బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ డాలర్ పుంజుకోవడంతో పసిడి ధరలు దిగి వచ్చాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో పెట్టుబడిదారులు అప్రమత్తమయ్యారు. అయితే ఇదే సమయంలో డాలర్ అనూహ్యంగా పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులను అటు మళ్లించారు. దీంతో విలువైన లోహాలకు డిమాండ్ తగ్గింది. ధరలు నేల చూపులు చూశాయి. అయితే ఈ తగ్గుదల ఎంతకాలం ఉంటుందనే దానిపై క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతానికికైతే ధరలు తగ్గుముఖం పట్టడంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు.
ఫిబ్రవరి 24, మంగళవారం ఉదయం దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. గత సెషన్‌లో భారీ లాభాలు నమోదు కావడంతో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలపడటం, స్పాట్ మార్కెట్లో డిమాండ్ బలహీనంగా ఉండటం వల్ల దేశీయంగా బంగారం, వెండి ధరలపై ఒత్తిడి కనిపించింది.

దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఏప్రిల్ డెలివరీకి సంబంధించిన Gold ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.50 శాతం కంటే ఎక్కువ తగ్గి రూ. 1,60,750 వద్ద ట్రేడైంది. అదే సమయంలో ఏప్రిల్ సిల్వర్ ఫ్యూచర్స్ 0.20 శాతం తగ్గి కిలోకు రూ. 2,64,972కి చేరుకుంది. ఇది గత సెషన్‌లో నమోదైన బలమైన ర్యాలీ తర్వాత వచ్చిన సహజమైన సవరణగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
మునుపటి ట్రేడింగ్ సెషన్‌లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. MCX ఏప్రిల్ Gold ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ దాదాపు 3 శాతం ఎగసి 10 గ్రాములకు రూ. 1,61,550 వద్ద ముగిసింది. అలాగే MCX మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ సుమారు 5 శాతం లాభంతో కిలోగ్రాముకు రూ. 2,65,279 వద్ద ముగియడం విశేషం. ఈ లాభాలే ఇప్పుడు కొంతమేర లాభాల స్వీకరణకు దారితీశాయి.
అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ దాదాపు 0.20 శాతం పెరిగి 97.88కి చేరుకోవడం బంగారం ధరలకు ప్రతికూలంగా మారింది. డాలర్ బలపడితే, ఇతర కరెన్సీల్లో పెట్టుబడి పెట్టే వారికి డాలర్‌లో ధర నిర్ణయించే బంగారం ఖరీదైనదిగా మారుతుంది. దీనివల్ల డిమాండ్ కొంత తగ్గుతుంది. ఫలితంగా బంగారం ధరలు మూడు వారాలకుపైగా ఉన్న గరిష్ట స్థాయిల నుంచి దిగివచ్చాయి.
ఫండమెంటల్స్ విషయానికి వస్తే.. 0125 GMT నాటికి అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు సుమారు 1.5 శాతం తగ్గి 5,150.38 డాలర్ల వద్ద ట్రేడైంది. అంతకు ముందు సెషన్‌లో ఇది మూడు వారాలకుపైగా గరిష్ట స్థాయిని తాకింది. అదే సమయంలో ఏప్రిల్ డెలివరీకి సంబంధించిన అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు 1.1 శాతం తగ్గి 5,170.70 డాలర్ల వద్ద ఉన్నాయి.
అమెరికా వాణిజ్య విధానాలపై కొనసాగుతున్న అనిశ్చితి కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. అత్యవసర సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఒప్పందాల నుంచి వెనక్కి తగ్గితే కఠినమైన సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి మరింత పెరిగింది.
మరోవైపు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఇచ్చిన సంకేతాలు కూడా బంగారం మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఫిబ్రవరి ఉద్యోగ గణాంకాలు బలహీనంగా ఉంటే మార్చి సమావేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశం ఉందని ఫెడ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ తెలిపారు. CME ఫెడ్‌వాచ్ టూల్ ప్రకారం, ఈ ఏడాది మూడు సార్లు 25 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్ల కోతలు ఉండవచ్చని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి.
భౌగోళిక రాజకీయ పరిణామాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను కుదిపేశాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ఆసియా స్టాక్ మార్కెట్లు ఒత్తిడిలోకి వచ్చాయి. ఈ పరిణామాలు సాధారణంగా బంగారానికి మద్దతు ఇస్తున్నా, ప్రస్తుతం బలమైన డాలర్ ప్రభావం వాటిని మించి కనిపిస్తోంది. ఇతర విలువైన లోహాల విషయానికి వస్తే, స్పాట్ వెండి ఔన్సుకు 3.1 శాతం తగ్గి 85.50 డాలర్లకి చేరింది. ప్లాటినం 2.9 శాతం తగ్గి 2,092.31 డాలర్లకి, పల్లాడియం 2.1 శాతం తగ్గి 1,706.50 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.
ఏదేమైనా తాత్కాలికంగా బంగారం ధరలు లాభాల స్వీకరణతో ఒత్తిడిలో ఉన్నప్పటికీ, వాణిజ్య అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ధరలను పూర్తిగా కూలిపోకుండా మద్దతుగా నిలుస్తున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట



Click it and Unblock the Notifications