బంగారం ధరలు మళ్లీ హీటెక్కాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరిగి షాకిచ్చాయి. దింతో ఈ
వారంలో సుమారు రూ.700 నుండి రూ.800 వరకు తగ్గిన ధరలు చివరి రోజున అంటే శనివారం రూ.400 నుండి రూ.550 పెరిగాయి. జనవరి 22న బంగారం ధర మొదటిసారిగా రికార్డు ధర అయిన రూ.80,000ను దాటి కొత్త రికార్డును చేరుకుంది. నేటి రేటు ప్రకారం, ఒక బంగారు ధర ప్రాసెసింగ్ ఫీజులు, GST, హాల్ మార్కింగ్ ఫీజులతో కలిపి కనీసం రూ.90,000 వరకు ఉంటుంది. అయితే పెళ్లిళ్ల సీజన్ సమయంలో బంగారం కొనుగోళ్లు జోరుగా ఉంటాయి. కానీ పెరుగుతున్న రేట్లు సామాన్యులకు ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి.
మరోవైపు పెరుగుతున్న ధరలు జ్యువెలరీ షాపులకి కలిసి రావట్లేదు. ఎందుకంటే రేట్ల కారణంగా కస్టమర్లు పరిమితంగానే కొనుగోళ్లు చేస్తున్నారని జ్యువెలరీ షాప్ ఓనర్లు వాపోతున్నారు. మరోవైపు ధరల ట్రెండ్ ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో బంగారం ధరలు వెండి లాగానే లక్షకు చేరుకోవచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు. బంగారం, వెండి ధరలు పెరగడానికి, తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్లలోని కదలికలు, స్టాక్ మార్కెట్లో మార్పులు దీనికి కారణం. అంతేకాకుండా అమెరికా డాలర్ బలపడటం, బాండ్ దిగుబడి తగ్గడం బంగారం ధరలను ప్రభావితం చేశాయి. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత ఆర్థిక మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, సురక్షితమైన పెట్టుబడిగా బంగారంపై ఆకర్షణను పెంచింది.

ప్రస్తుతం గ్రాము బంగారం ధర
1 గ్రాము 22 క్యారెట్లు రూ.8,040 , 1 గ్రాము 24 క్యారెట్లు రూ. 8,771, 1 గ్రాము 18 క్యారెట్లు రూ. 6,578. 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 80,400, నిన్నటి ధర రూ.79,900 అంటే రూ.500 పెరిగింది. 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 87,710, నిన్నటి ధర చూస్తే రూ.87,160 దింతో రూ.550 పెరిగింది. 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ. 65,780, నిన్నటి ధర రూ.65,380 సుమారు రూ.400 పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.80,400, 24 క్యారెట్లకు రూ.87,710, 18 క్యారెట్లకు రూ.65,780, విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.80,400, 24 క్యారెట్లకు రూ.87,710, 18 క్యారెట్లకు రూ.65,780, అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.80,400, 24 క్యారెట్లకు రూ.87,710, 18 క్యారెట్లకు రూ.65,780, గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.80,400, 24 క్యారెట్లకు రూ.87,710, 18 క్యారెట్లకు రూ.65,780, నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.80,400, 24 క్యారెట్లకు రూ.87,710, 18 క్యారెట్లకు రూ.65,780, కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.80,400, 24 క్యారెట్లకు రూ.87,710, 18 క్యారెట్లకు రూ.65,780, తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.80,400, 24 క్యారెట్లకు రూ.87,710, 18 క్యారెట్లకు రూ.65,780,
కడపలో 22 క్యారెట్ల ధర రూ.80,400, 24 క్యారెట్లకు రూ.87,710, 18 క్యారెట్లకు రూ.65,780, అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.80,400, 24 క్యారెట్లకు రూ.87,710, 18 క్యారెట్లకు రూ.65,780, ఇక వెండి ధర చూస్తే 10 గ్రాములకి రూ.10,810, కేజీ ధర రూ.1,08,100.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications