నేడు బుధవారం ఉదయం బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. నిన్న మొన్న పెరుగుతూ షాకిచ్చిన రేట్లు, ఇవాళ మాత్రం భారీగా పతనమయ్యాయి. దింతో 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా గ్రాముకు రూ.50 తగ్గి రూ.8,805కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర మరింతగా పతనమై గ్రాముకి రూ.54 తగ్గి రూ.9,606 వద్ద ట్రేడవుతోంది. అంతేకాక 18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.41 మేర దిగొచ్చి రూ.7,204 వద్ద స్థిరపడింది.

ఈ ధరల తగ్గింపు బంగారం కొనాలని చూస్తున్నవారికి అలాగే గోల్డ్ షాపింగ్ చేసే వారికి నిజంగా పండగ లాంటి వార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా స్థిరంగా పెరుగుతు వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో సామాన్యులు, పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ ధరల తగ్గుదల మరింత ఉపశమనం కలిగిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గడం, దేశీయంగా డిమాండ్ కాస్త నెమ్మదించడం ఈ ధరల పతనానికి ప్రధాన కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇది తాత్కాలిక తగ్గుదలా లేక ధరలు మరింత దిగివస్తాయా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ప్రస్తుతం బంగారం కొనాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.
బంగారం ధరలు తగ్గడానికి కారణాలు: అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముగియడంతో బంగారం ధర తగ్గిందని నిపుణులు అంటున్నారు. అమెరికా వాణిజ్య విధానంలో వచ్చిన సానుకూల మార్పు, ఇంకా ఇతర ప్రపంచ దేశాలతో జరగనున్న చర్చల వల్ల బంగారం ధర మరింత తగ్గుదలకు దారితీయవచ్చు అని Capital.com ఆర్థిక మార్కెట్ విశ్లేషకుడు కైల్ రోడా అన్నారు.
బంగారంలో ఎలా పెట్టుబడి పెట్టవచ్చు : బంగారు ఆభరణాలతో పాటు మీరు బంగారు ETFలు, మ్యూచువల్ ఫండ్ల గోల్డ్ స్కింలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పెట్టుబడిని ఇంట్లో కూర్చొని చేయవచ్చు. మీరు ఈ పెట్టుబడిని SIP ద్వారా కూడా చేయవచ్చు. ఇందులో, ప్రతి నెలా బంగారంలో కొంత మొత్తాన్ని పెట్టుబడి పెడతారు. అయితే బంగారం ధరలలో హెచ్చుతగ్గులు మీ పెట్టుబడిపై పెద్దగా ప్రభావం చూపవు. కాబట్టి అవసరమైతే మీరు బంగారంలో చేసిన మీ పెట్టుబడిని కూడా ఉపసంహరించుకోవచ్చు.
ప్రస్తుతం 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.50 తగ్గి రూ.8,805, 24 క్యారెట్ల ధర రూ.54 దిగొచ్చి రూ.9,606, 18 క్యారెట్ల ధర రూ.41 పడిపోయి రూ.7,204. దింతో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.88,050, నిన్నటి ధర రూ.88,550 అంటే రూ.500 తగ్గగా, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.96,060, నిన్నటి ధర చూస్తే రూ.96,600 దింతో రూ.540 తగ్గింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.72,040, నిన్నటి ధర రూ.72,450 అంటే రూ.410 తగ్గుదలను నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.88,050, 24 క్యారెట్లకు రూ.96,060, 18 క్యారెట్లకు రూ.72,040. కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.88,050, 24 క్యారెట్లకు రూ.96,060, 18 క్యారెట్లకు రూ.72,040. ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.88,050, 24 క్యారెట్లకు రూ.96,060, 18 క్యారెట్లకు రూ.72,040. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.88,050, 24 క్యారెట్లకు రూ.96,060, 18 క్యారెట్లకు రూ.72,040.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి ధరలు చూస్తే విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.88,560, 24 క్యారెట్లకు రూ.96,610, 18 క్యారెట్లకు రూ.72,460. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.88,560, 24 క్యారెట్లకు రూ.96,610, 18 క్యారెట్లకు రూ.72,460. అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.88,560, 24 క్యారెట్లకు రూ.96,610, 18 క్యారెట్లకు రూ.72,460. గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.88,560, 24 క్యారెట్లకు రూ.96,610, 18 క్యారెట్లకు రూ.72,460. నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.88,560, 24 క్యారెట్లకు రూ.96,610, 18 క్యారెట్లకు రూ.72,460. కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.88,560, 24 క్యారెట్లకు రూ.96,610, 18 క్యారెట్లకు రూ.72,460. తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.88,560, 24 క్యారెట్లకు రూ.96,610, 18 క్యారెట్లకు రూ.72,460. కడపలో 22 క్యారెట్ల ధర రూ.88,560, 24 క్యారెట్లకు రూ.96,610, 18 క్యారెట్లకు రూ.72,460. అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.88,560, 24 క్యారెట్లకు రూ.96,610, 18 క్యారెట్లకు రూ.72,460.
మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.97.90గా ఉండగా, 10 గ్రాములకి రూ.979, కేజీకి నేడు రూ.97,900 అంటే ఇవాళ వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.97,900, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,09,000.
0029 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 0.1 శాతం తగ్గి $3,246.21 డాలర్లకు చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.1 శాతం పెరిగి $3,250.50 డాలర్లకు చేరుకుంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.3 శాతం తగ్గి 32.80 డాలర్లకు, ప్లాటినం 0.1 శాతం తగ్గి 987.55 డాలర్లకు, పల్లాడియం 0.8 శాతం తగ్గి 949.26 డాలర్లకు చేరుకుంది.
మీరు జ్యువెలరీ షాపుల్లో నుండి కొనుగోలు చేసే బంగారం ఎంత స్వచ్ఛమైనదో బంగారం క్యారెట్ ద్వారా తెలుస్తుంది. సాధారణంగా 24 క్యారెట్ల బంగారాన్ని అత్యంత స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. కానీ ఈ బంగారంతో ఆభరణాలు తయారు చేయలేరు. అందువల్ల, 22 క్యారెట్ల బంగారాన్ని ఎక్కువగా ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. అలాగే 22 క్యారెట్ల బంగారానికి ఇతర లోహాలను కలిపి ఆభరణాలను తయారు చేస్తారు. దీని వల్ల ఆభరణాలు మన్నికతో ఉంటాయి.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications