బంగారం ర్యాలీతో ధనవంతులైన భారతీయ పేద కుటుంబాలు.. ఏకంగా రూ. 117 లక్షల కోట్ల పెరుగుదల..
భారతీయ కుటుంబాల ఆర్థిక చరిత్రలో 2025 ఏడాది ఒక కీలక మలుపుగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల మార్పులు వంటి అంశాల మధ్య బంగారం మరోసారి తన శక్తిని ప్రదర్శించింది. HDFC మ్యూచువల్ ఫండ్ Yearbook 2026 నివేదిక ప్రకారం.. 2025లో బంగారం ధరల భారీ ర్యాలీ కారణంగా భారత గృహాల సంపదలో సుమారు రూ. 117 లక్షల కోట్ల విలువ నిలువ ఉంది. ఇది గత 25 సంవత్సరాల్లో నమోదైన అతిపెద్ద సంపద వృద్ధిగా ఆర్థిక వర్గాలు పేర్కొంటున్నాయి.
నివేదిక ప్రకారం 2025లో బంగారం ధరలు అసాధారణంగా పెరిగాయి. డిసెంబర్ 15, 2025 నాటికి ప్రతి 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 57 వేల వరకు పెరిగింది. ఇదే సమయంలో 2024లో ఈ పెరుగుదల దాదాపు 14 వేలు మాత్రమే ఉండటం గమనార్హం. 2025లో బంగారం భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాకుండా ఒక శక్తివంతమైన సంపద సాధనంగా మారిందని ఈ తేడా స్పష్టంగా చూపిస్తోంది.

ఈ ధరల పెరుగుదలతో బంగారం కలిగి ఉన్న కుటుంబాలు తమ ఆస్తులను విక్రయించకపోయినా.. వాటి విలువ పెరగడం ద్వారా ఒక ఆర్థిక భద్రతా కవచం పొందాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, మధ్యతరగతి కుటుంబాలు బంగారం ఆధారంగా తీసుకునే రుణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. 2025లో గోల్డ్ బ్యాక్డ్ లోన్స్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఇది వైద్య ఖర్చులు, విద్య, వ్యాపార పెట్టుబడులు వంటి అవసరాలకు గృహాలకు తోడ్పడింది.
పెట్టుబడుల కోణంలో చూస్తే.. 2025లో బంగారం ఇతర ఆస్తి తరగతులతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన చూపింది. గ్లోబల్ మార్కెట్లలో ఎమర్జింగ్ మార్కెట్లు, యూరప్, టెక్ దిగ్గజాల షేర్లు (Magnificent 7) మంచి ఫలితాలు ఇచ్చినా.. క్రూడ్ ఆయిల్, అమెరికన్ డాలర్, బిట్‌కాయిన్ వంటి ఆస్తులు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో భారత ఈక్విటీ మార్కెట్లు కూడా ఒక కన్సాలిడేషన్ దశలో ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. NIFTY 50 ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే స్థిరమైన కానీ పరిమిత వృద్ధిని నమోదు చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో.. ఆర్థిక నిపుణులు బంగారం ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేస్తున్నారు. Equity, Debt, Gold ఈ మూడు ఆస్తి తరగతుల మధ్య సమతుల్యంగా పెట్టుబడులు పెట్టే డిసిప్లిన్డ్ అసెట్ అలొకేషన్ ఎంత అవసరమో 2025 స్పష్టంగా చూపించింది. ముఖ్యంగా మొదటిసారి పెట్టుబడులు పెట్టే వారికి హైబ్రిడ్ ఫండ్స్ వంటి ఎంపికలు వోలాటిలిటీని తగ్గించడంలో సహాయపడతాయని నివేదిక సూచిస్తోంది.
క్లుప్తంగా చెప్పాలంటే.. 2025లో బంగారం ధరల ర్యాలీ భారత గృహాల సంపదకు ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు పెరుగుతున్న వేళ, బంగారం మరోసారి తనను తాను నమ్మదగిన సేఫ్-హేవెన్ ఆస్తిగా నిరూపించుకుందని చెప్పవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications