ఈ ఏడాది పసిడి ధరలు నింగిని తాకాయి. సామాన్యులు బంగారం కొనుగోలు చేయాలంటేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది. 2025లో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అస్థిర పరిస్థితులు బంగారం ధరలను అమాంతం పెంచాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఏడాదంతా పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్ గా బంగారాన్ని ఎంచుకున్నారు. డాలర్ సంక్షోభంతో వారు పెట్టుబడులను బంగారం వైపు మళ్లించారు. దీంతో Gold ధరలు పై పైకి ఎగబాకాయి.
ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు మరింత ఎగబాకే అవకాశముందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌కు చెందిన కమోడిటీ రీసెర్చ్ సీనియర్ విశ్లేషకుడు మానవ్ మోడీ అభిప్రాయపడ్డారు. పరిస్థితులు అనుకూలంగా లేకుంటే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రూ.1,38,000 నుంచి రూ.1,40,000 స్థాయిల వరకు చేరవచ్చని ఆయన తెలిపారు. సమీప కాలంలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా హెచ్చరించారు.

గత వారం చివర్లో భారీ లాభాల అనంతరం బంగారం, వెండి ధరలు కొంతకాలం స్థిరంగా ఉన్నప్పటికీ ఇటీవల మళ్లీ పుంజుకున్నాయి. దేశీయంగా వెండి ధరలు తొలిసారిగా రూ.2 లక్షల మార్కును దాటి ఆల్‌టైమ్ హైను నమోదు చేయగా.. అంతర్జాతీయ మార్కెట్ అయిన కామెక్స్‌లో బంగారం ధరలు సుమారు 4,400 డాలర్ల వద్ద రికార్డు గరిష్టాలను తాకాయి. 2025 ప్రారంభం నుంచి ఇప్పటివరకు వెండి ధరలు 120 శాతం కంటే ఎక్కువగా, బంగారం ధరలు సుమారు 65 శాతం వరకు పెరగడం విశేషం. దీంతో ఈ రెండూ ఈ ఏడాదిలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఆస్తులుగా నిలిచాయి.
అమెరికా ట్రెజరీ బాండ్ దిగుబడులు తగ్గడం.. డాలర్ సూచిక బలహీనపడడం వల్ల అంతర్జాతీయంగా బంగారానికి మద్దతు లభిస్తోంది. దేశీయంగా డాలర్-రూపాయి మారకం విలువ (USD-INR)లో కనిపిస్తున్న అస్థిరత కూడా బంగారం ధరలకు అనుకూలంగా మారుతోంది. గత వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం నేపథ్యంలో USD-INR దాదాపు రూ.2 మేర తగ్గడం గమనార్హం.
డిసెంబర్‌లో జరిగిన ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు తగ్గింపు జరిగినప్పటికీ.. ఓటింగ్ విభజన కావడంతో భవిష్యత్ విధానంపై అనిశ్చితి పెరిగింది. ఫెడ్ అధికారుల నుంచి వచ్చిన మిశ్రమ వ్యాఖ్యలు మార్కెట్లలో గందరగోళాన్ని పెంచాయి. తాజా అమెరికా ఆర్థిక డేటా కూడా బలహీన సంకేతాలనే ఇస్తోంది. నిరుద్యోగ రేటు పెరగడం, అక్టోబర్-నవంబర్ నెలలలో పేరోల్ జోడింపులు అంచనాల కంటే తక్కువగా ఉండటం, మిశ్రమ రిటైల్ అమ్మకాల డేటా వంటి అంశాలు డాలర్‌పై ఒత్తిడిని కొనసాగిస్తున్నాయి.
వెండి మార్కెట్లో సరఫరా, బలమైన ఊహాజనిత ఆసక్తి ధరలను పైకి నడిపిస్తున్నాయి. అయితే, వివాహాల సీజన్ ఉన్నప్పటికీ రికార్డు ధరల కారణంగా భారతదేశంలో బంగారం భౌతిక డిమాండ్ కొంత మేర తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చూస్తే..భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విధాన అనిశ్చితి కారణంగా సేఫ్-హేవెన్ డిమాండ్ మాత్రం ఇంకా బలంగా కొనసాగుతోంది. ముందు రోజుల్లో అమెరికా హౌసింగ్ డేటా, జీడీపీ గణాంకాలు, పీసీఈ ద్రవ్యోల్బణ సూచిక, వినియోగదారుల విశ్వాసం, మన్నికైన వస్తువుల ఆర్డర్ల వంటి కీలక డేటాపై మార్కెట్లు దృష్టి సారించనున్నాయి. క్రిస్మస్ సెలవుల కాలంలో ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గే అవకాశం ఉండటంతో, ధరల అస్థిరత కొంత మేర తగ్గవచ్చని అంచనా.
బంగారం పెట్టుబడుల విషయంలో మానవ్ మోడీ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం బంగారం ధరలు తగ్గినప్పుడు కొనడం మంచిదని చెప్పారు. ప్రస్తుతం రూ.1,32,000 స్థాయి బంగారం ధరలకు కీలక మద్దతుగా పనిచేస్తోంది. ఈ స్థాయి నిలబడితే, రానున్న రోజుల్లో ధరలు మళ్లీ బలపడుతూ రూ.1,38,000 నుంచి రూ.1,40,000 వరకు చేరే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. అయితే, ఏదైనా కారణంగా బంగారం ధరలు రూ.1,32,000 కంటే దిగువకు వెళ్లితే, అప్పటికి మరింత సవరణ వచ్చి ధరలు రూ.1,30,000 వరకు పడిపోవచ్చని హెచ్చరిస్తున్నారు. అందుకే పెట్టుబడిదారులు తొందరపడకుండా, ధరల కదలికలను గమనిస్తూ, సరైన సమయంలోనే పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

Gold silver: బంగారం, వెండి ధరల్లో మళ్ళీ కదలిక.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితి ఎలా ఉందంటే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఢమాల్..ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే పండగ చేసుకుంటారు .. మార్చి 4,బుధవారం ధరలు ఇవే..

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..



Click it and Unblock the Notifications