బంగారం ధరల్లో ఇటీవల కనిపిస్తున్న తగ్గుదల కేవలం తాత్కాలికమేనని.. దీర్ఘకాలికంగా పసిడి తన మెరుపును కోల్పోదని ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థ వెల్స్ ఫార్గో విశ్లేషించింది. మార్చి ప్రారంభం నుండి బంగారం ధర 15 శాతం కంటే ఎక్కువగా పడిపోయి, ప్రస్తుతం ఔన్సుకు 4,500 డాలర్ల శ్రేణిలో ట్రేడ్ అవుతున్నప్పటికీ, ఇది పెట్టుబడిదారులకు ఒక వ్యూహాత్మక అవకాశమని బ్యాంకు పేర్కొంది. రాబోయే నెలల్లో ధరలు మళ్లీ పుంజుకుని.. సంవత్సరాంతానికి ఔన్సుకు 6,100 నుండి 6,300 డాలర్ల స్థాయికి చేరుకుంటాయని వెల్స్ ఫార్గో అంచనా వేస్తోంది. ఈ విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుత ధరల తగ్గుదల ఒక బేర్ మార్కెట్‌కు సంకేతం కాదు. ఎందుకంటే నిర్మాణపరమైన అంశాలు ఇప్పటికీ బంగారానికి మద్దతుగా ఉన్నాయి.
ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనా బంగారానికి అతిపెద్ద అవశాశపు శక్తిగా నిలుస్తోంది. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు, వడ్డీ ఇచ్చే బాండ్లు లేదా డిపాజిట్ల కంటే బంగారంపై పెట్టుబడి పెట్టడం వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతారు. దీనికి తోడు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వల్లో భాగంగా Gold భారీగా కొనుగోలు చేయడం కొనసాగిస్తున్నాయి, ఇది ధరలకు ఒక బలమైన పునాదిని ఏర్పరుస్తుంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ రాజకీయాల్లో తలెత్తుతున్న మార్పుల వల్ల సురక్షిత పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.

ధరలు రికార్డు స్థాయి నుండి తగ్గడానికి వెల్స్ ఫార్గో కొన్ని స్వల్పకాలిక కారణాలను గుర్తించింది. పెరిగిన ఇంధన ధరల వల్ల ద్రవ్యోల్బణ భయాలు పెరగడం, దీనివల్ల వడ్డీ రేట్ల కోత ఆలస్యం కావచ్చనే అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయి. అదే సమయంలో, అమెరికన్ డాలర్, బాండ్ రాబడులు బలపడటంతో పెట్టుబడిదారులు తాత్కాలికంగా బంగారాన్ని వదిలి వాటి వైపు మళ్లారు. అయితే, ఇది కేవలం మూలధన ప్రవాహాల్లో వచ్చిన మార్పు మాత్రమేనని, బంగారం పట్ల ఉన్న ప్రాథమిక సెంటిమెంట్‌లో మార్పు కాదని బ్యాంకు స్పష్టం చేసింది. ఈ పరిస్థితిని ఒక అనుకూలమైన ప్రవేశ బిందువుగా పరిగణించాలని వెల్స్ ఫార్గో సూచిస్తోంది.
వెల్స్ ఫార్గో తన పాత ధర లక్ష్యాన్ని సవరించి, ఏకంగా 6,300 డాలర్ల వరకు పెంచడం గమనార్హంగా చెప్పవచ్చు. ఇది ప్రస్తుత ధరల నుండి దాదాపు 35 శాతం నుండి 40 శాతం పెరుగుదలను సూచిస్తుంది. కేవలం వెల్స్ ఫార్గో మాత్రమే కాకుండా..జేపీమోర్గాన్, యూబీఎస్ వంటి ఇతర అంతర్జాతీయ బ్యాంకులు కూడా ఔన్సుకు 6,000 డాలర్ల పైనే ధర ఉంటుందని ఇలాంటి అంచనాలనే వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ మార్పులు, టారిఫ్‌లు, కొత్త నిబంధనల వల్ల మార్కెట్లో అనిశ్చితి పెరిగే అవకాశం ఉందని, అటువంటప్పుడు రక్షణ కోసం బంగారం వాడకం పెరుగుతుందని విశ్లేషణలు చెబుతున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications
