బంగారం ధరల పెరుగుదల మళ్లీ మొదలైంది..ఈ రేటు దాకా ర్యాలీ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న నిపుణులు
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, అమెరికా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు ఈ వారం తీవ్ర అస్థిరతకు లోనయ్యే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ముదిరిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను వణికిస్తున్నాయి. గత వారం అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ అధినేతపై దాడి చేయండి.. దానికి ప్రతికారంగా ఇరాన్ పొరుగు దేశాలైన యూఏఈ, దుబాయ్, రియాద్‌లతో పాటు హార్ముజ్ జలసంధిలోని ట్యాంకర్లపై దాడులు చేయడం వల్ల అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షిత ఆశ్రయంగా భావించే బంగారం వైపు మొగ్గు చూపడంతో ధరలు మూడు వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
అమెరికా అంతర్గత రాజకీయాలు కూడా Gold ధరల పెరుగుదలకు ఆజ్యం పోశాయి. డోనాల్డ్ ట్రంప్ విధించిన విస్తృత స్థాయి సుంకాలను యూఎస్ సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ, వైట్ హౌస్ తక్షణమే 10 శాతం ప్రపంచ సుంకాన్ని అమలులోకి తీసుకురావడం వాణిజ్య రంగంలో కలకలం సృష్టించింది. దీనిని భవిష్యత్తులో 15 శాతానికి పెంచే అవకాశాలు ఉండటంతో మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు కామెక్స్‌లో వెండి నిల్వలు గణనీయంగా తగ్గడం సరఫరా కొరతను స్పష్టం చేస్తోంది. డాలర్ స్వల్పంగా బలహీనపడటం బులియన్ మార్కెట్‌కు కలిసొచ్చినప్పటికీ, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను దీర్ఘకాలం పాటు అధికంగానే ఉంచుతుందన్న సంకేతాలు బంగారం లాభాలను కొంతమేర కట్టడి చేస్తున్నాయి.

సాంకేతిక విశ్లేషణ ప్రకారం.. ఎంసీఎక్స్ (MCX) గోల్డ్ మార్కెట్ ప్రస్తుతం బలమైన బుల్లిష్ ధోరణిలో ఉంది. ఫిబొనాచీ ఎక్స్‌టెన్షన్ జోన్ ప్రకారం రూ. 1,71,800 స్థాయిని దాటిన తర్వాత, Gold ధరలు ఇప్పుడు రూ. 1,75,000 నుండి రూ. 1,78,000 దిశగా దూసుకుపోయే అవకాశం కనిపిస్తోంది. మార్కెట్‌లో ప్రస్తుతం రూ. 1,70,000 నుండి రూ. 1,72,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుండగా, కింది స్థాయిలో 1,61,800 వద్ద బలమైన మద్దతు లభిస్తోంది. ఒకవేళ ధరలు రూ. 1,62,000 స్థాయికి తగ్గితే, అది కొత్త కొనుగోలుదారులకు మంచి అవకాశంగా మారవచ్చు.
రాబోయే రోజుల్లో అమెరికా తయారీ రంగ పీఎంఐ (PMI), ఉద్యోగాల గణాంకాలు బంగారం ధరల దిశను నిర్ణయించనున్నాయి. వీటితో పాటు మధ్యప్రాచ్య ఉద్రిక్తతలకు సంబంధించి అమెరికా లేదా ఇరాన్ నుండి వచ్చే ఏ చిన్న వార్త అయినా మార్కెట్‌లో పెను మార్పులకు కారణం కావచ్చు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో, పెట్టుబడిదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
