ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, డాలర్ బలహీనత, వడ్డీ రేటు కోతలపై పెరుగుతున్న అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో, శుక్రవారం గమనించిన అస్థిరత తర్వాత, సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. US లేబర్ మార్కెట్ బలహీనత్వం, ఆరు వారాల పాటు కొనసాగిన అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ వల్ల ఆర్థిక డేటా విడుదల ఆలస్యం కావడంతో, డిసెంబర్‌లో ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేటు తగ్గించే అవకాశాలు బలపడ్డాయి. ఈ అంచనాలే విలువైన లోహాలకు ప్రత్యేకంగా బంగారానికి బలమైన మద్దతు ఇస్తున్నాయి.
ప్రస్తుతం గ్లోబల్ స్పాట్ Gold ధరలు 2,675 డాలర్ల సమీపంలో ట్రేడ్ అవుతున్నాయి. ఇది రికార్డు గరిష్ట స్థాయికి కొద్ది దూరంలోనే ఉంది. భారత మార్కెట్లోనూ ఇదే ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. MCX లో బంగారం ఫ్యూచర్స్ ధరలు రూ. 90 వేల పై స్థాయిని దాటి స్థిరంగా నిలిచాయి. వ్యాపార విశ్లేషకుల ప్రకారం, గ్లోబల్ మద్దతు, దేశీయ అవసరాల పెరుగుదల కొనసాగితే, బంగారం త్వరలోనే రూ. 1.31 లక్షల మార్కును చేరే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. బలహీనపడుతున్న అమెరికా డాలర్, రాబోయే వడ్డీ కోత బంగారానికి మరింత ఊతం ఇచ్చే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బాండ్ యీల్డ్స్ తగ్గుతాయి, దాంతో బంగారం పెట్టుబడిదారులకు ఇంకా ఆకర్షణీయమవుతుంది, ఎందుకంటే బంగారంపై రిటర్న్ పరోక్షంగా పెరుగుతుంది.

ఫెడరల్ రిజర్వ్ గత అక్టోబర్ సమావేశంలో పావు శాతం (25 bps) వడ్డీ రేటు తగ్గింపు చేసింది. అయితే డిసెంబర్‌లో మరో కోత ఉంటుందో లేదో అనిశ్చితిగా భావించిన మార్కెట్లు ఇప్పుడు పూర్తిగా రేటు తగ్గింపునే ధరలోనే ట్రేడ్ అవుతున్నాయి. డిసెంబర్ 9-10 తేదీల్లో సమావేశం కానున్న ఈ నిర్ణయం బంగారు మార్కెట్ మరింత బలంగా ప్రతిస్పందించే అవకాశం ఉంది. రేటు కోత ధృవీకరణ వెలువడితే బంగారం వెంటనే భారీగా ఎగబాకే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
గత ఏడాది అంతా బంగారం బలమైన ర్యాలీ చూపింది. దేశీయ స్పాట్ ధరలు ఏడాదిలో 66 శాతం పెరిగాయి. 1979 తర్వాత అత్యధిక వార్షిక లాభాలను బంగారం సాధించినట్టు పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది ప్రకారం.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఆర్థిక విధానాలపై అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు, శక్తివంతమైన రిటైల్ డిమాండ్ ధరలను సపోర్ట్ చేస్తున్నాయి.
మనోజ్ కుమార్ జైన్ (పృథ్వీఫిన్‌మార్ట్) ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర మద్దతు 4,234 డాలర్ల నుంచి 4,200 డాలర్ల మధ్యలో ఉంది. అంటే ఈ స్థాయి వద్ద బంగారం కొంటే లాభాల బాట పట్టే అవకాశం ఉంది. ఇక నిరోధం 4,300 డాలర్ల నుంచి 4,340 డాలర్ల మధ్యలో అంచనా వేస్తున్నారు. అంటే ఈ స్థాయి వద్ద బంగారం కొనుగోళ్లు ఆపేయాలని చెబుతున్నారు. ఇక వెండి విషయానికి వస్తే.. మద్దతు $55.50 నుంచి $54.70 కాగా నిరోధం $57.40 నుంచి $58 వద్ద అంచనా వేస్తున్నారు.
మన దేశ మార్కెట్లో చూసుకున్నట్లయితే బంగారం ధర రూ. 1,28,200 నుంచి రూ. 1,27,700 మధ్యలోకి వచ్చినప్పుడు కొంటే కొంచెం లాభాలను వెనక వేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక నిరోధం రూ. 1,30,300 నుంచి రూ. 1,31,200 మధ్యలో అంచనా వేస్తున్నారు. వెండి విషయానికి వస్తే MCX లో మద్దతు ధర రూ. 1,72,500 / రూ.1,69,600 ఉండగా నిరోధం రూ. 1,78,800 / రూ. 1,81,000గా ఉంది.
జైన్ టార్గెట్ స్ట్రాటజీ ప్రకారం చూసుకున్నట్లయితే రూ. 1,29,500 నుంచి రూ. 1,28,800 మధ్య బంగారం కొనాలి. అలాగే స్టాప్ లాస్ చూసుకున్నట్లయితే రూ. 1,28,100గా అంచనా వేశారు. టార్గెట్ రూ. 1,30,300 నుంచి రూ. 1,31,200 మధ్యలో అంచనా వేశారు. ఇక వెండిని చూసుకున్నట్లయితే.. రూ. 1,74,000 - రూ. 1,71,000 మధ్య కొనాలి, స్టాప్ లాస్ రూ. 1,69,600, టార్గెట్ రూ. 1,78,800 - రూ. 1,81,000గా అంచనా వేశారు.
రాహుల్ కలాంత్రి (మెహతా ఈక్విటీస్) ప్రకారం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ Gold మద్దతు 4,165 డాలర్ల నుంచి 4,135 డాలర్ల మధ్యలో ఉండగా.. నిరోధం 4,245 డాలర్ల నుంచి 4,265 డాలర్ల మధ్యలో ఉంది. MCX బంగారం కొనుగోలు స్థాయి చూసుకున్నట్లయితే రూ. 1,26,350 నుంచి రూ. 1,25,550 వద్ద అంచనా వేశారు. ఇక నిరోధం అంటే కొనుగోలు ఆపే స్థాయి రూ. 1,27,650 నుంచి రూ. 1,28,100 మధ్యలో అంచనా వేశారు. నిపుణులు చెబుతున్న దానినిబట్టి చూస్తే..బంగారం ధరలు రూ. 1,30,300 నుండి రూ. 1,31,200 కీలక నిరోధ స్థాయిలు. ఫెడ్ రేటు కోత జరిగితే, ఈ స్థాయిని బంగారం దాటే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications