బంగారం ధరలు గత కొద్దిరోజులుగా పరిశీలిస్తే డౌన్ ట్రెండ్ కొనసాగిస్తుంటే, పసిడి ప్రియులకు గత కొన్ని రోజులుగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఏప్రిల్ 22న MCXలో నమోదైన 10 గ్రాముల బంగారం ధర ఆల్‌టైమ్ హై రూ.99,358 నుండి ధరలు ఏకంగా 7% కుప్పకూలాయి. దింతో గత డిసెంబర్ తర్వాత 50 రోజుల సగటు కంటే కింద పడిపోయే అవకాశం ఉంది. మరి ఈ పసిడి ధరల పతనం ఎక్కడి వరకు ఉంటుంది ? ఒకవేళ తులం రూ.88 వేలకి పడిపోతే బంగారంపై పెట్టుబడి పెట్టిన వాళ్లు ఏం చేయాలి ?

యాక్సిస్ సెక్యూరిటీస్ విశ్లేషణ ప్రకారం బంగారం ప్రస్తుతం 50-రోజుల సగటు ఎన్వలప్ డౌన్ రేంజ్ పరీక్షిస్తోంది. ఈ స్థాయి గత నవంబర్ నుండి తగ్గుదలలకు మద్దతుగా నిలిచింది. మే 16 నుండి మే 20 వరకు ధరల కదలికలు కీలకమని, అంతర్జాతీయంగా $3,136 కీలక మద్దతు స్థాయిగా ఉందని, ఒకవేళ ఈ స్థాయిని బ్రేక్ చేస్తే ధరలు $2,875-$2,950 (భారతీయ రూపాయిలలో సుమారు రూ.88,000 - రూ.90,000) దిగజారవచ్చని ET రిపోర్ట్ తెలిపింది.
మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలపై అంచనాలు తగ్గడం, అలాగే వాణిజ్య యుద్ధ ఆందోళనలు తగ్గుముఖం పట్టడం వంటి అంతర్జాతీయ ఆర్థిక మార్పులే బంగారం ధరల ఒత్తిడికి ప్రధాన కారణాలు. సురక్షితమైన పెట్టుబడిగా బంగారానికి ఉండే డిమాండ్‌ను ఇవి ప్రభావితం చేస్తున్నాయి.
మరి తులం రూ.88 వేలకి చేరుతుందా: ఆగ్మాంట్ రీసర్చ్ హెడ్ రెనిషా చైనాని కూడా బంగారం ధరలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని అంగీకరించారు. "బంగారం ధరలు $3200 డబుల్-టాప్ నెక్‌లైన్ సపోర్ట్ బ్రేక్ చేసినందున స్వల్పకాలంలో $3000-$3050 (సుమారు రూ.87,000 - రూ.88,000) వరకు మరింత తగ్గుదల అంచనా వేయబడింది" అని ఆమె స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుత ట్రెండ్‌లు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ధరల తగ్గుదల లాంగ్ టర్మ్ పెట్టుబడిదారులకు అవకాశాలు ఉండవచ్చని ఆమె సూచిస్తున్నారు.
రెడ్డిసిద్ధి బులియన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ కొఠారి మాత్రం బంగారం బలాలు చెక్కుచెదరలేదని, సానుకూల దృక్పథంతో ఉందని పేర్కొన్నారు. అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు వేగంగా కోలుకోవడం ప్రారంభిస్తే రిస్క్-ఆఫ్ ట్రేడ్‌ల అవసరం తగ్గుతుందని, అప్పుడు బంగారం $3000-$3050 స్థాయికి పడిపోవచ్చని ఆయన హెచ్చరించారు. కాబట్టి, ప్రస్తుతానికి బంగారం ధరలు మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నా, దీర్ఘకాలికంగా చూసే వారికి ఇదొక పెట్టుబడికి ఒక మంచి అవకాశం అని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications