బంగారంపై యుద్ధం రాబోతుందా.. భారీ స్థాయిలో పసిడిని కొంటున్న చైనా.. ఎంతలా అంటే..
ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగదారు అయిన చైనా.. పసిడి మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. 2026 జూలై నెలలో చైనా అధికారిక రంగానికి చెందిన Gold కొనుగోళ్లు రికార్డు స్థాయిలో పుంజుకున్నాయి. చైనా సెంట్రల్ బ్యాంక్ అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBoC) జూలైలో తన బంగారు నిల్వలను ఏకంగా 20 టన్నుల మేర పెంచుకోవడంతో.. అక్కడ పసిడి కొనుగోళ్ల జోరు కొత్త పుంతలు తొక్కుతోంది.
పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా జూలైలో తన నిల్వలకు 20 టన్నుల పసిడిని జత చేయడంతో.. అధికారిక బంగారు నిల్వలు రికార్డు స్థాయిలో 2,366 టన్నులకు చేరుకున్నాయి. సెంట్రల్ బ్యాంక్ వరుసగా 21వ నెలలోనూ బంగారం కొనుగోళ్లను కొనసాగించడం విశేషం. సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న ఈ పసిడి నిల్వలు చైనా మొత్తం విదేశీ మారక నిల్వల (Foreign Exchange Reserves) లో 8 శాతానికి సమానంగా మారాయి. జూలైలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా జరిపిన 20 టన్నుల Gold కొనుగోలు.. అక్టోబర్ 2023 తర్వాత ఆ బ్యాంక్ జరిపిన అత్యంత భారీ నెలవారీ కొనుగోలుగా నిలిచింది. తగ్గుతున్న ధరలను ఆసరాగా చేసుకుని సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్ల వేగాన్ని పెంచిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మరోవైపు తాజా నివేదికల ప్రకారం.. జూన్ నెలలో చైనా నికర బంగారు దిగుమతులు 152 టన్నులుగా నమోదయ్యాయి. ఇది మే నెల కంటే 2 టన్నులు ఎక్కువ కాగా, మార్చి 2024 తర్వాత చైనాలో నమోదైన అత్యధిక నెలవారీ దిగుమతిగా నిలిచింది. 2026 జనవరి నుండి జూన్ మధ్య కాలంలో చైనా మొత్తం 764 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఇది ఏకంగా 138 శాతం భారీ పెరుగుదలను సూచిస్తోంది.
మే, జూన్ నెలల్లో కొంతమొత్తం నిధులు ఉపసంహరణకు గురైనప్పటికీ.. జూలై నెలలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చైనా గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి జూలై ఒక్క నెలలోనే 744 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ నిధుల ప్రవాహంతో చైనా గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని మొత్తం ఆస్తులు (AUM) 3 శాతం పెరిగి 37 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈటీఎఫ్‌లలోని భౌతిక బంగారం నిల్వలు 5 టన్నులు పెరిగి 282 టన్నులకు పెరిగాయి. జనవరి నుండి జూలై మధ్య కాలంలో చైనా గోల్డ్ ఈటీఎఫ్‌లు మొత్తం 6.3 బిలియన్ డాలర్ల నిధులను ఆకర్షించాయి. ఆగస్టు నెలలోనూ గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు స్థిరంగా కొనసాగుతూ ఇప్పటివరకు దాదాపు 8 టన్నుల బంగారం జతచేరింది.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌతిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, బలహీనపడిన స్థానిక స్టాక్ మార్కెట్.. చైనా సెంట్రల్ బ్యాంక్ నిరంతరాయంగా జరుపుతున్న కొనుగోళ్లు పసిడిపై ఇన్వెస్టర్ల ఆసక్తిని పెంచాయి. వీటితో పాటు సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా భాగస్వామ్యం కావడం వల్ల చైనాలో బంగారానికి డిమాండ్ అమాంతం పెరిగింది.


Click it and Unblock the Notifications
