దీపావళి అయిపోయిన బంగారం మెరుపు మాత్రం ఇంకా తగ్గలేదు. పండుగ సీజన్ ముగిసిన తర్వాత కూడా బంగారం మార్కెట్‌లో ఉత్సాహం కొనసాగుతోంది. పెట్టుబడిదారులు, గృహాలు, అంతర్జాతీయ మార్కెట్లు ఇప్పటికీ బంగారంపైనే దృష్టి సారించాయి. ప్రధాన ప్రశ్న ఇప్పుడు ఏం వినిపిస్తోందంటే.. బంగారం ధరలు ఇక తగ్గుతాయా? లేక మరొక పెద్ద ఎత్తుగడ ముందుందా? అనేది. ఈ నేపథ్యంలో గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ HSBC తాజా నివేదికను విడుదల చేసింది. దానిలో Gold ధరలు సమీప భవిష్యత్తులో తగ్గే అవకాశం లేదని స్పష్టంగా పేర్కొంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే బంగారం ఔన్సుకు 4,300 డాలర్ల మార్కును దాటింది. అక్టోబర్ 18న స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,362 డాలర్ల వద్ద ట్రేడవుతూ, బలమైన బుల్లిష్ సెంటిమెంట్ కొనసాగుతోందని తెలిపింది. పండుగ రద్దీ తర్వాత కూడా ఈ ఊపు కొనసాగుతుందని HSBC అంచనా వేస్తోంది. 2026 మొదటి అర్ధభాగం నాటికి Gold ధరలు ఔన్సుకు 5,000 డాలర్లకు చేరవచ్చని HSBC పేర్కొంది. అంటే ప్రస్తుత స్థాయిల నుండి దాదాపు 1,000 డాలర్ల పెరుగుదలగా చెప్పవచ్చు.

పసిడి పెరుగుదలకు ప్రధాన కారణాలుగా.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి (ప్రత్యేకంగా US వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం), బంగారాన్ని దీర్ఘకాలిక సురక్షిత ఆస్తిగా పరిగణించే పెట్టుబడిదారుల పెరుగుదలగా తేల్చి చెప్పింది. గతంలో HSBC 2025 నాటికి సగటు బంగారం ధరను ఔన్సుకు 3,355 డాలర్లుగా అంచనా వేసింది. ఇప్పుడు దానిని 3,455 డాలర్లకి సవరించింది. అదే విధంగా 2026 అంచనాను 3,950 డాలర్ల నుండి 4,600 డాలర్లకి పెంచింది. అంటే, బ్యాంక్ అంచనాల ప్రకారం బంగారం ర్యాలీ ఇంకా ముగియలేదని అర్థం చేసుకోవచ్చు.
ఈ గణాంకాలు కేవలం HSBC విశ్లేషణ మాత్రమే కాదు.రాయిటర్స్ కూడా ఇదే దిశలో ఉన్న మార్కెట్ ధోరణులను ప్రస్తావించింది. పెరుగుదల సమయంలో లాభాలను బుక్ చేసుకోవడం కంటే బంగారాన్ని దాచుకునే ధోరణి కొనుగోలుదారుల్లో పెరుగుతోందని గమనించింది. ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, బంగారం ధరల ఈ ర్యాలీకి ప్రధానంగా మూడు అంశాలు దోహదపడ్డాయి. అవేంటంటే.. ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు తమ బంగారు నిల్వలను గణనీయంగా పెంచుకుంటున్నాయి. గోల్డ్ ETF (Exchange-Traded Funds) లలో పెట్టుబడులు పెరుగుతున్నాయి.US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలపై అంచనాలు బలపడుతున్నాయి.
ఈ అంశాలన్నీ కలిసి బంగారాన్ని "సేఫ్ హేవెన్" ఆస్తిగా మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఇటీవల బంగారం డిసెంబర్ 2008 తర్వాత అత్యంత వేగవంతమైన వారపు లాభాలను నమోదు చేసింది. HSBC ప్రకారం, 2026 ప్రారంభం వరకు ఈ ర్యాలీ కొనసాగవచ్చు. అయితే ఆ సంవత్సరం చివర్లో కొంత కరెక్షన్ (Correction) వచ్చే అవకాశం ఉందని సూచించింది. అయినప్పటికీ మొత్తం ధోరణి బుల్లిష్ గానే ఉంటుందని పేర్కొంది.
ఇక HSBC మాత్రమే కాదు.. బ్యాంక్ ఆఫ్ అమెరికా, సొసైటీ జనరల్ కూడా బంగారం ధరలపై సానుకూల అంచనాలు విడుదల చేశాయి. ఈ రెండు బ్యాంకులు కూడా రాబోయే ఏడాదికి ఔన్సుకు 5,000 డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించాయి.ANZ బ్యాంక్ మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించింది. జూన్ 2026 నాటికి బంగారం ధర 4,600 డాలర్ల వరకు చేరుకుని, తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుందని అంచనా వేసింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..



Click it and Unblock the Notifications