ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు దోబూచులాడుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు పసిడి ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో నెలకొన్న పరిస్థితులు బంగారం ధరలను తీవ్ర హెచ్చుతగ్గులకు గురి చేస్తున్నాయి.
ట్రంప్ విధించి సుంకాలపై అమెరికా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అధ్యక్షుడు ట్రంప్ పునరాలోచనలో పడ్డాడు. ఆ తీర్పుపై విమర్శలు ఎక్కుపెట్టిన అగ్రరాజ్యం నేత మళ్లీ 10 శాతం సుంకాల దాడిని ప్రారంభించాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులు బంగారం, వెండి పెరుగుదలకు ప్రధాన కారణం అవుతున్నాయి.
ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు ప్రస్తుతం అంతర్లీనంగా బుల్లిష్ దిశను సూచిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. Motilal Oswal Financial Services Limited లోని కమోడిటీ రీసెర్చ్ సీనియర్ అనలిస్టు మానవ్ మోడీ ప్రకారం.. సమీప కాలంలో బంగారం ధరలను ప్రభావితం చేసే అంశాలు, కీలక సాంకేతిక స్థాయిలు పెట్టుబడిదారులు గమనించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

గత వారం బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో కీలకమైన 5వేల డాలర్ల స్థాయిని దాటడం గమనార్హం. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా నమోదవడం ఈ ర్యాలీకి ప్రధాన కారణంగా నిలిచింది. దాంతో ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలపై అంచనాలు మరింత బలపడ్డాయి. ట్రెజరీ యీల్డ్స్ తగ్గడంతో Gold వంటి వడ్డీ లేని ఆస్తులపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది.
అమెరికా హెడ్‌లైన్ CPI అంచనాల కంటే తక్కువగా ఉండడం మార్కెట్లకు ఊరటనిచ్చింది. దీనికి తోడు ఫెడ్ పాలసీపై ప్రభావం చూపే వ్యాఖ్యలు రేటు కోతల అంచనాలను బలోపేతం చేశాయి. నిజమైన యీల్డ్స్ నియంత్రణలో ఉండటం బులియన్ డిమాండ్‌కు మద్దతు ఇచ్చింది. అయితే ఇటీవల విడుదలైన FOMC సమావేశ నిమిషాల్లో కొంత మిశ్రమ స్వరం కనిపించడంతో, ఈ ఏడాది వడ్డీ రేటు తగ్గింపుల వేగంపై కొంత అనిశ్చితి నెలకొంది.
ఇదిలా ఉండగా.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా Gold ధరలకు మద్దతుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు, ఇరాన్‌తో కొనసాగుతున్న చర్చలు పెట్టుబడిదారులను సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బంగారం సంప్రదాయంగా సేఫ్ హేవెన్ ఆస్తిగా నిలుస్తోంది.
భౌతిక డిమాండ్ పరంగా చూస్తే.. ఈ ఏడాది ఇప్పటివరకు COMEX వాల్ట్‌ల నుంచి 50 మిలియన్ ఔన్సులకు పైగా వెండి బయటకు వెళ్లడం గమనార్హం. ఇది పరిశ్రమలతో పాటు పెట్టుబడి రంగంలో వెండి డిమాండ్ బలంగా ఉందని సూచిస్తోంది. అదే సమయంలో చైనా, అమెరికాలో సెలవుల కారణంగా మార్కెట్లలో ద్రవ్యత తగ్గడంతో ట్రేడింగ్ పరిధులు కొంత కట్టుదిట్టంగా మారాయి. ఈ వారం మార్కెట్ దృష్టి ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు, చైనా మార్కెట్ తిరిగి ప్రారంభం, US ఫ్యాక్టరీ ఆర్డర్లు, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (PPI) మరియు వినియోగదారుల విశ్వాస డేటాపై ఉండనుంది.
సాంకేతికంగా చూస్తే రోజువారీ చార్టులో గోల్డ్ మినీ ఫ్యూచర్స్ ఇటీవల జరిగిన పదునైన ర్యాలీ తర్వాత ఏకీకరణ దశలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోంది. సుమారు రూ. 158,000 స్థాయి చుట్టూ స్వల్పకాలిక సమ్మెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఏర్పడుతోంది. ఇది తదుపరి దిశాత్మక కదలికకు ముందు మార్కెట్ విరామం తీసుకుంటున్నట్లు సూచిస్తుంది.
బోలింజర్ బ్యాండ్లు మధ్య బ్యాండ్ అయిన రూ. 153,000 పైన ధర నిలబడటం బంగారంలో అంతర్లీన బలమైన బుల్లిష్ ధోరణిని సూచిస్తోంది. అయితే బ్యాండ్లు క్రమంగా కుదించుకుంటుండటం రాబోయే రోజుల్లో అస్థిరత పెరిగే అవకాశం ఉందని.. బ్రేక్అవుట్‌కు దారి తీసే సూచనగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పుడు చూసుకున్నట్లయితే తక్షణ నిరోధక స్థాయి రూ. 158,000 వద్ద ఉంది ఈ స్థాయిలో కాస్త కొనుగోలుకు అవకాశం ఉంటుంది. దాని తర్వాత కీలక నిరోధకత రూ. 165,000 వద్ద ఉంది. ఇక్కడ కొనుగోలు ఆపేయాల్సి ఉంటుంది. ప్రతికూలంగా రూ. 152,000 కీలక మద్దతు స్థాయిగా.. ఆ తర్వాత రూ. 145,000 కొనుగోలు స్థాయిగా ఉంది. దిగువ బ్యాండ్ సమీపంలోని రూ. 1, 40,000 బలమైన కుషన్‌లుగా పనిచేయవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే రూ. 1,58,000 పైన స్థిరమైన ముగింపు బంగారం ధరల్లో కొత్త ఎత్తులకు దారి తీసే అవకాశాన్ని తెరవగా.. రూ. 1,52,000 కంటే దిగువకు జారితే స్వల్పకాలిక దిద్దుబాటు ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం



Click it and Unblock the Notifications