భారతదేశం పండుగ సీజన్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు పెరుగుదల దిశలోనే కొనసాగుతున్నాయి. దీని వెనుక ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, దేశీయ మార్కెట్ పరిణామాలు, వినియోగదారుల డిమాండ్ ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) డేటా ప్రకారం.. ఆగస్టు నెలలో అంతర్జాతీయ బంగారం ధరలు 1 శాతం పైగా పెరిగి ఔన్సుకు 3,335 అమెరికన్ డాలర్లకు చేరుకున్నాయి. అమెరికా డాలర్ బలహీనపడటం, US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశాలు, కొనసాగుతున్న ద్రవ్యోల్బణ ఆందోళనలు బంగారం ధరలను పైకి లాగాయి.
ఇక భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, అమెరికా విధిస్తున్న కొత్త సుంకాలు మరియు గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్ కూడా బంగారం మీద సురక్షిత పెట్టుబడిగా డిమాండ్‌ను పెంచుతున్నాయి. ఈ కారణాల వల్లే బంగారం 2025లో ఇప్పటివరకు 28 శాతం రాబడి ఇచ్చింది. దేశీయ మార్కెట్‌లో కూడా Gold ధరలు గణనీయంగా పెరిగాయి. ఆగస్టులో ఒక్క నెలలోనే 1.6 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.లక్షా మూడు వేల మార్కుకి చేరాయి. ఇది సంవత్సర ఆరంభం నుండి ఇప్పటి వరకు 31శాతం పెరుగుదలని సూచిస్తోంది.

రూపాయి విలువ తగ్గడం కూడా Gold ధరలపై ప్రభావం చూపింది. అంతర్జాతీయ ధరలు, భారత ధరల మధ్య ఉన్న తేడా (డిస్కౌంట్) జూన్‌లో ఔన్సుకు 27 డాలర్లు ఉండగా, ఆగస్టు మధ్య నాటికి 3.7 డాలర్లకి తగ్గింది. అంటే భారత బంగారం ధరలు ఇప్పుడు ప్రపంచ ప్రమాణాలకు దగ్గరగా వచ్చాయి. పండుగ సీజన్ సమీపిస్తున్నందున ఆభరణాల డిమాండ్ పెరగనుంది. జ్యువెలరీ తయారీదారులు ఇప్పటికే తమ నిల్వలను పెంచుతున్నారు. ముఖ్యంగా తేలికైన, ఆధునిక డిజైన్లపై దృష్టి పెడుతూ వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ధోరణి కారణంగా జూలైలో బంగారం దిగుమతులు 4 బిలియన్ డాలర్ల వరకు చేరాయి.
ఇన్వెస్టర్ల వైపు నుండి కూడా బంగారం మీద ఆసక్తి పెరుగుతోంది. జూలైలో గోల్డ్ ETFల్లోకి రూ. 1,260 కోట్లనిధులు ప్రవేశించాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఆస్తులలో 96 శాతం పెరుగుదల అని సూచిస్తోంది. అంటే, ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వద్ద ప్రస్తుతం 880 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఇది దేశ విదేశీ మారక నిల్వలలో దాదాపు 12 శాతం వాటా కలిగి ఉంది. ద్రవ్యోల్బణం నుండి రక్షణ కల్పించే ఆస్తిగా బంగారం ప్రాధాన్యం కొనసాగుతోంది.
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ AMC పరిశోధన ప్రకారం.. బంగారం విలువ నిలుపుదల, ద్రవ్యోల్బణ హెడ్జ్‌గా దాని పాత్ర, ప్రమాదకర ఆస్తులతో ప్రతికూల సహసంబంధం (negative correlation) పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలో దానికి ప్రత్యేక స్థానం ఇస్తున్నాయి.కాబట్టి అమెరికా ద్రవ్య విధాన నిర్ణయాలు, భారత రూపాయి హెచ్చుతగ్గులు, గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్.. ఈ అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే, బంగారం ధరలు రాబోయే నెలల్లో కూడా బలంగా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Silver: వెండి ధర కిలో రూ.2 లక్షల కంటే కిందకు పడిపోదా? నిపుణులు ఏమంటున్నారు?

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications