బంగారం ఇకపై కొనలేరు.. ధర రూ.1.93 లక్షలు పై మాటే.. మోతీలాల్ ఓస్వాల్ సంచలన జోస్యం ఇదిగో..
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలను నడిపించే ప్రధాన శక్తులలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు కేవలం అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ భయాల ఆధారంగా సాగిన Gold పరుగు ఇకపై ద్రవ్యోల్బణ ట్రెండ్‌లు, సెంట్రల్ బ్యాంకుల ద్రవ్యపరపతి విధానాలుచ వడ్డీ రేట్ల దిశగా మళ్లుతోందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MOFSL) తన 'హెచ్1 2026 విలువైన లోహాల నివేదిక'లో విశ్లేషించింది.
కేవలం భౌగోళిక ఉద్రిక్తతలు మాత్రమే సురక్షిత ఆస్తిగా బంగారానికి నిరంతర లాభాలను అందించలేవని.. ఆ ఉద్రిక్తతలు ద్రవ్యోల్బణం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే వడ్డీ రేట్ల నిర్ణయాలపై ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయనే అంశాన్నే ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారని నివేదిక స్పష్టం చేసింది.

ఈ నివేదిక ప్రకారం 2026 రెండవ త్రైమాసికంలో మార్కెట్ వైఖరి స్పష్టంగా మారింది. అమెరికా-ఇరాన్ వివాదం, టారిఫ్ భయాల కారణంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరగడంతో, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సుదీర్ఘకాలం పాటు అధిక స్థాయిలోనే కొనసాగించే అవకాశం ఉందనే అంచనాలు బలపడ్డాయి. ఇది యూఎస్ డాలర్ బలోపేతానికి, బాండ్ ఈల్డ్స్ పెరగడానికి దారితీయడంతో స్వల్పకాలంలో బంగారానికి ఉన్న ఆకర్షణ తాత్కాలికంగా తగ్గింది.
ఫలితంగా రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో Gold ధరలు ప్రస్తుత స్థాయిల నుంచి 6-8 శాతం మేర దిద్దుబాటుకు (కనెక్షన్‌కు) గురయ్యే అవకాశాలు ఉన్నాయని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. దేశీయంగా USD/INR మారకం రేటు 95.5 వద్ద స్థిరంగా ఉంటుందని భావిస్తే.. 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,000 నుండి రూ. 1,33,000 శ్రేణికి తగ్గే అవకాశం ఉందని.. ఈ స్థాయిని అత్యుత్తమ 'కొనుగోలు జోన్'గా నివేదిక గుర్తుచేసింది.
అయితే స్వల్పకాలంలో ధరలు తగ్గినప్పటికీ, దీర్ఘకాలికంగా పసిడి రికార్డు స్థాయి పరుగు కొనసాగుతుందని బ్రోకరేజ్ సంస్థ ధీమా వ్యక్తం చేసింది. వచ్చే 12 నుండి 15 నెలల కాలవ్యవధిలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర క్రమంగా 4,800 డాలర్లకు.. ఆ తర్వాత 5,500 డాలర్లకు ఎగబాకే అవకాశముంది. దీని ప్రభావంతో భారతీయ మార్కెట్లో 10 గ్రాముల పసిడి రేటు మధ్యకాలంలో రూ. 1.68 లక్షల దిశగా పయనించి.. రాబోయే 12-15 నెలల కాలంలో ఏకంగా రూ. 1.93 లక్షల ఆల్-టైమ్ రికార్డు స్థాయికి చేరవచ్చని జ్యోస్యం చెప్పింది. సెంట్రల్ బ్యాంకుల నుండి అందుతున్న పసిడి కొనుగోలు మద్దతు, ద్రవ్యోల్బణ రక్షణగా బంగారానికి ఉన్న ప్రాముఖ్యత, ఈటీఎఫ్‌ల (ETFs) లోకి ఇన్ఫ్లోలు ఈ దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్‌కు బలమైన పునాదిగా నిలవనున్నాయని నివేదిక తెలిపింది.
ఈ పరిణామాల నేపథ్యంలో పెట్టుబడిదారులు మార్కెట్లో బాటమ్ (కనిష్ట స్థాయి) కోసం వేచి చూడకుండా.. ఒకేసారి భారీగా కాకుండా విడతల వారీగా (సిస్టమాటిక్ అప్రోచ్) కొనుగోలు చేయాలని MOFSL ప్రతిపాదించింది. ధరలు తగ్గినప్పుడల్లా కొద్దికొద్దిగా బంగారం సేకరించడం వల్ల అస్థిరత నుండి రక్షణ లభిస్తుందని తెలిపింది. మరోవైపు వెండి విషయానికి వస్తే.. విలువైన లోహంతో పాటు పారిశ్రామిక లోహంగా విద్యుదీకరణ, ఈవీ రంగాల డిమాండ్‌తో ముడిపడి ఉన్నందున, దాని ధరలలో అత్యంత తీవ్రమైన హెచ్చుతగ్గులు (Volatility) నమోదు కావచ్చని, కాబట్టి వెండి ఇన్వెస్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని నివేదిక హెచ్చరించింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
