బంగారం మార్కెట్‌లో కీలక మలుపు.. గోల్డ్ రేట్లు మరింత తగ్గే అవకాశం.. ఇన్వెస్టర్లకు నిపుణులు కీలక సూచనలు..
భౌగోళిక రాజకీయ పరిణామాలు ,అంతర్జాతీయ మార్కెట్ల ఒత్తిళ్ల నేపథ్యంలో బంగారం ధరలు తీవ్ర అస్థిరతకు లోనవుతున్నాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కమోడిటీ రీసెర్చ్ సీనియర్ అనలిస్ట్ మానవ్ మోడీ విశ్లేషించారు. దేశీయంగా రూ. 1,56,000 నుండి రూ. 1,58,000 మధ్య ఉన్న కీలక నిరోధక స్థాయిల (Resistance levels) కంటే పైన నిలదొక్కుకోవడంలో బంగారం విఫలమైంది. ఈ వైఫల్యం తర్వాత మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగి, ధరలు తమ దిద్దుబాటు దశను (Correction phase) కొనసాగిస్తూ వారం పొడవునా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి.
సాంకేతిక చార్టుల ఆధారంగా విశ్లేషిస్తే.. రోజువారీ టైమ్‌ఫ్రేమ్‌లో బంగారం ధరలు రూ. 1,60,700 దిగువన ఉన్న బోలింగర్ బ్యాండ్ మిడ్‌లైన్‌కు (Bollinger Band Mid-line) పడిపోయాయి. ఇది మార్కెట్ తన స్వల్పకాలిక ఊపును (Momentum) పూర్తిగా కోల్పోవడాన్ని ,బలహీనమైన బేరిష్ నిర్మాణం వైపు మళ్లడాన్ని స్పష్టంగా సూచిస్తోంది. ఇటీవలి కాలంలో ధరలు రూ. 1,54,700 వద్ద ఉన్న దిగువ బోలింగర్ బ్యాండ్ వైపు పడిపోవడం గమనిస్తే, అధిక ధరల వద్ద విక్రయదారులు (Sellers) పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని, కొనుగోలుదారులు (Buyers) మాత్రం భారీగా నష్టపోకుండా ఉండేందుకు రక్షణాత్మక ధోరణిని అవలంబిస్తున్నారని అర్థమవుతోంది.

ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో బంగారం రూ. 1,53,500 ,రూ. 1,54,500 మధ్య ఉన్న ఒక అత్యంత ముఖ్యమైన మద్దతు క్లస్టర్‌ను (Support cluster) సమీపిస్తోంది. ఒకవేళ రాబోయే రోజుల్లో మార్కెట్ ఈ మద్దతు స్థాయిల కంటే దిగువకు పడిపోయి నిలకడగా ముగిస్తే, బంగారం పతనం మరింత వేగవంతం కావచ్చు. అదే జరిగితే ధరలు మొదట రూ. 1,51,000 స్థాయికి, ఆ తర్వాత రూ. 1,48,000 మార్కు వైపునకు కూడా పడిపోయే ప్రమాదం ఉంది. కొంతకాలం పాటు ఒకే పరిధిలో కదలాడిన బోలింజర్ బ్యాండ్‌లు ఇప్పుడు మళ్లీ విస్తరించడం (Expanding) ప్రారంభించాయి. ఇది రాబోయే రోజుల్లో మార్కెట్లో అస్థిరత (Volatility) మరింత పెరగడమే కాకుండా, బంగారం ఒక బలమైన దిశాత్మక కదలికను (Directional move) తీసుకోబోతోందనే సంకేతాలను ఇస్తోంది.
మరోవైపు, ఒకవేళ ధరలు తిరిగి పుంజుకుంటే రూ. 1,54,700 వద్ద తక్షణ నిరోధం ఎదురుకానుంది. దానిని అధిగమిస్తే రూ. 1,60,700 సమీపంలో బోలింజర్ మిడ్-బ్యాండ్ తదుపరి అడ్డంకిగా మారనుంది. మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మళ్లీ సానుకూలంగా మారాలన్నా Gold ధరలు రూ. 1,63,500 నుండి రూ. 1,66,500 వైపునకు దూసుకెళ్లేలా బుల్లిష్ ఊపును తిరిగి సంపాదించాలన్నా, మార్కెట్ ఖచ్చితంగా ఈ మిడ్-బ్యాండ్ పైన ముగియాల్సి ఉంటుంది.
అయితే, క్యాండిల్‌స్టిక్ చార్ట్ నిర్మాణాన్ని పరిశీలిస్తే, బంగారం తన తాజా గరిష్ఠ స్థాయిని తాకినప్పటి నుండి వరుసగా తక్కువ గరిష్ఠాలను (Lower Highs) నమోదు చేస్తోంది. ఇది మార్కెట్లో నిరంతరాయంగా కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడిని ప్రతిబింబిస్తోంది. మొత్తంమీద Gold ధరలు బోలింగర్ మిడిల్ బ్యాండ్‌కు దిగువన కొనసాగుతున్నందున స్వల్పకాలికంగా మార్కెట్ ట్రెండ్ జాగ్రత్తగా ఉండాల్సిన బేరిష్ ధోరణిలోనే ఉంది. కాబట్టి రాబోయే వారంలో రూ. 1,54,000 సమీపంలోని మద్దతు నిలబడుతుందా లేదా అనే అంశాన్ని అంతర్జాతీయ మార్కెట్ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి.
బంగారం ధరలను ప్రభావితం చేస్తున్న అంతర్జాతీయ పరిణామాలను చూస్తే, అమెరికాలో ఊహించిన దానికంటే మెరుగ్గా వచ్చిన ఉపాధి గణాంకాలు ఫెడరల్ రిజర్వ్ తన కఠినమైన ద్రవ్య విధానాలనే (వడ్డీ రేట్ల పెంపు లేదా స్థిరత్వం) కొనసాగిస్తుందనే అంచనాలను బలపరిచాయి. మే నెలలో అమెరికా కొత్తగా 1,72,000 ఉద్యోగాలను సృష్టించగా, నిరుద్యోగిత రేటు 4.3 శాతంగా స్థిరంగా నమోదైంది. భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందనే అంచనాల వల్ల అంతర్జాతీయంగా అమెరికా డాలర్ ఇండెక్స్ ,యూఎస్ ట్రెజరీ బాండ్ల రాబడులు (Yields) భారీగా పెరిగి, వడ్డీ లేని ఆస్తి అయిన బంగారంపై ఒత్తిడిని పెంచాయి.
దీనికి తోడు ఇజ్రాయెల్-లెబనాన్ కాల్పుల విరమణ ప్రణాళికను హిజ్బుల్లా తిరస్కరించడం, పశ్చిమ ఆసియాలో భౌగోళిక రాజకీయ అనిశ్చితి కొనసాగడం వంటి అంశాలు అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న విస్తృత చర్చలను మరింత క్లిష్టతరం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు అధికంగా ఉండటం, ద్రవ్యోల్బణ ప్రమాదాలు పొంచి ఉండటంతో, బంగారం తదుపరి కదలిక ఏ దిశగా ఉంటుందో తెలుసుకోవడానికి ఇన్వెస్టర్లు ఇప్పుడు రాబోయే యూఎస్ సీపీఐ (CPI ద్రవ్యోల్బణం), పీపీఐ (PPI) డేటా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
