ఇజ్రాయెల్-ఇరాన్ వార్.. లక్ష దాటిన బంగారం ధర.. రాబోయే 12 నెలల్లో ఎంత పెరగొచ్చంటే ?

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిన్న శుక్రవారం ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడి తర్వాత బంగారం ధరలు వరుసగా మూడవ రోజు పెరిగి దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో 10 గ్రాములకు రూ.2,200 పెరిగి రూ.1,01,540కి చేరుకుంది. దింతో 10 గ్రాముల ధర మళ్ళీ రూ.1 లక్ష మార్కును దాటిన తర్వాత ఇప్పుడు అందరి మనసుల్లో ఒకటే ప్రశ్న తలెత్తుతుంది. రాబోయే 12 నెలల్లో బంగారం తులం ధర రూ.1.25 లక్షలకు చేరుకుంటుందా లేదా అంతకంటే ఎక్కువ పెరుగుతుందా అని ? కానీ రాబోయే 12 నెలల్లో బంగారం అంచనా ధర ఎంత ఉంటుందో తెలుసా..

Gold Price Prediction Gold hits record high of Rs 1 00 403 10g on Iran-Israel tensions can the uptrend continue

దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ అయిన మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధరలు చరిత్రలో నిలిచిపోయే రికార్డును సృష్టించాయి. మొదటిసారిగా బంగారం 10 గ్రాములకు రూ.1,00,000 స్థాయిని దాటింది. ఇది ఇప్పటివరకు చూసిన అత్యంత వేగమైన ఇంకా అతిపెద్ద పెరుగుదలగా పరిగణించబడుతుంది. ఈ పెరుగుదల వెనుక అంతర్జాతీయ పరిణామాలు ఇంకా ఆర్థిక సూచికలు కీలక పాత్ర పోషించాయి.

బంగారం ధర ఎందుకు పెరిగింది: ముఖ్యంగా ఇరాన్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి తర్వాత మిడిల్ ఈస్ట్లో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ మార్కెట్లలో భారీ అనిశ్చితి నెలకొంది. ఇటువంటి సమయాల్లో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి అప్షన్ వైపు మొగ్గు చూపుతారు ఇంకా బంగారం ఎప్ప్పుడు కూడా సురక్షితమైన స్వర్గధామంగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా బంగారం డిమాండ్‌లో అకస్మాత్తుగా పెరుగుదల కనిపించింది, ఇదే ధరల పెరుగుదలకు దారితీసింది.

దీనితో పాటు అమెరికాలో విడుదలైన తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు ఊహించిన దానికంటే తక్కువగా ఉన్నాయి, దీని వల్ల ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే ఊహాగానాలు బలపడ్డాయి. వడ్డీ రేట్లలో కోత డాలర్‌ను బలహీనపరుస్తుంది అలాగే బంగారాన్ని బలపరుస్తుంది, ఎందుకంటే వడ్డీ లేని ఆస్తులలో పెట్టుబడి పెరుగుతుంది.

రాబోయే 12 నెలల్లో ధర ఎంత పెరుగుతుంది : అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరపై భారీ అంచనాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా (BofA) అంచనా ప్రకారం, రాబోయే 12 నెలల్లో బంగారం ధర ఔన్సుకు $4,000 వరకు పెరగవచ్చు. అదే సమయంలో గోల్డ్‌మన్ సాచ్స్ కూడా రిజర్వ్ బ్యాంకుల కొనుగోళ్ల కారణంగా 2025 చివరి నాటికి బంగారం $3,700 ఇంకా 2026 మధ్య నాటికి ట్రాయ్ ఔన్సుకు $4,000 స్థాయికి చేరుకోవచ్చని అంచనాను పునరుద్ఘాటించింది.

అయితే, ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం ఉన్నప్పటికీ క్యుడయిల్ సప్లయ్'లో పెద్దగా అంతరాయం కలిగే అవకాశం లేదని గోల్డ్‌మన్ సాచ్స్ కూడా అంటున్నారు. అయినప్పటికీ భౌగోళిక రాజకీయ నష్టాలు ఇంకా ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల కారణంగా సమీప భవిష్యత్తులో బంగారం ధరలు ఎక్కువగానే ఉండవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+