బంగారం, వెండి ధరల పెరుగుదలపై బ్యాడ్ న్యూస్.. స్టాప్ లాస్ ఈ స్ఠాయి వద్దే ఉండాలంటున్న నిపుణులు
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొంత కాలంగా తగ్గుతూ వస్తున్న ధరలు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. అమెరికా మళ్లీ ఉద్రిక్తకర పరిస్థితులకు ఆజ్యం పోయడంతో పసిడి ధరల్లో మార్పులు సంభవిస్తున్నాయి. ఇరాన్ ఉద్రిక్తతలు, రష్యాతో డొనాల్డ్ ట్రంప్ కయ్యం వంటి కారణాలు బంగారం ధరలను అమాంతం పెంచుతున్నాయి. పెట్టుబడిదారులు అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ పరిస్థితులను గమనిస్తూ సేఫ్ హెవన్ గా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. డాలర్ ఆధారిత ఆస్తుల్లో పెట్టుబడులు ఆచితూచి పెడుతున్నారు. దీంతో బంగారం మళ్లీ రెక్కలు తొడిగే సూచనలు కనిపిస్తున్నాయి.
బంగారం, వెండి ధరలపై రాబోయే రోజుల్లో భారీ మార్పులు సంభవించే అవకాశం ఉందని నువామా ప్రొఫెషనల్ క్లయింట్స్ గ్రూప్ ఫారెక్స్ & కమోడిటీస్ హెడ్ అభిలాష్ కోయిక్కర అభిప్రాయపడ్డారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. MCX Gold ధర 10 గ్రాములకు రూ.1,63,000 వరకు పెరిగే అవకాశం ఉండగా.. వెండి కీలక మద్దతు స్థాయిలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగే అవకాశం ఉందన్నారు.

వీక్లీ చార్టును పరిశీలిస్తే.. MCX గోల్డ్ ఇటీవలి గరిష్ట స్థాయి నుంచి స్వల్పంగా వెనక్కి తగ్గినప్పటికీ.. ప్రస్తుతం కన్సాలిడేషన్ దశలో కదులుతోంది. ధరలు ట్రెండ్ లైన్ దగ్గర బేస్ నిర్మిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ట్రెండ్ లైన్ బలమైన మద్దతుగా పని చేస్తోంది. అయితే ఈ మద్దతు కంటే దిగువన నిర్ణయాత్మకంగా ముగిస్తే బంగారం ధరలో మరింత సవరణ (కరెక్షన్) వచ్చే అవకాశం ఉంది.
అయినప్పటికీ ధరలు ఇటీవలి స్వింగ్.. కనిష్ట స్థాయిల పైనే కొనసాగుతున్నంత వరకు.. మొత్తం ట్రెండ్ బుల్లిష్‌గా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. రాబోయే వారంలో రూ.147,000 స్థాయి కీలక మద్దతు జోన్‌గా మారనుంది. ఇది పెరుగుతున్న ట్రెండ్ లైన్‌కు సమీపంగా ఉండటంతో పాటు సాంకేతికంగా కూడా ఎంతో ప్రాధాన్యం కలిగి ఉందని చెబుతున్నారు.
ఈ స్థాయి వైపు ధరలు తగ్గినప్పుడు.. కొత్త కొనుగోలు ఆసక్తి ఏర్పడే అవకాశముంది. దీని వల్ల తక్షణ ప్రతికూల ప్రమాదాలు తగ్గుతాయి. ధరలు రూ. 147,000 కంటే పైనే ఉన్నంత వరకు.. బంగారం విస్తృత బుల్లిష్ నిర్మాణం చెక్కుచెదరకుండా కొనసాగుతుంది. ఇదే క్రమంలో రాబోయే సెషన్లలో Gold తన ర్యాలీని రూ. 163,000 మార్క్ వైపు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వీక్లీ కన్సాలిడేషన్ పరిధిలో స్థిరమైన ధర కదలికలు సానుకూల దృక్పథానికి మద్దతు ఇస్తున్నాయి. మొమెంటం సూచికలు కూడా బలంగా ఉండటంతో, సమీప కాలంలో బంగారం పైకి కదిలే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
MCX గోల్డ్ ట్రేడింగ్ స్ట్రాటజీ
ప్రస్తుత ధర (CMP): రూ. 152,800
లక్ష్యం: రూ. 163,000
స్టాప్ లాస్: రూ. 147,000
MCX వెండి ధర అంచనా : వీక్లీ చార్టులో చూస్తే వెండి వరుసగా మూడవ వారం కూడా తన మద్దతును విజయవంతంగా నిలబెట్టుకుంది. ఇటీవలి కనిష్ట స్థాయిల నుంచి కోలుకున్న తర్వాత, ధరలు ఇప్పుడు కీలక మద్దతు జోన్ దగ్గర కదులుతున్నాయి. దీని వల్ల రాబోయే వారంలో సైడ్‌వేస్ నుంచి పాజిటివ్ బయాస్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
విస్తృత ట్రెండ్ ఇప్పటికీ బుల్లిష్‌గా ఉండటంతో.. స్వల్పకాలిక పుల్‌బ్యాక్‌లు ట్రేడర్లకు కొనుగోలు అవకాశాలుగా మారవచ్చు. రిస్క్ మేనేజ్‌మెంట్ కోసం ఇటీవలి వారపు కనిష్ట స్థాయిల దగ్గర స్టాప్ లాస్ ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రూ. 225,000** స్థాయి కీలక మద్దతుగా పనిచేస్తోంది. ఈ స్థాయికి దిగువన నిర్ణయాత్మక ముగింపు వస్తే బుల్లిష్ దృక్పథం బలహీనపడే అవకాశం ఉంది. వెండి ధర రూ. 260,000 దగ్గర ఉన్న 30 రోజుల EMAని పరీక్షించే స్థితిలో ఉంది. ఈ స్థాయిని దాటితే బలమైన మొమెంటంతో మరో ర్యాలీకి మార్గం సుగమమవుతుంది.
MCX సిల్వర్ ట్రేడింగ్ వ్యూహం
ప్రస్తుత ధర (CMP): రూ. 237,000
లక్ష్యం: రూ. 260,000
స్టాప్ లాస్: రూ. 225,000
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications