బంగారం ధరలు ఎందుకు కుప్పకూలుతున్నాయి.. ఆగస్టులో పెరుగుతాయా? నిపుణుల విశ్లేషణ ఇదిగో..

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ప్రస్తుతం తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గత ఆరు వారాల్లోనే అత్యంత భారీగా వీక్లీ నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఈ వారంలో ఇప్పటివరకు బంగారం ధరలు 3 శాతానికి పైగా క్షీణించాయి. ప్రస్తుత సెషన్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 3,970.35 డాలర్ల వద్ద నిలకడగా ఉన్నప్పటికీ.. ఇది జూలై 1 తర్వాత నమోదైన అత్యల్ప స్థాయికి చాలా సమీపంలో ఉండటం మార్కెట్ బలహీనతను సూచిస్తోంది. అలాగే ఆగస్టు డెలివరీ కోసం యూఎస్ Gold ఫ్యూచర్స్ సైతం 0.5 శాతం తగ్గి ఔన్సుకు 3,973.10 డాలర్లకి చేరాయి. ఈ ధరల పతనానికి ప్రధానంగా అమెరికా- ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అని చెప్పవచ్చు. వాటి వల్ల గ్లోబల్ మార్కెట్లో ఏర్పడుతున్న ద్రవ్యోల్బణ భయాలు ముఖ్య కారణాలుగా నిలుస్తున్నాయి.

అమెరికా మద్దతుతో ఇరాన్‌పై యుద్ధ వాతావరణం నెలకొన్న ఫిబ్రవరి చివరి నుండి ఇప్పటివరకు Gold ధరలు సుమారు 25 శాతం మేర పడిపోవడం గమనార్హం. ఇటీవల అమెరికా ఇరాన్‌లోని కీలక వంతెనలు, ఒక విమానాశ్రయంపై బాంబు దాడులను తీవ్రతరం చేయడం, దానికి ప్రతిస్పందనగా టెహ్రాన్ మధ్యప్రాచ్యం అంతటా ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరపడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్క వారంలోనే 14 శాతానికి పైగా పెరిగాయి.

Gold Price Prediction Gold Price Crash Gold Weekly Loss Gold Rate Today August Gold Outlook Gold Forecast US Dollar Treasury Yields Federal Reserve Bullion Market Gold News Business News

ఈ ఇంధన ధరల పెరుగుదల అంతిమంగా ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుందనే భయాలను రేకెత్తించింది. సాధారణంగా బంగారాన్ని ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఒక రక్షణ ఆస్తిగా (హెడ్జింగ్) భావించినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు గరిష్ట స్థాయిలోనే ఉంచుతుందనే అంచనాలు మార్కెట్లో బలంగా వినిపిస్తున్నాయి.

Also Read

బంగారం అనేది ఎలాంటి స్థిరమైన వడ్డీని లేదా ప్రత్యక్ష రాబడిని ఇవ్వని పెట్టుబడి సాధనం కావడంతో.. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు కాకుండా సురక్షితమైన, స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ప్రభుత్వ బాండ్ల వైపు ఆకర్షితులవుతారు. ఫెడ్ వైస్ ఛైర్ ఫిలిప్ జెఫర్సన్ కూడా ద్రవ్యోల్బణంలో ఆశించిన మార్పు రాకపోతే వడ్డీ రేట్లను మరింత పెంచడానికి సిద్ధంగా ఉన్నామని సూచించారు. దీనివల్ల రాబోయే సెప్టెంబర్ ద్రవ్యోల్బణ విధాన సమీక్షలో ఫెడ్ రేట్ల పెంపునకు 53.3 శాతం అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. ఈ భయాల కారణంగా మార్కెట్లో షార్ట్ సెల్లర్లు ధరలు తగ్గుతున్న తరుణంలో లాభాల స్వీకరణకు పాల్పడుతున్నారు. ఇది బంగారంపై ఒత్తిడిని మరింత పెంచుతోంది.

దీనికి తోడు, అంతర్జాతీయ మార్కెట్లో యూఎస్ డాలర్ వరుసగా రెండవ సెషన్‌లోనూ బలోపేతం కావడం విదేశీ పెట్టుబడిదారులకు, కొనుగోలుదారులకు బులియన్‌ను మరింత ఖరీదైనదిగా మార్చింది. ప్రస్తుతం ప్రైవేట్ పోర్ట్‌ఫోలియోలలో బంగారం వాటా తక్కువగా ఉన్నప్పటికీ.. ఇరాన్ పరిణామాల నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకులు, ప్రైవేట్ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వైవిధ్యీకరణ (డైవర్సిఫికేషన్) చేసుకునే ప్రక్రియ వేగవంతం కావచ్చని గోల్డ్‌మన్ సాచ్స్ విశ్లేషించింది. కేవలం బంగారం మాత్రమే కాకుండా మార్కెట్ ఒత్తిడి కారణంగా ఇతర విలువైన లోహాలైన స్పాట్ వెండి 0.8 శాతం తగ్గి 55.05 డాలర్లకు చేరింది. అలాగే ప్లాటినం 3.3 శాతం పడిపోయి 1,563.49 డాలర్లకు చేరగా.. పల్లాడియం 1.5 శాతం క్షీణించి 1,230.42 డాలర్లకు పడిపోయి వారపు నష్టాలను చవిచూశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+