బంగారం ధర ఈ రేటు వద్దకు వస్తేనే కొనండి.. సామాన్యులకు కీలక సూచన చేస్తున్న ఆర్థిక నిపుణులు

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితులు, అమెరికా వడ్డీరేట్లపై మారుతున్న అంచనాలు, ప్రధాన ఆర్థిక సూచికలలో కనిపిస్తున్న బలహీన సంకేతాల నేపథ్యంలో ఈ వారం బంగారం ధరలు ఒత్తిడిలోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆనంద్ రతి షేర్లు అండ్ స్టాక్ బ్రోకర్స్‌లో కమోడిటీస్ & కరెన్సీల ఏవీపీ మనీష్ శర్మ తెలిపారు. గత వారం నుండి బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ పెట్టుబడిదారులను గందరగోళానికి గురిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

డిసెంబర్‌లో ఫెడరల్ రిజర్వు రేటు తగ్గించే అవకాశాలపై మార్కెట్‌లో మొదట బలమైన అంచనాలు ఉన్నప్పటికీ, అమెరికా నుంచి వరుసగా వెలువడిన బలహీన డేటా ఆ అంచనాలను పూర్తిగా మార్చేశాయి. అక్టోబర్‌లో US ఉద్యోగాల నష్టాలు పెరగడం, వినియోగదారుల భావజాలం తగ్గిపోవడం వంటివి బంగారానికి సాధారణంగా మద్దతు ఇచ్చే సూచికలుగా నిలిచాయి. మొదట్లో ఇవి Gold ధరలను నిలకడగా ఉంచాయి. అయితే, ఇటీవల ముగిసిన 40 రోజుల ప్రభుత్వ షట్‌డౌన్ వల్ల వచ్చిన అనిశ్చితి ఆర్థిక వృద్ధిపై కొత్త ఆందోళనలను తెచ్చిపెట్టింది.

gold price prediction gold price today gold under pressure 1 22 000 gold level gold market analysis gold forecast India bullion outlook gold correction trend international gold rates MCX gold outlook 1 22 000 MCX

షట్‌డౌన్ ముగియడంతో.. ఇప్పటివరకు నిలిచిపోయిన డేటా విడుదలలు మళ్లీ సాధారణ స్థితికి చేరాయి. దీనితో పెట్టుబడిదారులు మళ్లీ వడ్డీరేట్లపై ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలను మరింత జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ముందు 85-90 శాతంగా ఉన్న డిసెంబర్ రేటు కోత అవకాశాలు ఇప్పుడు కేవలం 45-70 శాత మధ్యకే తగ్గిపోయాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణం ఇంకా పూర్తిగా తగ్గకపోవడం, కార్మిక మార్కెట్ పూర్తిగా బలహీనపడకపోవడం ఫెడరల్ రిజర్వ్ అధికారులను మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా చేస్తోంది. ఈ జాగ్రత్త Gold ధరల పతనానికి ప్రధాన కారణమైంది.

ఆసియా దేశాల్లో కూడా బంగారంపై భౌతిక డిమాండ్ తగ్గుతోంది. భారతదేశంలో డీలర్లు అధిక డిస్కౌంట్‌లు ఇచ్చినా కొనుగోలు ఆసక్తి తగ్గింది. చైనాలోనూ ఇటీవల జరిగిన నియంత్రణ మార్పుల వల్ల బంగారం డిమాండ్ తగ్గింది. ఈ నేపథ్యంతో డాలర్ ఇండెక్స్ బలపడటం, గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి నిధుల ఔట్‌ఫ్లో కొనసాగడం బంగారం రేట్లను మరింత దిగజారే దిశగా నెడుతున్నాయి.

హైదరాబాద్ బంగారం ధరలు గురించి తెలుసుకోండి

ఈ వారం మూడు కీలక అంశాలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని శర్మ చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌లపై తీసుకునే వైఖరి, ఫెడరల్ రిజర్వ్ అధికారుల వ్యాఖ్యలు, షట్‌డౌన్ తర్వాత విడుదలవుతున్న అమెరికా ఆర్థిక డేటా ఈ మూడు అంశాలు బంగారం ధరలను డిసైడ్ చేయబోతున్నారని ఆయన అంచనా వేశారు. గ్లోబల్ మార్కెట్లో బంగారం ఇటీవల 4200 డాలర్ల మార్కును తాకిన తర్వాత 4050 డాలర్ల వరకు జారిపోయింది. డేటా బలహీనంగా వస్తే ధరలకు మళ్లీ మద్దతు లభించే అవకాశం ఉంది. అయితే రేటు కోతలపై అంచనాలు తగ్గడం, టారిఫ్ చర్చలు మళ్లీ పెరగడం బంగారాన్ని 4000 నుంచి 3920 డాలర్ల మద్దతు వైపు లాగవచ్చని ఆయన చెప్పారు.

భారత మార్కెట్లో బంగారం ధర రూ. 1,22,000 స్థాయి అత్యంత కీలకమని ఆయన తెలిపారు. ఈ స్థాయి రేటుకు బంగారం దిగజారితే, ధరలు రూ. 1,19,500 నుంచి రూ. 1,20,000 వరకూ పడిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. మరోవైపు రూ. 1,25,000 స్థాయి ప్రధాన నిరోధంగా ఆయన అంచనా వేస్తున్నారు. అంటే ఆ స్థాయి వద్ద బంగారం కొనుగోలు అంత మంచిది కాదని సూచిస్తున్నారు. ఆ స్థాయి కిందకు దిగినప్పుడు సామాన్యులు బంగారం కొంటే కాస్తా లాభాలను పోగేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+