బంగారం వెండి ధరల భగభగ.. 6వేలు పెరిగిన తులం రేటు.. కొనడం కష్టమేనా..?

హోలీకి ముందు బంగారం, వెండి కొనాలని చేస్తున్నవారికి కోలుకొని షాక్ తగిలింది. ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల అలాగే 24 క్యారెట్ల ధర భారీగా పెరిగింది. ఇక పసిడి బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతూ ఇవాళ ఒక్కరోజే రెండు వేలు ఎగబాకింది. నిన్న ఇవాళ చేస్తే బంగారం ధర ఏకంగా వెయ్యికి పెరిగింది. పెళ్లిళ్ల సీజన్లో గోల్డ్ ట్రెండ్ ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో తులం ధర లక్షకి చేరుకోవడంలో ఎక్కువ సమయం కూడా పట్టదు. రోజురోజుకి పెరుతున్న రేట్లు సామాన్యులకి ఆందోళన కలిగిస్తున్నాయి.

gold price surged today gold price hiked rs6000 silver rs2000 check vijayawada and vizag rates here

అంతేకాదు తులం కొనేందుకు ఆలోచిస్తున్న కస్టమర్లు గ్రాములతో సరిపెట్టుకుంటున్నారు. ఇక పండుగల సమయంలో బంగారం కొనేందుకు చూస్తున్న పసిడి ప్రియులు ధరల పెంపు చూసి ఎంత పెరుగుతుందో అని భయాందోళన చెందుతున్నారు. గత ఏడాదితో పోల్చి చూస్తే బంగారం, వెండి రెండు కూడా భారీగా పెంపును చూశాయి. ఈ ఏడాది మొదటి నుండి దిగొస్తాయనుకున్న ధరలు మాత్రం అంతకుమించే పెరిగాయి. ఒక విధంగా చేస్తే గడిచిన 6 నెలల్లో పసిడి ధర వేలలో పెరిగింది. అయితే ప్రతిరోజు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకి చాల కారణాలు ఉంటాయి. వీటిలో ప్రపంచ రాజకీయ ఉద్రిక్తలు, డాలరుతో రూపాయి విలువ అలాగే మరికొన్ని అంశాలు బంగారం ధరలు ప్రభావితం చేస్తాయి.

గత 10 రోజుల్లో బంగారం ధరలు చూస్తే మార్చి 04న 22 క్యారెట్ల ధర రూ.78,814, మార్చి 05న రూ.79,672, మార్చి 06న రూ.79,672, మార్చి 07న రూ.79,817, మార్చి 08న రూ.79,672, మార్చి 09న రూ.79,697, మార్చి 10న రూ.79,697, మార్చి 11న రూ.79,697, మార్చి 12న రూ.79,898. ఇక 24 క్యారెట్ ధర చూస్తే మార్చి 04న 22 క్యారెట్ల ధర రూ.85,549, మార్చి 05న రూ.86,480, మార్చి 06న రూ.86,480, మార్చి 07న రూ.86,638, మార్చి 08న రూ.86,480, మార్చి 09న రూ.86,508, మార్చి 10న రూ.86,508, మార్చి 11న రూ.86,508, మార్చి 12న రూ.86,726 .

నేడు 1 గ్రాము, 10 గ్రాముల బంగారం ధర
1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.8,120, 24 క్యారెట్ల ధర రూ. 8,958, 18 క్యారెట్ల ధర రూ. 6,644.10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 81,200, నిన్నటి ధర రూ.80,650 అంటే రూ.550 పెరగగా, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 88,580, నిన్నటి ధర చూస్తే రూ.87,980 దింతో రూ.600 ఎగిసింది. 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.66,440, నిన్నటి ధర రూ.65,990 సుమారు రూ.450 పెరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.81,200, 24 క్యారెట్లకు రూ.88,580, 18 క్యారెట్లకు రూ.66,440,
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.81,200, 24 క్యారెట్లకు రూ.88,580, 18 క్యారెట్లకు రూ.66,440,
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.81,200, 24 క్యారెట్లకు రూ.88,580, 18 క్యారెట్లకు రూ.66,440,
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.81,200, 24 క్యారెట్లకు రూ.88,580, 18 క్యారెట్లకు రూ.66,440,
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.81,200, 24 క్యారెట్లకు రూ.88,580, 18 క్యారెట్లకు రూ.66,440,
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.81,200, 24 క్యారెట్లకు రూ.88,580, 18 క్యారెట్లకు రూ.66,440,
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.81,200, 24 క్యారెట్లకు రూ.88,580, 18 క్యారెట్లకు రూ.66,440,
కడపలో 22 క్యారెట్ల ధర రూ.81,200, 24 క్యారెట్లకు రూ.88,580, 18 క్యారెట్లకు రూ.66,440,
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.81,200, 24 క్యారెట్లకు రూ.88,580, 18 క్యారెట్లకు రూ.66,440,
ఇవాళ వెండి ధర చూస్తే 100 గ్రాములకి రూ.100 పెరగగా కేజీ ధర రూ.1000 పెరిగి రూ.1,10,000 చేరింది.

కొత్త రికార్డు సృష్టించిన వెండి ధర : వెండి ధరల్లో నేడు భారీ పెరుగుదల కనిపించింది. దింతో కిలోకు రూ.1,000 పెరిగి రూ.1,09,000కి చేరుకుంది, దాదాపు మూడు వారాల్లో ఇదే అత్యధిక స్థాయి. నిన్న కిలోకు రూ.2,000గా పెరగగా, గడిచిన 24 గంటల్లోనే వెండి 3 వేలు పెరగటం గమనించదగ్గ విశేషం.

22క్యారెట్ vs 24క్యారెట్: ఏది బెస్ట్ : 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది, ఇది పెట్టుబడికి బెస్ట్ అప్షన్. అయితే దీనితో ఆభరణాలు తయారు చేయలేరు ఎందుకంటే 24 క్యారెట్ల బంగారం చాల మృదువైనది ఇంకా మన్నిక తక్కువ. మరోవైపు, 22 క్యారెట్ల బంగారంలో 91.6% స్వచ్ఛతతో ఉంటుంది ఇంకా దీనితో ఆభరణాల తయారు చేసేటప్పుడు కొన్ని మిశ్రమలోహాలు కలిపి చేస్తారు, ఇలా ఇతర లోహాలు కలపడం వల్ల ఆభరణాలు దృఢంగా ఇంకా మన్నికను అందిస్తుంది. మీరు ప్రతిరోజు ధరించే ఆభరణాల కోసం చూస్తున్నట్లయితే 22K బంగారం బెస్ట్ అప్షన్.

Take a Poll

అంతర్జాతీయంగా చూస్తే ఈ నెల ప్రారంభంలో అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా వస్తువులపై సుంకాలను 20%కి పెంచారు అలాగే కెనడా, మెక్సికో దిగుమతులపై 25% సుంకాన్ని విధించారు. కానీ ట్రంప్ యుఎస్-మెక్సికో-కెనడా ఒప్పందానికి అనుగుణంగా ఉండే వస్తువులకు ఒక నెల మినహాయింపు కల్పించారు. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.4% పెరిగి $2,943.66 వద్ద ఉండగా, యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2% పెరిగి $2,951.90 వద్ద ఉంది. రాబోయే నెలల్లో బంగారం $3,000 మార్కును తాకవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇతర లోహాలలో స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.1% పెరిగి $33.26కి చేరుకుంది, ప్లాటినం 0.4% పెరిగి $987.90కి చేరుకోగా, పల్లాడియం 0.9% పెరిగి $957.60కి చేరుకుంది.

note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+