బంగారం ధరల పెరుగుదలపై జేపీమోర్గాన్ షాకింగ్ న్యూస్..పసిడి కొనుగోలుపై కీలక సూచన..

Gold Price Prediction 2027: అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరల హెచ్చుతగ్గులు పెట్టుబడిదారులను తీవ్ర గందరోగళానికి గురిచేస్తున్నప్పటికీ, దీర్ఘకాలంలో బంగారం తన మెరుపును కోల్పోదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాబోయే నెలల్లో పసిడి ధరలు అనిశ్చితికి లోనయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకుల నిరంతర కొనుగోళ్లు, ద్రవ్యోల్బణ ఆందోళనలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పసిడి ధరలకు బలమైన మద్దతుగా నిలుస్తాయని అంచనా వేస్తున్నారు.

వరుసగా 4 ఏళ్ల పాటు లాభాలను అందించిన బంగారం ధరలు, 2026 సంవత్సరంలో మాత్రం సుమారు 4.5% వరకు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 2025లో ఏకంగా 70% పెరిగి సరికొత్త రికార్డులను సృష్టించిన బంగారానికి, ఈ ఏడాది నమోదైన స్వల్ప క్షీణత తాత్కాలికమేనని విశ్లేషకులు చెబుతున్నారు. 2026 ప్రారంభంలో ఔన్సుకు సుమారు $4,330గా ఉన్న బంగారం ధర, జనవరి నాటికి రికార్డు స్థాయిలో $5,608కి ఎగబాకింది. అయితే ఆ తర్వాత క్షీణత బాట పట్టి జూలై నాటికి $3,980కి పడిపోగా, ఆగస్టులో తిరిగి పుంజుకుని $4,670 స్థాయికి చేరుకుంది. అక్టోబర్‌లో మళ్లీ పతనమై ఏడాదిలోనే అత్యల్ప స్థాయి అయిన $3,850కి పడిపోయి, నవంబర్ 6 నాటికి $4,120 వద్ద ట్రేడ్ అయింది.

2027 JPMorgan 2027 Gold Price Prediction 2027 JPMorgan Gold Outlook Gold Price Forecast Gold Prices 2027 Gold Market Volatility Gold Rate Forecast Gold Investment Outlook JPMorgan Gold Forecast

ఈ తాత్కాలిక క్షీణత ఉన్నప్పటికీ, 2027 సంవత్సరంలో పసిడి ధరలు ఊహించని రీతిలో పుంజుకుంటాయని ప్రపంచ స్థాయి బ్యాంకులు మరియు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు దాదాపు 600 నుండి 800 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా చైనా సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే వరుసగా 23 నెలలుగా పసిడి నిల్వలను పెంచుకుంటూ కొనుగోళ్లను కొనసాగిస్తుండటం గమనార్హం. దీనికి తోడు ఇటీవలి ధరల తగ్గుదల సమయంలో చాలామంది ఫండ్ మేనేజర్లు, ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడంతో, కొత్తగా పసిడిలో పెట్టుబడులు పెట్టడానికి భారీగా అవకాశం ఏర్పడింది. పెరుగుతున్న ప్రపంచ అప్పులు, దేశాల మధ్య నడుస్తున్న తీవ్ర ఉద్రిక్తతలు కూడా బంగారానికి ప్రధాన అభయహస్తంగా మారనున్నాయి.

Also Read

ఈ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాలు 2027కి సంబంధించి సరికొత్త ధరల లక్ష్యాలను వెల్లడించాయి. వీటిలో జేపీమోర్గాన్ (JPMorgan) సంస్థ అత్యధిక పెరుగుదలను ఊహిస్తూ.. 2027 నాటికి బంగారం ధర ఔన్సుకు ఏకంగా $6,300కి చేరుకుంటుందని సంచలన అంచనా వేసింది.

మరోవైపు యూబీఎస్ (UBS) బ్యాంక్ కూడా పసిడిపై ధీమా వ్యక్తంచేస్తూ.. 2027 రెండవ లేదా మూడవ త్రైమాసికం నాటికి ఔన్సు బంగారం ధర $5,200 మార్కును తాకుతుందని తెలిపింది. ఈ రెండు ప్రధాన బ్యాంకుల విశ్లేషణల ప్రకారం రాబోయే ఏడాదిలో పసిడి మార్కెట్ అత్యంత బలంగా ఉండనుందని, స్వల్పకాలిక హెచ్చుతగ్గులను పక్కన పెడితే దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు బంగారం సురక్షితమైన, అపారమైన లాభాలను ఇచ్చే మార్గంగా నిలుస్తుందని స్పష్టమవుతోంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+