ఆగస్టులో బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయా.. హార్ముజ్ జలసంధి మూసివేత, యుద్ధ ప్రభావం పసిడిపై ఎలా ఉంటుంది..

అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు జూలై 1 తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి.. అక్కడి నుండి పైకి రాలేక బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై నౌకాదళ దిగ్బంధనాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించడంతో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి.

ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఆందోళనలను మళ్లీ పెంచడమే కాకుండా, రాబోయే రోజుల్లో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను దీర్ఘకాలం పాటు అధిక స్థాయిలోనే కొనసాగించే అవకాశాలను బలపరిచింది. దీని ఫలితంగా సోమవారం నాటి ట్రేడింగ్‌లో Gold ధరలు ఏకంగా 3 శాతం మేర కుప్పకూలాయి. స్పాట్ Gold వరుసగా రెండో సెషన్‌లోనూ 3 శాతం పడిపోయి ఔన్సుకు 3,996.76 డాలర్ల వద్ద నిలవగా.. మరో విలువైన లోహం స్పాట్ సిల్వర్ (వెండి) కూడా 3.8 శాతం క్షీణించి ఔన్సుకు 57.56 డాలర్ల వద్ద స్థిరపడింది.

Gold Price Prediction Gold Price August Gold Outlook Strait of Hormuz Iran War Gold Rates Gold Forecast Safe Haven Asset Federal Reserve US Dollar Index Crude Oil Prices Gold Investment Bullion Market Gold News

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఘర్షణలు.. హార్ముజ్ జలసంధి మూసివేత భయాల వల్ల చమురు మార్కెట్లు ఒక్కసారిగా హీటెక్కడం.. బంగారం ధరల పతనానికి ప్రధాన కారణంగా మారింది. దీనివల్ల ఏర్పడే ఇంధన ఆధారిత ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అదుపు చేయడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చనే అంచనాలు మార్కెట్లో బలపడ్డాయి. సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగితే బంగారంపై పెట్టుబడుల ఆకర్షణ అనేది తగ్గుతుంది. ముందు ముందు గల్ఫ్ ప్రాంతంలో చెలరేగే వార్ బంగారంపై ఒత్తిడిని పెంచుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఒకవేళ హార్ముజ్ జలసంధి మూసివేత సుదీర్ఘంగా కొనసాగి డిమాండ్ పూర్తిగా దెబ్బతింటే.. అది ఆర్థిక కార్యకలాపాలను తగ్గించి భవిష్యత్తులో ద్రవ్యోల్బణ వ్యతిరేక ప్రభావానికి (డిఫ్లేషనరీ ఎఫెక్ట్) దారితీయవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అటువంటి మందగమన పరిస్థితులు సుదీర్ఘ కాలంలో వాస్తవానికి బంగారానికి అనుకూలంగా మారే అవకాశం కూడా ఉందని బులియన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read

ప్రస్తుతం పెట్టుబడిదారుల దృష్టి అంతా ఈ వారం విడుదల కానున్న జూన్ నెల యూఎస్ వినియోగదారుల ధరల సూచీ (CPI), ఉత్పత్తిదారుల ధరల సూచీ (PPI), రిటైల్ అమ్మకాల గణాంకాల మీద ఉంది. వీటితో పాటు ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్ కాంగ్రెస్ ముందు ఇచ్చే మొదటి అర్ధవార్షిక సాక్ష్యం మార్కెట్ భవిష్యత్తు గమనాన్ని నిర్ణయించనుంది. అలాగే ఫెడ్ వైస్ చైర్ మిషెల్ బోమన్, గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ వ్యక్తపరిచే అభిప్రాయాలు వడ్డీ రేట్ల పెంపుపై కేంద్ర బ్యాంకు వైఖరిని స్పష్టం చేయనున్నాయి.

ప్రస్తుతం సెప్టెంబర్ నెలలో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపునకు 72 శాతం అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు, ఇది గత వారం కేవలం 63 శాతంగానే ఉండేది. మార్కెట్లో మారుతున్న ఈ అంచనాల వల్లే జూలై 7తో ముగిసిన వారంలో కామెక్స్ (COMEX) గోల్డ్ స్పెక్యులేటర్లు తమ నికర లాంగ్ పొజిషన్‌లను 1,964 కాంట్రాక్టులు తగ్గించుకుని 114,854కు పరిమితం చేసుకున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+