బంగారం వెండి కొనేవారికి నేడు మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవాళ తులం ధర రూ.400 నుండి రూ.440 వరకు తగ్గింది. దీనికి తోడు వెండి ధర కూడా పడిపోయి రూ.100 దిగొచ్చింది. పసిడి, వెండి ధరలు తగ్గడం సామాన్యులకు భారీ ఊరటనిచ్చే అంశం. ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్న ధరలు దిగోస్తుండటంతో గోల్డ్ షాపింగ్ చేసే వారికి పండగే. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం బంగారం ధర మారుతుంటుంది ఇంకా డాలర్ ధర, డిమాండ్-సప్లయ్, ఆర్థిక పరిస్థితులు అలాగే పండుగ సీజన్ వంటి చాల కారణాల వల్ల ప్రతిరోజూ బంగారం ధర మారుతుంది.
బంగారం ధర తగ్గడానికి కారణం : అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తక్కువగా ఉండటమే బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం. అమెరికా ఇంకా యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య చర్చలు తీవ్రతరం కావడంతో పెట్టుబడిదారులు ఇప్పుడు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు, దీని ఫలితంగా కొనుగోళ్లు తగ్గాయి. అంతేకాక ఈ కారణంగా, బంగారం ధర ఔన్సుకు $3,350 నుండి $3,296.92కి పడిపోయింది. దీనితో పాటు డాలరుతో రూపాయి విలువలలో హెచ్చుతగ్గులు, EU పై సుంకాలను పెంచడానికి అమెరికా గడువును పొడిగించడం కూడా బంగారం కోసం దేశీయ డిమాండ్‌ను ప్రభావితం చేశాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.40 తగ్గి రూ.8,895, 24 క్యారెట్ల ధర రూ.44 పడిపోయి రూ.9,704, 18 క్యారెట్ల ధర రూ.33 దిగొచ్చి రూ.7,278. దింతో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.88,950 నిన్నటి ధర చూస్తే రూ.89,350 అంటే రూ.400 తగ్గింది. 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.97,040 నిన్నటి ధర చూస్తే రూ.97,480 అంటే రూ.440 తగ్గింది. 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.72,780 నిన్నటి ధర రూ.73,110 అంటే రూ.330 పడిపోయింది.
దేశంలోని మెట్రో నగరాల్లో చూస్తే :
ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.89,100, 24 క్యారెట్లకు రూ.97,190, 18 క్యారెట్లకు రూ.72,900.
ముంబై 22 క్యారెట్ల ధర రూ.88,950, 24 క్యారెట్లకు రూ.97,040, 18 క్యారెట్లకు రూ.72,780.
కోల్కత్త 22 క్యారెట్ల ధర రూ.88,950, 24 క్యారెట్లకు రూ.97,040, 18 క్యారెట్లకు రూ.72,780.
చెన్నై 22 క్యారెట్ల ధర రూ.88,950, 24 క్యారెట్లకు రూ.97,040, 18 క్యారెట్లకు రూ.73,250.
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే :
వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.88,950, 24 క్యారెట్లకు రూ.97,040, 18 క్యారెట్లకు రూ.72,780.
కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.88,950, 24 క్యారెట్లకు రూ.97,040, 18 క్యారెట్లకు రూ.72,780.
ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.88,950, 24 క్యారెట్లకు రూ.97,040, 18 క్యారెట్లకు రూ.72,780.
హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.88,950, 24 క్యారెట్లకు రూ.97,040, 18 క్యారెట్లకు రూ.72,780.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి ధరలు చూస్తే :
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.88,950, 24 క్యారెట్లకు రూ.97,040, 18 క్యారెట్లకు రూ.72,780.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.88,950, 24 క్యారెట్లకు రూ.97,040, 18 క్యారెట్లకు రూ.72,780.
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.88,950, 24 క్యారెట్లకు రూ.97,040, 18 క్యారెట్లకు రూ.72,780.
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.88,950, 24 క్యారెట్లకు రూ.97,040, 18 క్యారెట్లకు రూ.72,780.
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.88,950, 24 క్యారెట్లకు రూ.97,040, 18 క్యారెట్లకు రూ.72,780.
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.88,950, 24 క్యారెట్లకు రూ.97,040, 18 క్యారెట్లకు రూ.72,780.
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.88,950, 24 క్యారెట్లకు రూ.97,040, 18 క్యారెట్లకు రూ.72,780.
కడపలో 22 క్యారెట్ల ధర రూ.88,950, 24 క్యారెట్లకు రూ.97,040, 18 క్యారెట్లకు రూ.72,780.
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.88,950, 24 క్యారెట్లకు రూ.97,040, 18 క్యారెట్లకు రూ.72,780.
మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.99.90గా ఉండగా, 10 గ్రాములకి రూ.999, కేజీకి నేడు రూ.99,900 అంటే ఇవాళ వెండి ధర రూ.100 తగ్గింది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.99,900, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,10,900. గురువారం నాడు యుఎస్ బంగారం ధరలు వారం రోజుల కంటే కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ "లిబరేషన్ డే" సుంకాలు అమలులోకి రాకుండా యుఎస్ ఫెడరల్ కోర్టు నిరోధించడం, దింతో డాలర్ పుంజుకుని రిస్క్ సెంటిమెంట్ మెరుగుపడింది.
కిట్కో మెటల్స్ సీనియర్ విశ్లేషకుడు జిమ్ వైకాఫ్ మాట్లాడుతూ "ఇటీవల బంగారం మార్కెట్ అస్థిరంగా ఉంది, ప్రతిరోజు ఉండే వార్తలకు ప్రతిస్పందిస్తోంది, స్పష్టమైన ధోరణి లేదు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నిరుద్యోగంపై ఆందోళనల మధ్య కష్టమైన ట్రేడ్‌ఆఫ్‌లను కూడా హైలైట్ చేశాయి. బలమైన ముడి చమురు ధరలు, బలహీనమైన IIP డేటా కారణంగా రూపాయి ఇంట్రాడే ఒత్తిడిని ఎదుర్కొంది, అయితే ఊహించిన దానికంటే మెరుగైన కార్పొరేట్ ఆదాయాలు అలాగే పరిస్థితుల అంచనాలు దీనికి కొంత మద్దతునిచ్చాయి. ఈ వారం డాలర్‌తో పోలిస్తే రూపాయి 84.20-86.55 మధ్య మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ వారం రానున్న GDP ఇంకా PCE ద్రవ్యోల్బణ గణాంకాలు వంటి US డేటాతో డాలర్ కదలికలు, ఫెడ్ సంకేతాలు ఇంకా భౌగోళిక రాజకీయ ప్రభావంతో బంగారం ఇంకా వెండి ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 0057 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.5 శాతం తగ్గి $3,262.99 డాలర్ల వద్ద ఉండగా, ఇది మే 20 తర్వాత అత్యల్పం. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.2 శాతం తగ్గి $32.93 డాలర్లకి చేరుకుంది, ప్లాటినం $1,074.90 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది, పల్లాడియం 0.3 శాతం పెరిగి $964.75 డాలర్లకి చేరుకుంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications