రూ.6,600 పెరిగిన బంగారం ధర..తొందరపడి కొంటే తరువాత నష్టాలే..ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు నీ యవ్వ తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాయి. గత కొద్ది రోజుల నుండి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులతో ధరలు చుక్కలను తాకుతున్నాయి. మీ జేబులో లక్ష రూపాయలు పట్టుకుని పోతే తప్ప బంగారం 10 గ్రాములు మీ చేతికి వచ్చే సూచనలు కనపడటం లేదు. తాజాగా బంగారం ధరలు మళ్లీ రూ.లక్ష మార్కును తాకాయి.

తెలుగు రాష్టాల్లో Gold రూ. లక్షా మూడు వేల వద్దట్రేడ్ అవుతోంది. ఏపీలో Gold Rate 24 క్యారెట్లు రూ.1,00,040 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.91,700 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ నగరంలో కూడా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,040 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,700 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,030 గా నమోదైంది.

Gold market news bullion prices trade optimism impact global gold rates gold investment gold prices today market risk sentiment gold and trade talks falling gold prices gold demand decline precious metals update financial market news - - 2025 10 2025

జూలై 19న శనివారం బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 66 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.10,040 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 60 రూపాయిలు పెరిగి 9,170 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర 49 రూపాయిలు పెరిగి రూ.7,503 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 6,600 పెరిగి రూ. 10,00,400 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.6 వేలు పెరిగి రూ. 9,17,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర రూ. 4,900 పెరిగి రూ.7, 50,300 వద్ద ట్రేడ్ అవుతోంది.

ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితులతో పాటుగా ప్రధాన కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల తగ్గింపులపై ఊహాగానాలు, విలువైన లోహాలపై పెట్టుబడిదారుల ఆసక్తిని మళ్లీ పెంచాయి. ధరలు మద్దతు స్థాయిల వద్దకు తగ్గినప్పుడు, సానుకూల దృక్పథం కలిగిన ట్రేడర్లకు అవి ఆకర్షణీయమైన కొనుగోలు అవకాశాలుగా మారవచ్చు. బలమైన ఫండమెంటల్ కారకాలతో పాటు సహాయక సాంకేతిక సూచనల మద్దతుతో, వెండి ధరలు మధ్యకాలంలో మరల పెరుగుదల దిశలో పయనించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.

వారాంతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 1 నుంచి యూరోపియన్ యూనియన్, మెక్సికో దిగుమతులపై 30% సుంకం విధించే అవకాశం ఉందని హెచ్చరించటం, ఇప్పటికే నిలకడలేని చర్చలతో ఇబ్బంది పడుతున్న మార్కెట్లను మరింత అస్తవ్యస్తం చేసింది. అమెరికా సుంకాలపై ఉన్న ఈ అనిశ్చితి కారణంగా సురక్షిత పెట్టుబడుల డిమాండ్ మళ్లీ పెరుగుతోందని మేము గమనిస్తున్నామని OANDA సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు కెల్విన్ వాంగ్ పేర్కొన్నారు.

మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి కూడా తాజా టారిఫ్ షాక్ ఈక్విటీ మార్కెట్లను కుదిపేసి, విలువైన లోహాల ధరలను పెంచిందని తెలిపారు.హాకిష్ ట్రేడింగ్ భావజాలం కొనసాగితే బంగారం, వెండి ధరలు మరింత లాభపడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కామా జ్యువెలరీ ఎండీ కాలిన్ షా మాట్లాడుతూ, గత వారం దేశీయ బంగారం ధరలు రూ.97,000-రూ.99,000 శ్రేణిలో ఊగిసలాడాయని బలమైన డాలర్ ప్రభావం వల్ల ధరలు పెరిగాయని అన్నారు. ఈ ధోరణి కొంత కాలం కొనసాగొచ్చు, కానీ భారతదేశంలో పండుగ సీజన్ దగ్గరపడుతున్నందున లోకల్ డిమాండ్ మరింత పెరుగవచ్చని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచ మార్కెట్ అనిశ్చితుల మధ్య బంగారం మద్దతు పొందుతోందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అక్ష కాంబోజ్ తెలిపారు.సుంకాలపై చర్చలు జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ, పెరుగుదల భయం పెట్టుబడిదారులను జాగ్రత్తగా ఉంచుతోంది. అయితే, డాలర్ బలం స్వల్పకాలంలో బంగారం పెరుగుదలను కొంత వరకు పరిమితం చేయవచ్చని ఆమె వివరించారు.ప్రస్తుతం బంగారం కొనడం చాలా ప్రమాదకరమని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా చెబుతున్నారు. ఇది కేవలం అధిక ధరల సమస్య మాత్రమే కాకుండా మరిన్ని సమస్యలకు కారణం అవుతుంది.గత నెలలో బంగారు నగల విక్రయాలు 60 శాతం కంటే ఎక్కువ తగ్గాయి. ఇది గత ఐదేళ్లలోనే అతిపెద్ద పతనమని చెప్పుకొచ్చారు.

బంగారం షాపు యజమానులు మేకింగ్ ఛార్జీలపై డిస్కౌంట్లు ఇస్తున్నా బంగారంపై డిమాండ్ ఇప్పుడు బలహీనంగానే ఉందని చెప్పుకొచ్చారు ఆహుజా. పసిడి ధరలు మాత్రమే కాకుండా మార్కెట్‌లో ఉన్న అనేక సమస్యలు పెట్టుబడిదారులకు ఇబ్బందులు కలిగిస్తాయని కాబట్టి ఇప్పుడున్న సమయంలో పసిడి కొనడం అంత సురక్షితం కాదని చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+