ.73,150.

ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి ధరలు: విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.89,800, 24 క్యారెట్లకు రూ.97,970, 18 క్యారెట్లకు రూ.73,480. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.89,800, 24 క్యారెట్లకు రూ.97,970, 18 క్యారెట్లకు రూ.73,480. అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.89,800, 24 క్యారెట్లకు రూ.97,970, 18 క్యారెట్లకు రూ.73,480. గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.89,800, 24 క్యారెట్లకు రూ.97,970, 18 క్యారెట్లకు రూ.73,480. నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.89,800, 24 క్యారెట్లకు రూ.97,970, 18 క్యారెట్లకు రూ.73,480. కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.89,800, 24 క్యారెట్లకు రూ.97,970, 18 క్యారెట్లకు రూ.73,480. తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.89,800, 24 క్యారెట్లకు రూ.97,970, 18 క్యారెట్లకు రూ.73,480. కడపలో 22 క్యారెట్ల ధర రూ.89,800, 24 క్యారెట్లకు రూ.97,970, 18 క్యారెట్లకు రూ.73,480. అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.89,800, 24 క్యారెట్లకు రూ.97,970, 18 క్యారెట్లకు రూ.73,480.

మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.100.50గా ఉండగా, 10 గ్రాములకి రూ.1005, కేజీకి నేడు రూ.1,00,500 అంటే ఇవాళ వెండి స్థిరంగా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.1,00,500, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,11,000.

0034 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 0.3 శాతం తగ్గి $3,332.99 డాలర్లకి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం తగ్గి $3,343.20 డాలర్లకి చేరుకుంది. ఇతర లోహాలు చూస్తే స్పాట్ వెండి ఔన్సుకు 0.2 శాతం తగ్గి $33.10కి చేరుకుంది, ప్లాటినం $986.13 వద్ద స్థిరంగా ఉంది ఇంకా పల్లాడియం 0.3 శాతం తగ్గి $946.51కి చేరుకుంది.

బంగారం ధరల ప్రస్తుత పరిస్థితి ఏమిటి: బంగారం ధరలు రాకెట్లా పెరుగుతాయా లేదా మరింత తగ్గుముఖం పడతాయా అనేది అంతర్జాతీయ స్థాయిలో నెలకొంటున్న ప్రస్తుత పరిస్థితుల పై ఆధారపడి ఉంటుంది. అమెరికా, చైనా మధ్య సుంకాల వార్ అలాగే ట్రేడ్ సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి పెద్ద వార్తలు రాలేదు. సుంకాల తగ్గింపు గురించి డోనాల్డ్ ట్రంప్ మాట్లాడగా, దానికి ప్రతిస్పందనగా చైనా ఎటువంటి చర్చలు జరపడానికి సిద్ధంగా లేదు. అప్పటి నుండి ఈ విషయంపై రెండు వైపుల నుండి దాదాపు మౌనం నెలకొంది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం తీవ్రమైతే బంగారం ధర రాకెట్ లా పెరిగే అవకాశం ఉంది. అంతేకాక పరిస్థితి సాధారణమైతే పసిడి ధరల్లో కొంత తగ్గుదల ఉండవచ్చు.

బంగారం ధర ఎంత వరకు పెరగవచ్చంటే : అమెరికా, చైనా మధ్య పరిస్థితి సాధారణమైతే రాబోయే 6 నెలల్లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 75,000 స్థాయికి చేరుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే అమెరికన్ ఆర్థిక సంస్థ యార్దేని రీసెర్చ్ అధ్యక్షుడు ఎడ్ యార్దేని మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక అస్థిరత, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు ఇంకా డాలర్ బలహీనపడటం బంగారం ధరల పెరుగుదలకు కారణమని అన్నారు. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో కొనసాగితే బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దింతో బంగారం ధర ఈ సంవత్సరం చివరి నాటికి ఔన్సుకు $4000 నుండి 2026లో ఔన్సుకు $5000కి చేరుకోవచ్చు. అంటే భారతదేశంలో దీని ధర 10 గ్రాములకు రూ.1,53,000 వరకు పెరగవచ్చు.

బంగారం ధరలను ఎవరు నిర్ణయిస్తారు: ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరను లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) నిర్ణయిస్తుంది. ఇంకా బంగారం ధరలను US డాలర్లలో ప్రచురిస్తుంది. అదే సమయంలో మన దేశంలో ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) అంతర్జాతీయ బంగారం ధరలకు దిగుమతి సుంకం సహా ఇతర పన్నులను కలిపి బంగారం అమ్మే రేటును నిర్ణయిస్తుంది.

note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+