Gold Price Today: తర్వలోనే తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది రాబోతోంది. దీంతో చాలా మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఆభరణాలను కొనేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే పెరుగుతున్న గోల్డ్ ధరలు వారికి వరుసగా షాక్ ఇస్తున్నాయి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటి కంటే 100 గ్రాములకు నేడు రూ.2,000 పెరుగుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన 10 గ్రాముల రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.62,150, ముంబైలో రూ.61,350, దిల్లీలో రూ.61,500, బెంగళూరులో రూ.61,350, కేరళలో రూ.61,350, వడోదరలో రూ.61,400, జైపూరులో రూ.61,500, పాట్నాలో రూ.61,400, నాశిక్ లో రూ.61,380, అయోధ్యలో రూ.61,500, గురుగ్రాములో రూ.61,500, నోయిడాలో రూ.61,500 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటి కంటే 100 గ్రాములకు ఏకంగా రూ.2,200 పెరిగింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.67,800, ముంబైలో రూ.66,930, దిల్లీలో రూ.67,080, బెంగళూరులో రూ.66,930, కేరళలో రూ.66,930, వడోదరలో రూ.66,980, జైపూరులో రూ.67,080, పాట్నాలో రూ.66,980, నాశిక్ లో రూ.66,960, అయోధ్యలో రూ.67,080, గురుగ్రాములో రూ.67,080, నోయిడాలో రూ.67,080గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.61,350గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.66,930 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.300 తగ్గి రూ.80,200 వద్ద కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications