నేడు శుక్రవారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.98,230కి చేరి కాస్త తగ్గింది, అయితే 22 క్యారెట్ల ధర రూ.90,040 వద్ద ఉండగా, 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.73,670గా ఉంది. ఏప్రిల్ 24న అంటే నిన్న నిన్న చూస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గింది, అంతకుముందు ఏప్రిల్ 23న ఒకే రోజులో అతిపెద్ద తగ్గుదల రూ.3 వేలు పడిపోయింది. కానీ ఏప్రిల్ 22న 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.1,01,350 చేరుకొని ఆల్ టైం రికార్డ్ సెట్ చేసి లక్ష దాటింది. దింతో పాటు 22 క్యారెట్లు బంగారం ధర రూ.92,900 వద్ద గరిష్ట స్థాయిని తాకింది.

ఈరోజు ఢిల్లీలో 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.73,800గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.90,200గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.98,340గా ఉంది. అంటే గత 10 రోజుల ఆవరేజ్ ధర 10 గ్రాములకు రూ.98,210కి సమీపంలో చేరువైంది. దీని బట్టి చూస్తే పసిడి ధరలు ఒక విధంగా శాంతిస్తున్నాయి అని చెప్పవచ్చు. అలాగే గోల్డ్ షాపింగ్ చేసేవారికి మంచి అవకాశంగా భావించవచ్చు.
తెలంగాణాలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్‌లో 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.73,680గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.90,050గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.98,240గా ఉంది. గత 10 రోజులుగా సగటు ధర గ్రాముకు ₹9,130.20గా ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లోని విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.90,050, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.98,240, 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.73,680.
మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.100.90గా ఉండగా, 10 గ్రాములకి రూ.1009, కేజీకి నేడు రూ.1,00,900. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.1,00,900, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,10,900.
0005 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్స్ 0.2 శాతం పెరిగి $3,354.29 డాలర్లకి చేరుకుంది. ఇతర లోహాలలో స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.2 శాతం పెరిగి $33.65కి చేరుకుంది అలాగే ప్లాటినం 0.2 శాతం పెరిగి $973.03 డాలర్లకి చేరుకుంది. పల్లాడియం 1 శాతం తగ్గి $944.25 డాలర్లకి చేరుకుంది.


Click it and Unblock the Notifications