గ్లోబల్ మార్కెట్లలో బంగారం పెరుగుదలపై అంచనాలు మరింత బలపడ్డాయి. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ UBS తాజాగా విడుదల చేసిన నివేదికలో బంగారం వ్యాపారులకు మంచి శుభవార్తను అందించింది. సాధారణంగా సురక్షిత ఆస్తిగా భావించే బంగారం ధరలు రానున్న సంవత్సరాల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇప్పుడు ఉన్న స్థాయిలను పరిగణనలోకి తీసుకుంటే, మార్చి 2026 నాటికి బంగారం ఔన్సుకు 3,600 డాలర్లకు పైగానే చేరుకునే అవకాశం ఉందని సంస్థ మరోసారి అంచనా వేసింది. అదే సమయంలో పెరుగుతున్న బంగారం ధరల ప్రభావం భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడాతన నివేదికలో పేర్కొంది.
UBS నివేదిక ప్రకారం.. అమెరికా ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న అస్థిరత, వృద్ధి మందగమనం కారణంగా బంగారం సురక్షితమైన ఆస్తిగా మారుతోంది. ఇక ప్రపంచంలోని అనేక దేశాలు ప్రధానంగా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తూ పెట్టుబడిగా Gold కొనుగోలు చేయడం కూడా పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతోంది. దీనికి తోడు కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. ఇటీవలి నెలల్లో ఆసియా, మధ్యప్రాచ్య దేశాలు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేశాయి.మరొక అంశం ఏంటంటే డాలర్ బలహీనపడుతూ ఉండటం, ప్రధాన దేశాలు వడ్డీ రేట్లను తగ్గించే దిశగా వెళ్తుండటం కూడా బంగారం రయ్యిన పరుగు పెట్టడానికి కారణం అవుతోంది.

ఈ పరిస్థితుల నేపథ్యంలోనే UBS బంగారంలో దీర్ఘకాలిక పెట్టుబడి చేసినవారికి మంచి రాబడులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుత మార్కెట్ స్థాయిలతో పోల్చితే 3,600/oz డాలర్ల లక్ష్యానికి చేరుకుంటే బంగారం గణనీయంగా పెరిగినట్లే అవుతుందని నివేదిక అంచనా వేసింది.
భారతదేశం బంగారం అవసరాల్లో ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతున్న దేశం అని నివేదిక తెలిపింది. అందుచేత ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగితే భారత్ యొక్క వాణిజ్య లోటు (Trade Deficit) కరెంట్ ఖాతా లోటు (CAD) కూడా పెరుగతాయి. దీంతో రూపాయిపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.ఇక పండుగలు, వివాహాల సమయంలో బంగారం కొనుగోలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు వినియోగదారులు కొంతమేర వెనుకకు తగ్గే అవకాశం కూడా ఉంటుందని తెలిపింది
క్లుప్తంగా చెప్పాలంటే దీర్ఘకాలిక పెట్టుబడిదారులకైతే ఇది లాభదాయక దశగా మారవచ్చు. బంగారు ETFలు, సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB) వంటి సాధనాల ద్వారా మిగతా పెట్టుబడి వర్గాలతో పోల్చితే మంచి రాబడి పొందే అవకాశం ఉందని యూబిఎస్ నివేదిక పేర్కొంది. SGBల విషయంలో Gold విలువ పెరగడం మాత్రమే కాకుండా వార్షిక వడ్డీ కూడా లభించే క్రమంలో రెట్టింపు లాభం సాధ్యమవుతుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే విదేశీ నిల్వల్లో బంగారం వాటాను క్రమంగా పెంచుతోంది. గోల్డ్ ప్రైస్ పెరిగితే, RBI సమృద్ధి బంగారు నిల్వల విలువ కూడా పెరుగుతుంది. ఇది దేశీయ ఆర్థిక స్థిరత్వానికి ఒక సానుకూల సంకేతంగా చెప్పవచ్చు. ఆభరణాల రంగానికి మాత్రం తాత్కాలికంగా ఈ పెరుగుదల ఒత్తిడినిస్తుందని అంచనా.
మొత్తానికి, గ్లోబల్ పరిస్థితులు చూస్తే బంగారం ధరలకు ప్రస్తుత సమయంలో బలమైన మద్దతు ఉందని, స్వల్పకాలంలో కొంత అస్థిరత ఉన్నా దీర్ఘకాలంలో బంగారం పొజిటివ్ ట్రెండ్‌లోనే జరిగే అవకాశం ఉందని UBS స్పష్టం చేసింది. ఇది భారతదేశానికి ఇది ఒకవైపు వాణిజ్యపరమైన ఒత్తిడి కాగా మరొకవైపు పెట్టుబడిదారులకు అవకాశాలుగా మారే పరిణామంగా కనిపిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి ధరల్లో మళ్ళీ కదలిక.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితి ఎలా ఉందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications