బంగారం, వెండి ధరలు రోజురోజు భారీగా పెరిగిపోతున్నాయి. ఈరోజు కూడా అంటే ఏప్రిల్ 1న తులం ధర సుమారు రూ.900 పైగానే పెరిగింది. దీనికి తోడు వెండి ధరలు కూడా లక్ష దాటి పరుగులు పెడుతూ సరికొత్త రికార్డ్ స్థాయికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితిలో రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు ఏ స్థాయికి చేరుకుంటుందనే ప్రశ్న తలెత్తుతోంది ? మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధానాల వల్ల ఏర్పడిన ప్రపంచ గందరగోళం కారణంగా బంగారంపై పెట్టుబడి పెరిగింది.

నేటి ధరలు చూస్తే :గత కొంత కాలంగా బంగారం ధర ఆల్ టైం హైకి చేరింది. నేడు ఏప్రిల్ 1న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.930 పెరిగి రూ.92,840కి చేరుకోగా, వెండి ధర కూడా రూ.1000 పెరిగి మన రాష్ట్రంలో 1 కిలోకి రూ.1,15,000కి ఎగిసింది. పెరుగుతున్న వినియోగం కారణంగా, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ధరల పెరిగే సంకేతాలు: ఏప్రిల్ 2 నుండి అమెరికా అధ్యక్షుడు విధించిన పరస్పర సుంకాల అమలు కారణంగా బంగారం ధరలు పెరగవచ్చని అమెరికన్ మార్కెట్ నిపుణుడు జేమ్స్ హైజిర్క్ అంటున్నారు. ఈ సుంకాలు మార్కెట్లో అనిశ్చితిని సృష్టిస్తాయని ఇంకా ఇలాంటి పరిస్థితిలో బంగారంలో పెట్టుబడి మరింతగా పెరుగుతుందని ఆయన అంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి బంగారంపై పెట్టుబడి వేగంగా పెరగడం గమనార్హం. దీనికి కారణం స్టాక్ మార్కెట్ వంటి ఇతర మార్కెట్లలో మందగమనం. ఈ కాలంలో క్రిప్టో మార్కెట్ కూడా ఆశించిన రాబడిని ఇవ్వలేకపోయింది.
ఇప్పుడు అవకాశాలు ఏంటి : బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇటీవల గ్లోబల్ ఫండ్ మేనేజర్లలో ఒక సర్వే నిర్వహించింది, ఇందులో వాణిజ్య యుద్ధం పెద్ద ఎత్తున మొదలైతే బంగారం బెస్ట్ పర్ఫార్మెన్స్ గల ఆస్తిగా మారుతుందని చెప్పారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై సుంకాల ప్రభావం బంగారం బలాన్ని పెంచిందని ప్రపంచ గోల్డ్ మండలి వ్యూహకర్త లూయిస్ స్ట్రీట్ అన్నారు. అంతేకాదు పరస్పర సుంకాల తర్వాత వాణిజ్య యుద్ధం ప్రారంభమైతే, బంగారం ధరల్లో రాకెట్ వేగంతో పెరుగుదల కనిపిస్తుందన్నారు.
ఎప్పుడు లక్ష దాటుతుంది : ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, అమెరికా సుంకాల విధానాల కారణంగా 2025 ఏడాది మధ్యలో బంగారం ధర 10 గ్రాములకు రూ.96,000కి చేరుకోవచ్చని ఐసిఐసిఐ బ్యాంక్ గ్లోబల్ మార్కెట్స్ ఇటీవల విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఈ విధంగా చూస్తే, బంగారం ధర లక్ష రూపాయలను కూడా ఈ ఏడాదిలో తాకవచ్చు. పెరుగుతున్న ధరలు ఆభరణాల డిమాండ్‌ను ప్రభావితం చేశాయని కూడా నివేదిక పేర్కొంది. ఈ కారణంగా బంగారం దిగుమతులు గత 11 నెలల్లో కనిష్ట స్థాయి $2.3 బిలియన్లకు చేరుకున్నాయి, అంటే ప్రతినెల ప్రాతిపదికన 14 శాతం, ఏడాది ప్రాతిపదికన 63 శాతం తగ్గుదలని చూపిస్తుంది.
ధరలు ఎలా ప్రభావితం ఆవుతాయి: మన దేశంలో బంగారం ధరలు డిమాండ్ అండ్ సప్లయ్ ద్వారా మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో జరిగే కార్యకలాపాల ద్వారా కూడా ప్రభావితమవుతాయి. లండన్ OTC స్పాట్ మార్కెట్, COMEX గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్‌తో సహా ప్రపంచ మార్కెట్లలోని ట్రేడింగ్ కార్యకలాపాలు కూడా బంగారం ధరలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.
ధరలను ఎవరు నిర్ణయిస్తారు: ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరను లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) నిర్ణయిస్తుంది. ఇక్కడ బంగారం ధరలను US డాలర్లలో ప్రచురిస్తుంది, ఇది బ్యాంకర్లు ఇంకా బులియన్ వ్యాపారులకు ప్రపంచ ప్రమాణంగా పనిచేస్తుంది. ఇక మన దేశంలో, ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) అంతర్జాతీయ బంగారం ధరలకు దిగుమతి సుంకం ఇతర పన్నులను కలిపి రిటైలర్లకు బంగారం ఇచ్చే రేటును నిర్ణయిస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Gold Prices: గోల్డ్ మార్కెట్లో అతిపెద్ద క్రాష్! ఇప్పుడు కొనాలా? అమ్మాలా? నిపుణుల సలహా ఇదే..!

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications