బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. నిపుణులు ఇంకా ఎందుకు బుల్లిష్‌గా ఉన్నారంటే..

ఇటీవల రికార్డు స్థాయిలకు చేరిన బంగారం ధరలు స్వల్పకాలికంగా దిద్దుబాటుకు గురవుతున్నప్పటికీ.. దీర్ఘకాలంలో పసిడికి ఉన్న ప్రాముఖ్యత, డిమాండ్ చెక్కుచెదరలేదని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీకెండ్ ఇన్వెస్టింగ్ వ్యవస్థాపకుడు అలోక్ జైన్, ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేదిల తాజా విశ్లేషణ ప్రకారం.. బంగారాన్ని కేవలం ఒక స్వల్పకాలిక ట్రేడింగ్ సాధనంగా చూడకుండా.. ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభాల నుంచి కాపాడే ఒక ప్రధాన పోర్ట్‌ఫోలియో రక్షణ, ఆస్తి కేటాయింపు సాధనంగా చూడాలని సూచిస్తున్నారు.

బంగారం దీర్ఘకాలంలో అత్యుత్తమ రాబడులను అందించడానికి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణమని వీకెండ్ ఇన్వెస్టింగ్ వ్యవస్థాపకులు అలోక్ జైన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రభుత్వాలు తమ ఆదాయానికి మించి ఖర్చు చేస్తుండటం వల్ల నిరంతరం ద్రవ్యలోటు పెరుగుతోందని ఆయన తెలిపారు. పెరుగుతున్న రుణ వ్యయాలను తగ్గించుకోవడానికి ప్రభుత్వాలు కరెన్సీ ముద్రణను (ద్రవ్య సరఫరా) పెంచితే.. అది అంతిమంగా Gold ధరలు భారీగా పెరగడానికే దోహదపడుతుందని వివరించారు.

Gold Price Outlook Gold Price Prediction Gold Bull Run Gold Rally Gold Investment Gold Forecast 2026 Gold Correction Gold Market Outlook Gold Bullish Forecast Gold Prices Gold Investment India Precious Metals Gold Price Target Gold Price Today Gold Price Prediction Gold Bull Run Gold Outlook

దీనికి తోడు దశాబ్దాలుగా సురక్షితమైనదిగా భావిస్తున్న 60:40 (ఈక్విటీ-బాండ్) పోర్ట్‌ఫోలియో వ్యూహం.. కోవిడ్ తదనంతర కాలంలో బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల దెబ్బతిన్నది. బాండ్ల వల్ల కలిగే నష్టాల నుండి రక్షణ పొందడానికి ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం వైపే మొగ్గు చూపుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు నిరంతరంగా బంగారాన్ని కొనుగోలు చేయడం కూడా ఈ లోహానికి సాంప్రదాయక బలాన్ని ఇస్తోంది. 2026 మొదటి త్రైమాసికంలోనే చైనా ఏకంగా 317 టన్నుల బంగారాన్ని సేకరించడం దీనికి నిదర్శనమని ఆయన గుర్తుచేశారు. కొత్త గనుల నుంచి ఉత్పత్తి ప్రారంభం కావడానికి కనీసం 15 ఏళ్ల సమయం పడుతుండటం.. గనుల ఉత్పత్తి ఏటా కేవలం 2 శాతం మాత్రమే పెరుగుతుండటంతో సరఫరా కొరత కూడా ధరలకు ఊతమిస్తోంది.

Also Read

ఎల్‌కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఎంసిఎక్స్ (MCX) గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్‌లో లాభాల స్వీకరణ కొనసాగుతోందని తెలిపారు. ప్రసుతం కాంట్రాక్ట్ రూ. 1,52,400 - రూ. 1,52,600 మధ్యన ట్రేడ్ అవుతోందని.. రూ. 1.53 లక్షల స్థాయి వద్ద బలమైన నిరోధం (Resistance) ఎదురవుతోందని అన్నారు.

ట్రేడర్ల కోసం త్రివేది ఒక స్వల్పకాలిక వ్యూహాన్ని ప్రతిపాదించారు. రూ. 1,53,000 పైన స్టాప్-లాస్ (Stop-Loss) పెట్టుకుని.. దిగువన రూ. 1,51,500 నుండి రూ. 1,51,000 లక్ష్యాలతో 'పెరిగినప్పుడు అమ్మకాలు జరిపే వ్యూహాన్ని పాటించాలని సూచించారు. మూవింగ్ యావరేజ్, ఆర్‌ఎస్‌ఐ (RSI) వంటి సాంకేతిక సూచికలు ఓవరాల్ ట్రెండ్ బుల్లిష్‌గానే ఉందని చూపిస్తున్నప్పటికీ.. స్వల్పకాలికంగా మొమెంటం మందగించిందని వెల్లడించారు. ఒకవేళ పసిడి ధరలు రూ. 1.53 లక్షల మార్కును దాటితే ఈ బేరిష్ వ్యూహం చెల్లకుండా పోయి.. మళ్లీ కొత్త అప్‌ట్రెండ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

భారతీయ ఇన్వెస్టర్ల దృష్టికోణంలో రూపాయి విలువ క్షీణత నుంచి రక్షణ పొందడానికి బంగారం సరైన సాధనమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతర్జాతీయంగా డాలర్లలో లెక్కించినప్పటికీ.. భారత్‌లో దీనిని రూపాయిల్లోనే కొనుగోలు చేస్తాం కాబట్టి రూపాయి క్షీణించిన ప్రతిసారీ బంగారం కొనుగోలు శక్తిని కాపాడుతూ మంచి రాబడిని ఇస్తుంది. అందువల్ల స్వల్పకాలికంగా ధరలలో వచ్చే హెచ్చుతగ్గులను చూసి ఆందోళన చెందకుండా.. ప్రతి ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో కొంతభాగాన్ని బంగారంలో భద్రపరుచుకోవడం భవిష్యత్ ఆర్థిక భద్రతకు అత్యంత కీలకమని నిపుణులు తెలిపారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+