Gold Price Outlook: పసిడి ప్రియులు ఎగిరి గంతేసే వార్త.. బంగారం ధరలు సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి. మొన్నటి దాకా కొండెక్కిన ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టేందుకు రెడీగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారులు పసిడిని సురక్షిత డిమాండ్ నుంచి పక్కన బెట్టి వేరే అంశాలపై దృష్టి సారించారు. దీంతో బంగారం ధర తగ్గుతోంది.
శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర 10 గ్రాములకు రూ.930 తగ్గి రూ.97,670కి చేరుకుంది. బంగారం వ్యాపారులు అమ్మకాలు జరపడంతో.. వచ్చే వారం కూడా బంగారం ధర తగ్గుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ కాల్పుల విరమణ తర్వాత, పశ్చిమాసియాలో ఉద్రిక్తత తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి.
దీని కారణంగా, పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ప్రపంచ స్థాయిలో రాజకీయ రిస్క్ తగ్గడం, బలమైన ప్రపంచ వాణిజ్య ఆశావాదం కారణంగా బంగారం ధరలు తగ్గాయని రిలయన్స్ సెక్యూరిటీస్ నిపుణుడు జిగర్ త్రివేది అన్నారు. ఈ పరిస్థితులలో పెట్టుబడిదారులలో సురక్షితమైన పెట్టుబడి కోసం బంగారం మీద దృష్టిని పెట్టాలనే కోరిక ఇప్పుడు తగ్గిందని చెబుతున్నారు.

ఈ పరిస్థితులు ఇలా ఉంటే.. వచ్చే వారం పసిడి ధరపై అనేక అంశాలు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా, యూరోపియన్ ప్రాంతంలో ఆర్థిక డేటా విడుదల కానుంది. రాబోయే వారానికి బంగారం మార్పులకు ఇవి ప్రధాన కేంద్ర బిందువులు అవుతాయని జిగర్ త్రివేది అన్నారు. జిగర్ త్రివేది ప్రకారం- కామెక్స్ బంగారం ఔన్సుకు 3,230 నుంచి 3,200 డాలర్ వద్ద ట్రేడ్ అవుతుందని భావిస్తున్నారు. ఆగస్టు ఫ్యూచర్స్ కోసం MCX బంగారం ధర 10 గ్రాములకు రూ. 94800- రూ 94000 వరకు తగ్గుతుందని భావిస్తున్నారు.
ఇక ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు గురించి మరిన్ని సూచనల కోసం పెట్టుబడిదారులు US వ్యక్తిగత వినియోగ వ్యయం (PCE) ధర సూచిక డేటా విడుదల కోసం ఎదురుచూస్తున్నారంటూ ఆనంద్ రతి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీస్ & కరెన్సీస్) మనీష్ శర్మ తెలిపారు. ఈ పరిణామాలన్నీ బంగారం ధరలు తగ్గే అవకాశాలను కల్పిస్తున్నాయని చెబుతున్నారు. ఇక జూలై 9 నాటికి తీసుకోబోయే అమెరికా టారిఫ్ నిర్ణయం కీలకంగా మారనుంది.
చివరిగా బంగారం కొనుగోలు చేసేవారు, ఇన్వెస్ట్ చేసేవారు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే...ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుండటంతో, మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు తక్కువయ్యాయి. అంతర్జాతీయంగా వాణిజ్య సంబంధాల్లో సానుకూల అభివృద్ధి కనిపిస్తోంది. దీనివల్ల బంగారం ధరలు అంతర్జాతీయంగా, MCX మార్కెట్లలో భారీగా పడిపోయాయి.ఇక మరో వైపు, అమెరికన్ డాలర్ కూడా 1.5% పడిపోయి 97.3 దిగువకు చేరింది. ఇది 2022 ఫిబ్రవరి తర్వాత కనిష్ట స్థాయిగా చెప్పొచ్చు. బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న వారు, ధరలు ఇంకా మరింత తగ్గే అవకాశముండటంతో కొంతకాలం వేచి చూడటం మంచిదనే అభిప్రాయాన్ని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications