బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ ఊపందుకుంటున్నాయి. తాజాగా బంగారం ధర లక్ష రూపాయలకు చేరువలో ఉంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో బంగారం పెట్టుబడిదారులకు మంచి రాబడిని అందించిందని చెప్పవచ్చు. డాలర్ విలువ పడిపోవడం, వడ్డీ రేట్లలో మార్పులు, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు ఇవన్నీ కలిపి బంగారం ధరను అమాంతం పైకి లేపాయి. 1973 తర్వాత అమెరికా డాలర్ అతి తక్కువ స్థాయిలో బలహీనపడటంతో పాటుగా వడ్డీ రేట్లు తగ్గే అంచనాలు, వాణిజ్య యుద్ధాలు వంటి అంశాలు బంగారం ధరలను విపరీతంగా ప్రభావితం చేశాయి.
ఈ ఏడాది ప్రధమార్థంలో డాలర్ బలహీనత వల్ల డాలర్ విలువ భారీగా పడిపోయింది. అమెరికా, యూరప్‌లో రేట్లు త్వరలో తగ్గుతాయనే అంచనా కూడా బంగారం ధరల్లో మార్పులకు కారణమైంది. దాదాపుగా 397 టన్నుల బంగారం ETFsలోకి చేరింది. సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు రికార్డు స్థాయిలో కాకపోయినా, 2022కి ముందు కంటే ఎక్కువగా జరిగాయి. భారతదేశంలో బంగారం ధర రూ. 99,2800/10 గ్రాముల వరకు చేరి పెట్టుబడిదారులకు 26 శాతంలాభాలను ఇచ్చింది. చాలా మంది పెట్టుబడిదారులు SGBలు, ETFs, డిజిటల్ గోల్డ్‌ల్లో తమ పెట్టుబడులు పెంచారు.

భారతీయ పెట్టుబడిదారుల బంగారం మీద భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఇదే పంథా కొనసాగించినా మీ పోర్ట్‌ఫోలియోలో 40 శాతం దాటితే కొంత లాభాలు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే SGBలలో లాక్ చేయడం పరిగణించండి, ఎందుకంటే అవి పన్ను మినహాయింపుతో వస్తాయి. ఇక కొత్తగా పెట్టుబడి పెట్టేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న మొత్తంలో SIPలు లేదా ETFsలో ప్రారంభించడం చేయాలి. అలాగే రూ.10 గ్రాముల బంగారం ధర రూ. 90 వేల వద్ద ఉంటే మాత్రమే కొనుగోలు చేయండి. మొత్తం పెట్టుబడిలో బంగారం 10 నుంచి 15 శాతం మాత్రమే ఉండాలని చెబుతున్నారు.
ఏది ఏమైనా బంగారం ధరలు 2025లో బలంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది రెండవ ఆర్థిక మాసంలో బంగారం ధర పెరుగుదల సాధ్యమే కానీ అది ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. రిస్క్‌ను పరిగణనలోకి తీసుకుని, బంగారం పెట్టుబడులను 15 శాతంకి మించకుండా ఉంచడం తెలివైన నిర్ణయమని నిపుణులు చెబుతున్నారు.
జూలై 17, గురువారం Gold ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 49 రూపాయిలు తగ్గింది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.9,928 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 45 రూపాయిలు తగ్గి 9,100 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర 37 రూపాయిలు తగ్గి రూ.7,446 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల Gold రూ. 4,900 తగ్గి రూ. 9,92,800 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.4,500 తగ్గి రూ. 9,10,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల Gold ధర రూ. 3,700 తగ్గి రూ. 7, 44,600 వద్ద ట్రేడ్ అవుతోంది.
డిస్క్లైమర్: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్‌లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఢమాల్..ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే పండగ చేసుకుంటారు .. మార్చి 4,బుధవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications