వణికిస్తున్న 1970ల నాటి ద్రవ్యోల్బణ ముప్పు.. మళ్లీ బంగారం ధరలు విపరీతంగా పెరుగుతాయా.. WGC ఏమంటుందంటే

1970ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటినప్పుడు.. చమురు సంక్షోభం, కరెన్సీల విలువ పతనం నేపథ్యంలో ప్రజలందరూ బంగారాన్ని అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావించి కొనుగోలు చేశారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి ద్రవ్యోల్బణ పరిస్థితులు పునరావృతమవుతుండటంతో.. ఒకవేళ ద్రవ్యోల్బణం రెండో దశ ప్రపంచాన్ని తాకితే Gold ధరలు మళ్లీ మునుపెన్నడూ లేని రీతిలో పెరుగుతాయనే చర్చ మొదలైంది.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) జూలై 2026 నివేదిక ప్రకారం.. ద్రవ్యోల్బణ భయాలు ఉన్నప్పటికీ సమీప భవిష్యత్తులో Gold ధరలు తక్షణమే విపరీతంగా పెరిగిపోవు. స్వల్పకాలంలో మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవ్వడం లేదా ఒత్తిడికి గురికావడం జరుగుతుంది. కానీ దీర్ఘకాలంలో మాత్రం బంగారం ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

1970లలో చమురు ధరలు పెరగడం, వేతనాల పెంపు డిమాండ్లు, కార్పొరేట్ వ్యయాల పెంపు వల్ల ద్రవ్యోల్బణం వేవ్స్ రూపంలో పదే పదే వచ్చింది. ప్రస్తుతం AI రంగానికి పెరుగుతున్న వనరుల డిమాండ్, కార్పొరేట్ ఖర్చులు, ముడి పదార్థాల నిల్వలు 1970లను గుర్తు చేస్తున్నాయి.

Gold Price Outlook 2026 Gold Price Prediction Gold Investment India Gold Investment 2026 1970s Inflation Inflation and Gold Gold During Inflation Gold Rally Gold Prices India Gold Forecast Gold as Hedge Safe Haven Investment Precious Metals Gold Market Outlook 2026 2026 1970

అయితే WGC నివేదిక ప్రకారం.. నాటి పరిస్థితులతో పోలిస్తే నేడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వంటి కేంద్ర బ్యాంకుల వద్ద ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు స్పష్టమైన వ్యూహాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుంది. వడ్డీ రేట్లు పెరిగితే అప్పులు ఖరీదై, మార్కెట్లో ఖర్చులు తగ్గి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. అయితే వడ్డీ రేట్ల పెంపు ఆర్థిక వృద్ధిని మందగించేలా చేస్తుంది. అందుకే ద్రవ్యోల్బణం పెరిగినంత మాత్రాన బంగారం ధర ఒకే దిశలో నిరంతరం పెరగదు.

ప్రస్తుత బంగారం ధరల పరిస్థితి ని చూస్తే.. జూలై 2026 నెలాఖరు నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర సుమారు 4,027 డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడ్ అయింది.జూలైలో భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 1,42,295 గా నమోదైంది. జనవరి 29, 2026న నమోదైన ఆల్-టైమ్ రికార్డు రూ. 1,75,231 తో పోలిస్తే జూలైలో బంగారం కదలిక మందగించింది. ఈ ఏడాది ప్రారంభం నుండి భారత్‌లో బంగారం దాదాపు 7.3 శాతం రాబడిని అందించింది.

Also Read

ధరలు పెరగడానికి / తగ్గడానికి గల కారణాలను విశ్లేషిస్తే.. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను అధికంగా ఉంచినా, డాలర్ సూచీ బలపడినా, బాండ్ రాబడులు పెరిగినా పెట్టుబడిదారులు వడ్డీ రహిత బంగారాన్ని వదిలి బాండ్ల వైపు మళ్లుతారు. ఒకవేళ ద్రవ్యోల్బణం పెరిగి ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించినా, అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లినా, డాలర్ బలహీనపడినా బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. దీనికి తోడు భారత్, చైనా వంటి ఆసియా దేశాల్లోని గృహాల కొనుగోళ్లు, కేంద్ర బ్యాంకుల డిపాజిట్లు బంగారానికి నిరంతరం మద్దతునిస్తాయి.

పెట్టుబడిదారులు & కొనుగోలుదారులు ఇప్పుడు ఏమి చేయాలంటే.. పెళ్లిళ్లు, పండుగల కోసం నగల రూపంలో కొనుగోలు చేసే బంగారంలో తయారీ ఛార్జీలు, వేస్టేజ్ ఉంటాయి. కాబట్టి ఆభరణాలను కేవలం పెట్టుబడిగా చూడకూడదు.శుద్ధమైన పెట్టుబడి కోసం బంగారం నాణేలు, కడ్డీలు లేదా డిజిటల్ రూపాలైన గోల్డ్ ఈటీఎఫ్‌లు (Gold ETFs), గోల్డ్ ఫండ్లను ఎంచుకోవాలి. ధర తగ్గేవరకు నిరీక్షించడం కష్టం కాబట్టి, ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా విడతల వారీగా కొనుగోలు చేయడం వల్ల ధరల హెచ్చుతగ్గుల (Volatility) నుండి రక్షణ లభిస్తుంది. మొత్తం పొదుపును బంగారంలోనే పెట్టకుండా, మీ మొత్తం పెట్టుబడుల్లో బంగారాన్ని ఒక భాగంగా (10-15%) మాత్రమే ఉంచుకోవడం శ్రేయస్కరం.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ఇచ్చే స్పష్టమైన సందేశం ఏమిటంటే.. స్వల్పకాలంలో బంగారం ధరలు స్థిరంగా ఉండవచ్చు లేదా కొంత తగ్గవచ్చు. కానీ దీర్ఘకాలంలో బంగారం భద్రతను ఇచ్చే బలమైన ఆస్తిగా నిలుస్తుంది. ఇది ఆర్థిక రక్షణను అందిస్తుంది కానీ స్వల్పకాలికంగా అధిక రాబడులకు హామీ ఇవ్వదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+