ఆకాశానంటుతున్న బంగారం, వెండి.. 2వేలు పెరిగిన ధర.. కొత్త ధరలు ఇవే..

బంగారం ధరలు నేడు మళ్ళీ భగ్గుమన్నాయి. దింతో 10 గ్రాముల ధర దాదాపు రూ.220 పెరగ్గా, వెండి ధర కాస్త చల్లబడింది. అయితే పెళ్లిళ్ల సీజన్ సమయంలో ధరలు పెరగడం సామాన్యులకు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, కొనుగోళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో జరగటం లేదని జ్యువెలరీ షాపులు వాపోతున్నారు. మరోవైపు అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్లను ఆకర్షించడానికి, అమ్మకాలు పెంచుకోవడానికి ప్రముఖ గోల్డ్ షాపులు రకరకాల డిస్కౌంట్ ఆఫర్లను ప్రవేశపెట్టిన సంగతి మీకు తెలిసిందే. ఇక గడిచిన కొద్దీరోజుల్లో చూస్తే పసిడి ధరలు ఎన్నడూ లేని విధంగా ఆల్ టైం హై రికార్డ్ స్థాయి లక్ష దాటింది. కానీ గత వారం చాలా వరకు పసిడి ధరలు తగ్గగా ఇవాళ మాత్రం కాస్త పెరిగింది. ఇక వెండి ధరలు చూస్తే ఈ ఏడాది మొదటి నుండి లక్షకి పైనే కూర్చుంది.

gold price surged 2000 per 10 grams silver slightly slashed in andhrapradesh and telangna

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. చైనాతో వాణిజ్య చర్చలు ముగుస్తాయని అమెరికా నుండి సంకేతాలు వస్తున్నాయి. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, ప్రపంచంలో ఉద్రిక్తత తగ్గుతున్న కొద్దీ బంగారం డిమాండ్ కూడా తగ్గవచ్చు. సాధారణంగా ప్రజలు సంక్షోభ సమయాల్లో బంగారం కొంటారు. డాలర్ బలపడటం కూడా బంగారం ధరలపై ఒత్తిడి తెస్తుంది. అయితే నిపుణుల అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ యుద్దాలు సహా పలు అంశాలు కలిసి వస్తే కొద్దినెలల్లోనే బంగారం 70 వేలకు పడిపోవచ్చని చెబుతున్నారు. అలాగే అమెరికా చైనా ట్రేడ్ వార్ అండ్ రష్యా ఉక్రేన్ యుద్ధం మరింతగా ముదిరితే పసిడి తులం ధర 1 లక్ష 25 వేలకు పరుగులు తీయొచ్చు అని హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.20 పెరిగి రూ.8,775, 24 క్యారెట్ల ధర రూ.22 పెరిగి రూ.9,573, 18 క్యారెట్ల ధర రూ.16 పెరిగి రూ.7,180. దింతో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.87,750, నిన్నటి ధర రూ.87,550 అంటే రూ.200 పెరగ్గా, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.95,730, నిన్నటి ధర చూస్తే రూ.95,510 దింతో రూ.220 పెరిగింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.71,800, నిన్నటి ధర రూ.71,640 అంటే రూ.160 పెంపును నమోదు చేసింది.

తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.87,750, 24 క్యారెట్లకు రూ.95,730, 18 క్యారెట్లకు రూ.71,800. కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.87,750, 24 క్యారెట్లకు రూ.95,730, 18 క్యారెట్లకు రూ.71,800. ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.87,750, 24 క్యారెట్లకు రూ.95,730, 18 క్యారెట్లకు రూ.71,800. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.87,750, 24 క్యారెట్లకు రూ.95,730, 18 క్యారెట్లకు రూ.71,800.

ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి ధరలు: విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.87,750, 24 క్యారెట్లకు రూ.95,730, 18 క్యారెట్లకు రూ.71,800. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.87,750, 24 క్యారెట్లకు రూ.95,730, 18 క్యారెట్లకు రూ.71,800. అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.87,750, 24 క్యారెట్లకు రూ.95,730, 18 క్యారెట్లకు రూ.71,800. గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.87,750, 24 క్యారెట్లకు రూ.95,730, 18 క్యారెట్లకు రూ.71,800. నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.87,750, 24 క్యారెట్లకు రూ.95,730, 18 క్యారెట్లకు రూ.71,800. కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.87,750, 24 క్యారెట్లకు రూ.95,730, 18 క్యారెట్లకు రూ.71,800. తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.87,750, 24 క్యారెట్లకు రూ.95,730, 18 క్యారెట్లకు రూ.71,800. కడపలో 22 క్యారెట్ల ధర రూ.87,750, 24 క్యారెట్లకు రూ.95,730, 18 క్యారెట్లకు రూ.71,800. అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.87,750, 24 క్యారెట్లకు రూ.95,730, 18 క్యారెట్లకు రూ.71,800.

మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.97గా ఉండగా, 10 గ్రాములకి రూ.970, కేజీకి నేడు రూ.97,00 అంటే ఇవాళ వెండి వెయ్యి తగ్గింది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.97,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,08,000.

అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.44 శాతం పెరిగి 3,255.1 డాలర్లకు చేరుకోగా.. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు 0.6 శాతం పెరిగి 3,262.74 డాలర్లకు చేరుకుంది. స్పాట్ సిల్వర్ 0.42 శాతం పెరిగి ఔన్సుకు $32.14కి చేరుకుంది.

బంగారం స్వచ్ఛమైనదా కాదా ఎలా చెక్ చేయాలంటే : బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) హాల్ మార్కులను ఇస్తుంది. 24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది అలాగే 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో రాగి, వెండి, జింక్ వంటివి 9% ఇతర లోహాలను కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. కానీ 22 క్యారెట్ల బంగారం 0.916 స్వచ్ఛతతో ఉండాలి. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999 అని, 23 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 958 అని, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 916 అని, 21 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 875 అని, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 750 అని రాసి ఉంటుంది.
24 క్యారెట్ల బంగారంలో కల్తీ ఉండదు, ఇవి నాణేలు, బార్స్ రూపంలో ఉంటాయి, కానీ 24 క్యారెట్ల బంగారంతో ఆభరణాలు తయారు చేయలేము, అందుకే చాలా మంది 18, 20 ఇంకా 22 క్యారెట్ల బంగారాన్ని అమ్ముతారు. మన దేశంలో బంగారం ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. ఇవి ఆభరణాల వ్యాపారి, పన్నులు, తయారీ ఛార్జీలపై కూడా ఆధారపడి ఉంటాయి.

note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+